For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకింగ్ చేసేవాళ్ల లంగ్స్ శుభ్రం చేసే హోంమేడ్ డ్రింక్

By Swathi
|

స్మోకింగ్ చేయడం ప్రమాదకరం అని అందరికీ తెలుసు. కానీ.. దీనికి ఒక్కసారి అలవాటు పడిన తర్వాత.. ఎట్టిపరిస్థితుల్లో మానేయలేకపోతారు. దమ్ముకొట్టే వాళ్ల హెల్త్ రానురాను క్షీణిస్తూ ఉంటుంది. దీనివల్ల ఒకదానికి ఒక అనారోగ్య సమస్య ఎదురవుతూ ఉంటుంది. కానీ.. ఏ మాత్రం కేర్ తీసుకోరు.

స్మోకింగ్ అనేది అడిక్షన్ లాంటిది. ఒక్కసారి అలవాటు పడిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాదు. ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. స్మోకింగ్ వల్ల అలసట, దగ్గు, క్షయ, లంగ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శారీరక ఆరోగ్యంతో పాటు, సిగరెట్ స్మోకింగ్ వల్ల సైకలాజికల్ గా కూడా సమస్యలు ఎదురవుతాయి.

One Homemade Recipe That Cures A Smoker's Lungs

స్మోకింగ్ వల్ల వాళ్లకున్న డైలీ యాక్టివిటీస్ ని కూడా మిస్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు రన్నింగ్, ఎక్సర్ సైజ్ వంటి రకరకాల యాక్టివిటీస్ కి దూరంగా ఉండిపోతారు. దీనివల్ల రెస్పిరేటరీ ఫంక్షన్ తగ్గిపోతుంది. స్మోకింగ్ చేసేవాళ్ల ప్లాక్, టాక్సిన్స్ రెస్పరేటరీ ట్రాక్స్ ని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల లంగ్ క్యాన్సర్, శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి స్మోకింగ్ చేసే వాళ్ల లంగ్స్ ని డెటాక్స్ చేయడం చాలా అవసరం. స్మోకింగ్ చేసేవాళ్లు టాక్సిన్స్ అంటే మలినాలను న్యాచురల్ పద్ధతిలో బయటకు పంపవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. లంగ్ డెటాక్స్ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

One Homemade Recipe That Cures A Smoker's Lungs

తాజా అల్లం తురుము కొద్దిగా
2 టేబుల్ స్పూన్ల పసుపు
కొన్ని వెల్లుల్లి రెబ్బలు
2 టేబుల్ స్పూన్ల పంచదార

అల్లం, వెల్లుల్లి, పసుపు ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలను ఎఫెక్టివ్ గా తరిమేయగలవు. అలాగే కొన్ని రోజుల్లోనే... టాక్సిన్స్ ని బయటకు పంపి.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు స్మోకింగ్ వల్ల వచ్చే దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి. ఈ రెసిపీకి తీపి రుచిని అందివ్వడానికి పంచదార సహాయపడుతుంది.

One Homemade Recipe That Cures A Smoker's Lungs

ఈ రెసిపీ తయారు చేసే విధానం
కొన్ని నీళ్లు తీసుకుని.. బాగా మరగనివ్వాలి.
మరుగుతున్న నీటిలో.. పైన చెప్పిన పదార్థాలన్నీ వేయాలి
ఆ నీటిని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లోకి వడకట్టుకోవాలి.
చల్లారిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
ఈ డ్రింక్ ని కనీసం 2 నెలలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

One Homemade Recipe That Cures A Smoker's Lungs

One Homemade Recipe That Cures A Smoker's Lungs. Did you know that there is a natural way to flush out the toxins from your lungs, by using kitchen ingredients? Well, learn all about it here.
Story first published:Saturday, May 14, 2016, 15:36 [IST]
Desktop Bottom Promotion