Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముక్కును ముప్పుతిప్పలు పెట్టే సైనస్ వేధిస్తోందా ?
చలికాలం వచ్చిందంటే.. అందరికీ సమస్యే. చల్లటి గాలి, పొగ మంచు కారణంగా అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. జలుబు, దగ్గుతో పాటు సైనస్ ప్రాబ్లమ్ మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ వింటర్ సీజన్ లో ఆస్తమా ఉన్నవాళ్లకు, అలర్జీ ఉన్నవాళ్లకు మరింత కష్టంగా ఉంటుంది.
సైనసైటిట్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. టర్బినేట్లు వ్యాకోచించడం, ముక్కుభాగంలో సెప్టమ్ లు పక్కకు జరగడం, సైనస్ భాగాల్లో లేదా కణజాలంలో వాపు వల్ల కూడా సైన సైటిస్ సోకడానికి అవకాశముంది. ఈ సైనస్ సమస్యకు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా వచ్చే అవకాశముంది. అయితే వర్షాకాలం, చలికాలంలో సమస్య ఎక్కువగా వేధిస్తుంది.
అలర్జీ ఉన్నవాళ్లలో చలికాలంలో సమస్య మరింత పెరిగే అవకాశముంది. ఈ సైనస్ సమస్యను ముందుగానే గుర్తించాలంటే.. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా ముక్కు నుంచి నీళ్లు కారడం, తుమ్ములు, కోపం, చిరాకు, కళ్లలో నీళ్లు కారడం, తలనొప్పి, తల బరువుగా అనిపించడం, శ్వాస ఆడటంలో ఆటంకం వంటి సమస్యలు సైనస్ ను సూచిస్తాయి.

సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు దుమ్ము, ధూళి ఏ మాత్రం పడదు. కొంచెం దుమ్ము తగిలినా.. వెంటనే తుమ్ములు వస్తాయి. జలుబు చేస్తుంది. అయితే జలుబు సాధారణంగా ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు చేస్తుంది. చలికాలంలో జలుబు ఎక్కువగా చేయవచ్చు. అయితే.. ఏడాది పొడవునా.. కాలంతో పనిలేకుండా సైనస్ సమస్య వేధిస్తోంది అంటే.. మీకు సైనస్ సమస్య ఉందని గుర్తించాలి. అలాగే చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
సైనసైటిస్ సమస్య ఉన్నవాళ్లు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కి దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి, కాలుష్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు, వ్యాయామం చేయడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశముంది. అలాగే కొన్ని న్యాచురల్ రెమిడీస్ ద్వారా కూడా సైనస్ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఉల్లిపాయలు:
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న ఉల్లిపాయలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే సల్ఫర్ నాసల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చూస్తుంది. పచ్చి ఉల్లిపాయ తిని.. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
కారం పొడి:
సైనస్ నుంచి ఉపశమనం పొందడానికి కారంపొడిని కూడా ఉపయోగించవచ్చు. ముక్కులో వచ్చే ఫ్లమ్ ని తగ్గించడానికి, మున్ముందు ఏర్పడకుండా తగ్గించడానికి కారం చాలా పర్ ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కారం పొడిని ఆహారంలో కలుపుకుని తీసుకోవాలి.

వెల్లుల్లి:
ముక్కులో వచ్చే ఫ్లమ్ తో వెల్లుల్లి చక్కగా పోరాడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. అలాగే క్రోనిక్ సైన సైటిస్ సమస్యలను కూడా ఇది అరికడుతుంది.
హెర్బల్ టీ:
అల్లం, పుదినా, తులసి కలిపి హెర్భల్ టీ తయారు చేసుకోండి. ఈ టీని రోజుకి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల మీ ముక్కులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా.. హెల్తీగా ఉంటారు. అలాగే శ్వాస సంబంధిత సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications