For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంతాలు జివ్వున లాగడం, నొప్పి, క్యావిటీ సమస్యలకు నేచురల్ హోం రెమెడీస్

|

క్యావిటీస్ అనేది దంతసమస్యలో సాధారణంగా ఉంచే సమస్య. పిల్ల నుండి పెద్దలకు వరకూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మనం ఎంత సరిగా బ్రష్ చేసుకొన్నా, పళ్ళ మధ్యన ఎంతోకొంత తిండి పదార్దాలు ఇరుక్కొని ఉండటం వలన, దంతక్షయం మొదలు అవుతుంది. సాధారణంగా మనం ఏదైనా తిన్నప్పుడు మన నోటల్లోని బ్యాక్టీరియా దినిపై చేరి పాచి (ప్లాక్)లా ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం తిన్న ఆహారంలో చక్కెర, పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా పెరుగుదల మరీ ఎక్కువ. వాటి నుంచి యాసిడ్స్ తాయరై పంటిపై దుష్ప్రభావం చూపడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఇదే క్రియ అదేపనిగా జరగడం వల్ల పంటి ఎనామిల్ క్యావిటీస్ ఏర్పడతాయి.

ఇక ఆహారంలోని చక్కెర, పిండి పదర్ధాలు నోటిలోని లాలాజలంలోనూ చక్కెర శాతం ఎక్కువై బ్యాక్టీరియా మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో ప్లాక్ మరింత పెరిగి అది బ్రసింగ్ తో తొలగించలేని 'గార'(టార్ టార్ )లా రూపొందుతుంది. ఈ పరిస్థితి వల్ల దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్, ఇన్ ఫ్లమేషన్ దారితీయవచ్చు.

దాంతో పళ్ల మధ్య రంధ్రాలు(క్యావిటీస్)కూడా ఏర్పడుతాయి. దీనికి కారణం సరిగ్గా బ్రష్ చేసుకోకకుండా రోజంతా చాలా సార్లు స్వీట్స్, చాకోలెట్స్ తినేవారిలో ఇది చాలా ఎక్కువ. కాబట్టి ఎవైనా ఆహారాలు తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం మంచిది. ఏదైనా స్వీట్ తిన్నవెంటనే బ్రష్ చేసుకోవాలి. మనం స్వీట్ తిన్న వెంటనే సాధారణంగా మన నోట్లో ఉండే బ్యాక్టీరియా దానిపై చేరి పాచిలా ఏర్పడుతుంది. దాని నుంచి మరిన్ని యాసిడ్స్ తయారు కావడం, అవి పంటిపై దుష్ర్పభావం చూపడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. దీనివల్ల పంటిపై రంధ్రాలు ఏర్పడి అవి నల్ల మచ్చల్లా కనిపిస్తాయి.దంత క్షయానికి దారితీస్తుంది.

కావిటీ సమస్య ప్రారంభ దశలో గుర్తించినట్లైతే , ఈ సమస్యను నివారించుకోవడానికి డెంటిస్ట్ వద్ద వెళ్ళడానికి ముందు కొన్ని హోం రెమెడీస్ ట్రై చేయండి. క్యావిటి నివారించే కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం..

లవంగం నూనె:

లవంగం నూనె:

క్యావిటిని నివారించడంలో క్లోవ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. చాలా నొప్పిపెడుతున్నదంతానికి లవంగం నూనెలో అద్దిన కాటన్ బాల్ తో మర్దన చేయాలి. నొప్పి ఉన్న దంతానికి చుట్టూ కూడా లవంగం ఆయిల్ ను అప్లై చేయాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేయవచ్చు. లవంగం నూనె మరీ ఘాటుగా అనిపిస్తే, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకోవచ్చు.

సాల్ట్ వాటర్ తో గార్గిలింగ్ చేయడం:

సాల్ట్ వాటర్ తో గార్గిలింగ్ చేయడం:

శీఘ్రంగా మీ దంతాల నొప్పినివారించడానికి ఉప్పు ఒక గొప్ప పరిష్కారం. అందుకు మీరు చేయాల్సిదల్లా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నోటిని పుక్కలించాలి. మొదటికొన్ని వాష్ లలోనే మీ నొప్పి లో మార్పును మీరు గమనించవచ్చు. మీరు కొంచెం ఉపశమనం పొందవచ్చు. ఇలా కొన్ని సార్లు చేయడం వల్ల 90శాతం నొప్పి తగ్గుతుంది.

గార్లిక్:

గార్లిక్:

వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఇతర ఔషధగుణాలు కలిగి ఉండటం వల్ల, ఇది దంతాల్లో క్యావిటిని ,నొప్పిని నివారిస్తుంది. మరియు ఇది నోట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది. వెల్లుల్లి ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను రఫ్ గా నమిలిన నొప్పిఉన్న దంత మీద అలాగే కొద్ది సమయం ఉంచుకోవాలి , ఇలా చేయడం వల్ల జ్ఞానదంతాల నొప్పిని నివారించుకోవచ్చు. ఇంకా ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల కూడాక్వావిటి నివారించుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా , ఒకటి,రెండు వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి అందులో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి, నొప్పి ఉన్నప్రదేశంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. దీన్నికొన్నినిముషాలు అలాగే ఉంచి తర్వాత ఉమ్మివేయాలి . ఈ చిట్కాలను రోజులో ఒకటి లేదా రెండు సార్లు అనుసరించాల్సి ఉంటుంది.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని నేచురల్ టీ రెమెడీగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఆయుర్వేదిక్ రెమెడీ . పసుపులో డిప్ చేసిన కాటన్ క్లాత్ ను పంటిమీద పెట్టాలి. నొప్పి నివారించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యావిటిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

దంతక్షయానికి నిమ్మరసం గ్రేట్ హోం రెమెడీ. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొద్దిగా నిమ్మరసంను నొప్పి ఉన్న దంతాల మీద అప్లై చేయడం వల్ల దంత క్షయం వల్ల వచ్చే టూత్ క్యావిటిని నివారించుకోవచ్చు.

ఆవనూనె:

ఆవనూనె:

రెండు టీస్పూన్ల ఉప్పు , అంతే పరిమాణంలో ఆవనూనె వేసి మసాజ్ మిక్స్ చేసి నొప్పి ఉన్న దంతాల మీద అప్లై చేయాలి . లేదా బ్రెష్ చేయాలి. 5 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

టూత్ డెకె, టూత్ క్యావిటిని నివారించడంలో టీట్రీ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ ను తీసుకుని, అందులో కాటన్ బాల్ డిప్ చేసి, నొప్పి ఉన్న దంత మీద పెట్టాలి. కొద్దిసేపు అలాగే ఉంచడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. టీట్రీ ఆయిల్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి.

వీట్ గ్రాస్ :

వీట్ గ్రాస్ :

గోధుమ గడ్డి . గోధుమ గడ్డి మరో నేచురల్ హోం రెమెడీ. టూత్ క్యావిటిని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో నేచులర్ యాంటీ బయోటిక్, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది మరియు నోట్లోని టాక్సిన్స్ ను నివారిస్తుంది. నొప్పిని అరికడుతుంది.కొద్దిగా గోధుమ గడ్డిని నోట్లో వేసుకొని నమలాలి, తర్వాత వాటిని ఉమ్మివేయాలి . అవసరం అయినప్పు ఇలా చేస్తుంటే నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా ,గోధుమ గడ్డి జ్యూస్ ను మౌత్ వాష్ కోసం కూడా ఉపయోగించి, నొప్పిని తగ్గించుకోవచ్చు.

పిప్పర్ మింట్ ఆయిల్

పిప్పర్ మింట్ ఆయిల్

ఆయుర్వేదంలో పురాతన కాలం నుండి పుదీనాకు కూడా ప్రత్యేక స్థానం ఉంది, . జ్ఝాన దంతాల నొప్పిని నివారించుకోవడంలో పెప్పర్ మింట్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పిని మరియు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాటన్ బాల్ ను పెప్పర్ మింట్ ఆయిల్లో డిప్ చేసి నొప్పి ఉన్న దంత మీద అప్లై చేసి అలాగే ఉంచడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

అల్లం:

అల్లం:

అల్లం ఇంట్లో ఉంటే చాలు దంతాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మరే ఔషదం అవసరముండదు . అల్లంశుభ్రంగా కడిగి పొట్టు తొలగించి సన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొన్ని పీసులను నోట్లో వేసుకొని బాగా మలలానలి . ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు.

English summary

Natural Remedies To Cure Cavities

Are you suffering from cavities? Unable to sleep properly during the night due to extreme pain caused by cavities? Cavities are the worst things that can disrupt your oral hygiene.
Story first published: Tuesday, July 19, 2016, 8:23 [IST]
Desktop Bottom Promotion