For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అశ్వగంధ మూలికలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

By Swathi
|

అశ్వగంధం అనేది ఒక మూలిక. దీన్ని మన పూర్వీకుల కాలం నుంచి.. ఉపయోగిస్తారు. అనేక వ్యాధులు నయం చేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది అశ్వగంధ చూర్ణాన్ని ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటారు. ఇందులో చాలా ముఖ్యమైన హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయని తాజా అధ్యయనాలు కూడా నిరూపించాయి.

అలర్ట్: హోమియోపతిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసా ? అలర్ట్: హోమియోపతిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసా ?

అశ్వగంధ అంటే.. అరోమా ఆఫ్ హార్స్ అని అర్థం. ఈ మూళిక చాలా చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ఈ అశ్వగంధ మొక్క నుంచి.. ఆకులను, చూర్ణాన్ని, పొడి తయారు చేసి.. చాలా మెడిసిన్స్ లో ఉపయోగిస్తాయి. ఈ అశ్వగంధంలో మెడిసినల్ గుణాలు ఉన్నాయని.. ఆయుర్వేదం కూడా చెబుతుంది.

'అధిక బరువు' , 'ఊబకాయం'తగ్గేందుకు 'ఆయుర్వేదంలో రహస్యాలు.. 'అధిక బరువు' , 'ఊబకాయం'తగ్గేందుకు 'ఆయుర్వేదంలో రహస్యాలు..

అశ్వగంధ చూర్ణాన్ని రకరకాల అనారోగ్య సమస్యలు నివారించడానికి ఉపయోగించవచ్చని.. ఆయుర్వేద డాక్టర్లు వెల్లడిస్తున్నారు. మెడికల్ ఉపయోగాలు ఉన్న అశ్వగంధ చూర్ణం వల్ల పొందే రకరకాల ప్రయోజనాలు ఏంటి ? ఎలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వ్యాధినిరోధక వ్యవస్థ

వ్యాధినిరోధక వ్యవస్థ

వ్యాధినిరోధక వ్యవస్థను మరింత మెరుగు పరడంతో అశ్వగంధ చూర్ణంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రయోజనం. మనుషుల శరీరంలోని రక్తం ఆక్సిజనరేట్ అయి.. ఇతర వ్యాధులు సోకకుండా పోరాడుతుంది.

యాంటీ ఇన్ల్ఫమేటరీ

యాంటీ ఇన్ల్ఫమేటరీ

అశ్వగంధ చూర్ణంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి.. ఇది ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులు వంటి రకరకాల నొప్పులు తగ్గిస్తుంది. అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది.

యాంటీ ఆక్సిడెంట్

యాంటీ ఆక్సిడెంట్

అశ్వగంధ చూర్ణంలో బయోకెమికల్ పదార్థాలు ఉండటం వల్ల.. అవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. అశ్వగంధంపై తాజా లాబొరేటరీ పరీక్షలలో ఈ విషయాన్ని వెల్లడించారు.

డిప్రెషన్

డిప్రెషన్

డిప్రెషన్ తో బాధపడే వాళ్లకు అశ్వగంధ అద్భుత ఔషధంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ డిప్రజంట్.. డిప్రెషన్ ని తగ్గించి.. ప్రశాంతతను కలిగిస్తుంది.

యాంటీ ఏజింగ్

యాంటీ ఏజింగ్

అశ్వగంధలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వయసుపెరుగుతున్న ఛాయలు కనిపించకుండా చేయడంలో అశ్వగంధ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలోని కణాలను హెల్తీగా ఉంచుతుంది. దీనివల్ల వయసు పైబడిన ఛాయలు కనిపించకుండా దూరంగా ఉంటారు.

డిమెంటియా

డిమెంటియా

జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి తగ్గిపోవడాన్ని డిమెంటియా అని పిలుస్తారు. ఇది మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువపై వయసైపోయిన వాళ్లలో వస్తుంటుంది. కాబట్టి రోజూ ఈ అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల.. డిమెంటియా, అల్జీమర్స్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.

క్యాన్సర్

క్యాన్సర్

క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి అద్భుతమైన మూళిక అశ్వగంధలో ఉంది. కాబట్టి కీమో థెరపీ చేయించుకుంటున్న వాళ్లు రెగ్యులర్ గా అశ్వగంధ పౌడర్ తీసుకుంటూ ఉంటే.. క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి అనేది ప్రస్తుత రోజుల్లో స్లో పాయిజన్ లా మారింది. కాబట్టి దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఒత్తిడి నుంచి బయటపడానికి తేలికైన ఉపాయం అశ్వగంధ చూర్ణం లేదా పౌడర్ అని సలహా ఇస్తున్నారు నిపుణులు.

 లైంగిక సమస్యలు

లైంగిక సమస్యలు

లైంగిక సమస్యలు సాధారణం. ఈ సమస్యలకు వెంటనే ట్రీట్మెంట్ అందివ్వడం చాలా అవసరం. అశ్వగంధలోని అద్భుత ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది. అశ్వగంధ చూర్ణం ద్వారా లైంగిక సమస్యల నుంచి వేగంగా ఉపశమనం పొందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

Overall Benefits Of Ashwagandha Churna

Overall Benefits Of Ashwagandha Churna. Popularly known as Winter Cherry and Indian Ginseng, Ashwagandha is a powerful herb that has proven its strong health benefits through the ages.
Desktop Bottom Promotion