For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి అల్సర్లకు సహజ నివారణ మార్గాలు ...

|

సాధారణంగా అందరికి ఏదో ఒక సమయంలో నోటి పుండ్లు వస్తూంటాయి. అవి ఎంతో అసౌకర్యం, ఆహారం తినాలన్నా, పానీయాలు తాగాలన్నా కష్టంగా వుంటుంది. అయితే, ఇవి తాత్కాలికమే ఒక వారం రోజుల్లో తగ్గిపోతాయి. అసలు ఈ నోటి పుండు ఎలా వస్తుంది, వాటి నివారణ ఎలా? అనేది పరిశీలించండి. మసాలాలు అధికంగా తిన్నా, పొట్టలో వేడి చేసినా, నోటి శుభ్రత సరిలేకున్నా, టూత్ పేస్ట్ ఎలర్జీ వచ్చినా, విటమిన్లు ఫోలిక్ యాసిడ్, బికాంప్లెక్స్ లు కొరతగా వున్నా, వ్యాధి నిరోధకత తక్కువున్నా, పొగతాగటం, జబ్బుపడటం, రుతుక్రమం సరిగా లేకపోయినా ఇవి వస్తూంటాయి.

ఇవి ముఖ్యంగా పెదాల లోపల చర్మానికి అంటిపెట్టుకొని పుండులా ఏర్పడుతూ భయంకరమైన నొప్పి లేదా మంటాను కలిగిస్తాయి. అంతే కాదు ఏదైనా ఆహారాన్ని మ్రింగాలన్నా లేదా త్రాగాలన్నా, చాల పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఈ రకమైన మౌత్ అల్సర్లు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు దంతాలు నోటి లోపల చర్మానికి గుచ్చుకోవడం, బ్రష్ చేసేటప్పుడు టూత్‌బ్రష్ తగిలి గాయం కావడం, నాలుకను లేదా చెంప లోపలి వైపున పొరపాటున కొరుక్కోవడం, లేదా శరీరం బాగా వేడి చేసినప్పుడు, నోటిని శుభ్రం ఉంచుకోకపోవడం, విటిమిన్స్ లోపం, ఒత్తిడి, నిద్రలోపం, డీహైడ్రేషన్ వంటి కారణంగా ఈ రకమైన అల్సర్లు వస్తుంటాయి.

ఈ నోటి అల్సర్లు ఒక్కసారి వచ్చిందంటే చాలు....24గంటలు నొప్పి, మంటను భరిస్తూనే ఉండాలి. ఎంతటి తీపిపదార్థాలు తిన్నా, నోట్లో కారం వేసినట్టు మంట పుడుతుంది. అందుకే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి సహజపద్దతుల్లో ఏమేం చేయచ్చో ఓసారి చూద్దామా...

తులసి ఆకులు:

తులసి ఆకులు:

తులసి ఆకులు మన వాకిట్లో ఉండే తులసి మొక్కతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎన్నో రకాల అలర్జీలను తగ్గించడంలో ఈ ఆకులు ప్రభావంతంగా పనిచేస్తాయి. తులసిలోని ఔషధగుణాలపై చేసిన పరిశోధనల్లో ఇందులో నోటి అల్సర్లను తగ్గించే లక్షణం కూడా ఉందని నిరూపితమైనది. దీనికోసం కొన్ని తులసి ఆకులను తీసుకొని, రోజుకు నాలుగైదు సార్లు వీటిని నమలడం వల్ల సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆకులను నమిలేటప్పుడు వాటికి కొన్ని నీళ్లు కూడా జతచేస్తే ఆ ద్రావణం నోరంతా వ్యాపించి, సమస్యను త్వరగా తగ్గిస్తుంది.

తేనె:

తేనె:

ఆహారాపదార్థాలకు అదనపు రుచిని అందివ్వడం , చర్మంపై గాయాలను మాన్పడమే కాకుండా నోటి అల్సర్లను తగ్గించడంలోనూ తేనె సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్సర్లు సమస్య ఎక్కువగా ఉన్నచోట తేనెను రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్ గుణాల కారణంగా అల్సర్లను కలిగించే బ్యాక్టీరియా త్వరగా నశిస్తుంది. తేనెలోని సహజగుణాలు నోటి లోపల తేమ ఉండేలా చేసి, అల్సర్ల వల్ల పొడిబాిరన చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. తేనెను ఉపయోగించి, అల్సర్ల నుంచి మరింత త్వరిత ఉపశమనం పొందాలంటే, దానికి చిటికెడు పసుపు కలిపితే సరిపోతుంది.

కోకొనట్:

కోకొనట్:

నేచర్ లో సహజసిద్దంగా లభించిన వాటిలో కొబ్బరి ఒకటి, నోటి అల్లర్లతో బాధపడే వారు కాస్త కొబ్బరి నూనెను నోట్లోసమస్యగా ఉన్నచోట రాస్తే ఉపశమనాన్ని పొందవచ్చు.అలాగే ఎండుకొబ్బరి ముక్కలను నమిలినా, అల్సర్ల బాధ నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఈ రెండు చిట్కాలు పాటించడం వీలుకాని వారు లేత కొబ్బరి బోండం నీటిని ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

గసగసాలు:

గసగసాలు:

శరీరంలోని వేడి తగ్గించడంలో గసగసాలు ప్రభావంతంగా పనిచేస్తాయి. నోట్లో అల్సర్లు ఇబ్బంది పెట్టడానికి కారణం అధిక వేడే. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి గసగసాలు చక్కటి ప్రత్యామ్నాయం. ఒక టేబుల్ స్పూన్ పొడిచేసిన గసగసాలకు, అంతే పరిమానంలో పంచదారను జతచేసి, సమస్య తగ్గే వరకూ రోజూ రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచిది.

ఐస్ క్యూబ్ మసాజ్ :

ఐస్ క్యూబ్ మసాజ్ :

నోటి అల్సర్ల నుంచి తక్షణ ఉపశమనానికి సమస్య ఉన్నచోట ఐస్ ముక్కలతో మర్ధనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

లవంగాలు నమిలితే:

లవంగాలు నమిలితే:

అల్సర్ బాధిస్తున్నప్పుడు తరచూ లవంగాలు నమిలితే, ఆ ఘాటుకు సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. అయితే ఇలా చేసేటప్పుడు కాస్త మంటను భరించాల్సి ఉంటుంది.

హాట్ వాటర్ పుల్లింగ్:

హాట్ వాటర్ పుల్లింగ్:

గోరువెచ్చని నీటితో నోటిని వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించాలి. ఇలా చేస్తే అల్సర్లు కారణంగా ఎదురయ్యే మంట నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు .

మజ్జిగ:

మజ్జిగ:

చల్లని మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే నోటి అల్సర్ల సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

నెయ్యి:

నెయ్యి:

నోటి అల్సర్ ను నివారించే మరో నేచురల్ రెమెడీ నెయ్యి. అల్సర్ ఉన్న చోట నెయ్యిని అప్లై చేస్తే మంచిది .

విటమిన్ బి12:

విటమిన్ బి12:

సాధారనంగా శరీరంలో విటమిన్ బి12 శాతం తగ్గిపోతే నోటి అల్సర్లు వంటి సమస్య ఎక్కువగా ఎదురవుతాయి. వైద్యుల సలహా మేరకూ విటమిన్ బి12 మందులు వాడితే సమస్య పరిష్కారవుతుంది.

విటమిన్ సి:

విటమిన్ సి:

విటమిన్ సి అధికంగా ఉండే కమలా పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు .

పచ్చిఉల్లిపాయలు:

పచ్చిఉల్లిపాయలు:

ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలను తీసుకోవాలి. వీలైతే వీటిని సలాడ్లలో కూడా జతచేసి తీసుకోవడం వల్ల నోటి అల్సర్ల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

అలోవెర:

అలోవెర:

ఇది ఎఫెక్టివ్ నేచరల్ హోం రెమెడీ . అలోవెర జెల్ ను రెండు టేబుల్ స్పూన్స్ రోజులో మూడుపూటలా తీసుకోవడం వల్ల మౌత్ అల్సర్ తగ్గించుకోవచ్చు

English summary

Natural Home Remedies for Mouth Ulcers

Natural Home Remedies for Mouth Ulcers,Mouth ulcers can be quite painful and depending on their specific location in the oral cavity, often interfere with your ability to eat and speak. Discussed below are some of the natural and simple home remedies for the treatment of canker sores or burning ulcers.
Story first published: Saturday, February 6, 2016, 13:42 [IST]
Desktop Bottom Promotion