For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డస్ట్ అలర్జీ దూరం చేసే.. సింపుల్ హోం రెమిడీస్

By Swathi
|

చాలామందికి దుమ్ము, ధూళి ఏది తగిలినా.. అలర్జీ వస్తుంటుంది. కనీసం ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి కూడా వీలుండదు. ఏ మాత్రం చల్లటి గాలి, దుమ్ము, ధూళి ఉన్న వస్తువులు కదిలించినా.. ఇట్టే తుమ్ములు వేధిస్తాయి. వెంటనే జలుబు చేసి.. అలసటకు కారణమవుతుంది. ఇలాంటి డస్ట్ అలర్జీకి మందులే పరిష్కారమా ?

డస్ట్ అలర్జీతో బాధపడేవాళ్లు మందులపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి అలర్జీలకు న్యాచురల్, హోం రెమిడీస్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే.. డస్ట్ అలర్జీకి దూరంగా ఉండవచ్చు. మందులకు ఖర్చు పెట్టినా.. వాటి ద్వారా తాత్కాలిక ఉపశమనం మాత్రమే పొందగలుగుతారు. కాబట్టి న్యాచురల్ రెమిడీస్ తో.. అలర్జీని ఎప్పటికీ దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఉల్లి, వెల్లుల్లి

ఉల్లి, వెల్లుల్లి

ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉండేలా ఆహారం తయారు చేసుకోవాలి. వాటిల్లో క్వెర్సెటిన్ ఉంటుంది. అది ఇన్ల్ఫమేటరీ రియాక్షన్స్ ని దూరంగా ఉంచుతాయి. ఒకవేళ అలర్జీ మొదలై ఉంటే.. వాటిని తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

ఒమేగా త్రీ యాసిడ్స్

ఒమేగా త్రీ యాసిడ్స్

ఫ్లాక్స్ సీడ్స్, ఫిష్, వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ గుణాలు శరీరంలో ఇన్ల్ఫమేటరీ కెమికల్స్ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తాయి. అలాగే యాంటీ అలర్జీ మినరల్ అయిన సెలీనియం కూడా వీటిలో ఉంటుంది. కాబట్టి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల అలర్జీలు నివారించవచ్చు.

వాటర్

వాటర్

మీ వ్యాధినిరోధక శక్తి పెంచడంలో నీళ్లు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. హైడ్రేషన్ లెవెల్స్ ని ఎక్కువగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల సైనస్ నుంచి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. కొంచెం సీ సాల్ట్ ని నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల.. మరింత ఫలితం ఉంటుంది.

టీ

టీ

అలర్జీ రియాక్షన్ ఉన్నప్పుడు గ్రీన్ టీ, చమోమిలే టీ తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే యాంటీ హిస్టామైన్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే అలర్జీను తగ్గించడానికి సహాయపడతాయి.

పండ్లు

పండ్లు

విటమిన్ సి ఫ్రూట్స్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు సైనస్, ఇన్ల్ఫమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరంజ్, స్ట్రాబెర్రీ, యాపిల్, కివీ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

రోజ్ మేరీ

రోజ్ మేరీ

రోజ్ మెరీలో రొజజ్మరినిక్ యాసిడ్ ఉంటుంది. అలర్జీ రియాక్షన్స్ ని తగ్గిస్తాయి. అలాగే ఇన్ల్ఫమేషన్ కి కారణమయ్యే వాటిని అరికడతాయి.

తేనె

తేనె

అలర్జీలు నివారించడంలో తేనె చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. న్యాచురల్ గా లభించే తేనెను రోజూ తీసుకుంటూ ఉంటే.. తరచుగా వేధించే అలర్జీలు శాశ్వతంగా దూరమవుతాయి.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

సైనస్ వంటి అలర్జీల నుంచి ఉపశమనం పొందడానికి స్పైసీ ఫుడ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చిల్లీ పెప్పర్స్, తాజా వెల్లుల్లి, మిరియాలు వంటివి తీసుకుంటూ ఉండాలి.

చూశారుగా సింపుల్ గా ఉన్న టిప్స్ ఫాలో అయితే.. మిమ్మల్ని వేధించే అలర్జీలకు దూరంగా ఉండవచ్చు.

English summary

Natural Remedies for Allergy

Natural Remedies for Allergy. Most people take over the counter allergy medication to resolve seasonal allergies, but there are also natural ways to avoid symptoms without having to spend tons of money every year!!!
Story first published: Thursday, February 11, 2016, 16:36 [IST]
Desktop Bottom Promotion