For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో సన్ రాషెస్, స్వెట్ పింపుల్స్ నివారించే నేచురల్ రెమెడీస్

|

వేసవి కాలం వస్తూ వస్తూ వేడితో పాటు అనేక ఆరోగ్య సమస్యల్ని కూడా మోసుకొస్తుంది. వీటిలో ముఖ్యంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య వేడి కురుపులు. ముఖం, చేతులు, కాళ్లు...ఇలా పలు శరీర భాగాల్లో ఎర్రటి దద్దుర్లుగా ఇవి ఏర్పడుతుంటాయి. ఇందుకు వాతావరణంలోని వేడి ఒక కారణమైతే..శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం మరో కారణం. అంతే కాదు...వీటి వల్ల భరించలేని నొప్పి కూడా వేధిస్తుంటుంది.

ఎండాకాలంలో చెమట వల్ల చర్మం సూక్ష్మరంధ్రాలలో అవరోధం ఏర్పడి, కొన్నిసార్లు అక్కడ దుమ్ము, ధూళి చేరి, ఇన్‌ఫెక్షన్ తద్వారా గడ్డలు, పొక్కులు ఏర్పడుతుంటాయి. వీటినే వేడి కురుపులు, సెగ్గడ్డలు అనీ, నీటిపొక్కులు (నీటితో నిండినవి) అనీ పిలుస్తారు. వాతావరణ కాలుష్యం వల్ల చెమట గ్రంథులు, నూనె గ్రంథులు మూసుకొనిపోయి, అక్కడ కురుపులు, గడ్డలు, పొక్కులు వస్తుంటాయి. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు. వయసు, వచ్చే తీరును బట్టి వీటికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ నీటి పొక్కులకు, చిన్న చిన్న గడ్డలకు చిట్కాలు బాగా పనిచేస్తాయి.

Natural Remedies for Summer Heat Rashes

మరి, సాధారణంగా వేసవికాలంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యను తగ్గించుకోవడానికి సహజసిద్దమైన పదార్థాలు అనేకం ఉన్నాయి. వీటి వల్ల వేడి వల్ల వచ్చే సన్ రాషెస్...వేడి కురుపులను నివారించుకోవచ్చు.

పసుపు:

పసుపు:

పసుపులోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు వేడి కురుపులు, వాటి వల్ల ఎదురయ్యే నొప్పి నుంచి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇందుకోసం అల్లం, పసుపు..రెండింటిని సమాన పరిమాణాల్లో తీసుకొని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసి ఒక శుభ్రమైన గుడ్డతో దాని చుట్టూ కట్టు కట్టేయాలి. అయితే ఇది కాస్త మంటగా అనిపించినా నొప్పి తగ్గి...తద్వారా సమస్య కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. అలాగే గ్లాసు పాలు లేదా నీళ్లలో చెంచా పసుపు వేసి బాగా మరిగించి తీసుకున్నా ఫలితం ఉంటుంది.

వేప:

వేప:

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ వంటి ఎన్నో గుణాలు కలగలసిన పదార్థం వేప. ఇది వేడి కురుపులకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఇందుకోసం పిడికెడు వేపాకుల్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ని సమస్య ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య నుంచి వీలైనంత త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే కొన్ని నీళ్లలో పిడికెడు వేపాకుల్ని వేసి ఆ నీరు మూడోవంతుకు తగ్గే వరకూ మరిగించాలి. ఆ తర్వాత చల్లారినిచ్చి వడకట్టుకోవాలి. ఈ మిశ్రమంతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసినా ఫలిత ఉంటుంది. వేప..వేడి కురుపుల్ని పోగొట్టడంతో పాటు ఇతర చర్మ ఇన్ఫెక్షన్లను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.

కార్న్ ఫ్లోర్:

కార్న్ ఫ్లోర్:

వేడి కురుపుల్నినేచురల్ గా తొలగించే శక్తి మొక్క జొన్న పిండికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక కప్పు మరుగుతున్న నీటిలో సరిపడినంత మొక్క జొన్న పిండి వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కురుపుపై రాసి శుభ్రమైన గుడ్డతో కట్టు కట్టేయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు కొన్ని రోజుల పాటు చేయడం వల్ల సమస్య తగ్గిపోవడంతో పాటు దాన్నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కూడా జాగ్రత్తపడవచ్చు.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

వేడి కురుపుల్ని త్వరగా తగ్గించుకోవాలంటే అందుకు టీట్రీ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు ఈ నూనెలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ వంటి గుణాలు బాగా దోహదం చేస్తాయి. ముందుగా శుభ్రమైన కాటన్ ని తీసుకొని దాన్ని నూనెలో డిప్ చేయాలి . ఈ కాటన్ బాల్ ను నెమ్మదిగా కురుపుల మీద అప్లై చేయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు కొన్ని రోజుల పాటు చేయడం వల్ల సమస్య, నొప్పి రెండూ తగ్గుతాయి. అయితే టీట్రీ ఆయిల్ కొందరికి పడక చర్మంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఈ చిట్కా పాటించడం మంచిది.

అలొవెరా జ్యూస్ ను అప్లై చేయాలి:

అలొవెరా జ్యూస్ ను అప్లై చేయాలి:

వేసవిలో వేడి వల్ల చర్మం మీద ఏర్పడ రాషెస్ తగ్గించుకోవడానికి అలోవెర జెల్ ను చర్మం మొత్తం అప్లై చేస్తే చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

పాల మీగడ లేదా చల్లటి పాలు:

పాల మీగడ లేదా చల్లటి పాలు:

చల్లటి పాలను చర్మానికి అప్లై చేస్తే అద్బుతమైన ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది . పాలలో కాటన్ బాల్స్ ను డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి ఇలా ఒక రోజులో 8-10సార్లు చేసినట్లైతే సన్ రాషెస్ నుండి తక్షణ, శాస్వత ప్రభావం పొందవచ్చు.

ఆముదం:

ఆముదం:

ఆముదంలో ఉన్న యాంటీసెప్టిక్ గుణాలు వేడి కురుపుల్ని పూర్తిగా తొలగిస్తాయి. రెండు చుక్కల ఆముదాన్ని ఒక కాటన్ వాల్ పై వేసి దాంతో కురుపు ఉన్న చోట నెమ్మదిగా రాయడం వల్ల అది క్రమంగా తగ్గుతుంది.

జీలకర్ర:

జీలకర్ర:

జీలకర్ర తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా సమస్య ఉన్న చోట అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల వేడి కురుపు మటుమాయమైపోతుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

ఒక టీస్పూన్ బేకింగ్ సోడ, ఓట్ మీల్ పౌడర్ ను బాత్ టబ్ లో వేసి , రాషెస్ ఉన్న ప్రదేశంలో ఆనీటితో స్నానం చేయాలి.

గంధం:

గంధం:

చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అందివ్వడంలో సాండిల్ ఉడ్ గ్రేట్ గా సహాయపడుతుంది . గంధం మరియు రోజ్ వాటర్ పేస్ట్ మిక్స్ చేసి అఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేసి, 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Natural Remedies for Summer Heat Rashes in telugu

Summer season brings in the most common skin problem, prickly heat rashes. These rashes are caused due to skin cell damage. Perspiration leads to skin cell damage which traps the sweat. When the sweat is trapped beneath the skin, the infection causes rashes.
Desktop Bottom Promotion