For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మట్టి విగ్రహం తీసుకురావడం వల్ల వాతావరణానికే కాదు, ఆరోగ్యానికీ మంచిది..!!

By Swathi
|

వినాయక చవితికి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారు. స్వీట్స్, డ్రెస్సెస్, డెకరేషన్స్, విగ్రహం తెచ్చుకోవడం వంటి పండుగ పనుల్లో ఆర్భాటంగా ఉంటారు. కానీ మీరు ఒకవేళ ఏ విగ్రహం తీసుకురావాలి అనే ఆలోచనలో ఉంటే.. మీరు ఖచ్చితంగా మట్టి గణపతినే తీసుకురావడం మంచిది.

కలర్ ఫుల్ గా, మెరిసిపోతూ, పెయింటింగ్ తో ఉండే వినాయక విగ్రహాలు అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి. కానీ.. వీటివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి.. వాటికి దూరంగా ఉండటమే మంచిది. వాటికి బదులు మట్టి గణపతులు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి.

ఎకో ఫ్రెండ్లీ గణపతులను మట్టితో తయారు చేస్తారు. కాబట్టి.. ఇవి నిమజ్జనం చేసినప్పుడు తేలికగా మట్టిలో కలిపోగలవు. మట్టి గణపతినే ఎందుకు తీసుకురావాలి అనేదానిపై కొన్ని ముఖ్యమైన కారణాలు తెలుసుకుంటే.. ఖచ్చితంగా మట్టి గణపతినే తీసుకొస్తారు.

మట్టి విగ్రహాలు

మట్టి విగ్రహాలు

మట్టి విగ్రహాలు మనుషుల జీవితంపై, వాతావరణంపై ఎలాంటి దుష్ర్పభావం చూపించవు. ఇవి కాస్త డల్ గా కనిపించినా.. ఎట్రాక్ట్ చేయకపోయినా.. ఆరోగ్యానికి, వాతావరణానికి ఇవే.. మంచిది.

నరాలపై ప్రభావం

నరాలపై ప్రభావం

వినాయకుడి విగ్రహం అలంకరణ కోసం ఉపయోగించే కలర్్స్ లో ఎక్కువ మొత్తంలో మెర్క్యురీ, లెడ్ ఉంటుంది. ఇవి నరాల వ్యవస్థపై, పిల్లలు, గర్భిణీ స్త్రీలపై చాలా దుష్ర్పభావం చూపిస్తాయి. కాబట్టి కలర్ ఫుల్ గణేష్ కి బదులు.. మట్టి గణపతిని తీసుకురావడం మంచిది.

జీర్ణవ్యవస్థపై

జీర్ణవ్యవస్థపై

వినాయకుడి విగ్రహాలను అందంగా అలంకరించడానికి ఉపయోగించే.. డైలు చాలా హానికరమైనవి. ఇందులో హానికారక మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థపై చాలా దుష్ర్పభావం చూపిస్తాయి.

ఊపిరితిత్తులకు

ఊపిరితిత్తులకు

డైస్, కలర్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటివన్నీ విగ్రహం తయారి కోసం ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యంపై చాలా దుష్ర్పభావం చూపుతాయి. ఈ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కలుషితం అవుతాయి. ఆ నీళ్లు ఊపిరితిత్తులపై దుష్ర్పభావం చూపుతాయి. గ్లిట్టర్స్ చేతులకు అంటడం వల్ల అవి లంగ్స్ తీవ్ర డ్యామేజ్ చేస్తాయి.

స్కిన్ ఎలర్జీ

స్కిన్ ఎలర్జీ

కలర్ ఫుల్ వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలని ప్రయత్నించినప్పుడు... చర్మంపై అలర్జీలు, ర్యాషెస్ కి కారణమవుతాయి. కాబట్టి మనమెందుకు ఇన్ని అనర్థాలు చేయాలి. కాబట్టి మట్టి విగ్రహాలు తెచ్చుకుంటే.. ఎలాంటి హాని జరగదు.

కళ్లకు

కళ్లకు

కలర్ గణేష్ వల్ల శరీరంలోని మరో భాగమైన కళ్లకు హాని కలుగుతుంది. కలుషితమైన నీళ్లు.. కళ్లలోకి వెళ్లడం వల్ల.. మంటగా అనిపించడం, కళ్లలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మట్టి గణపతికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. మన, మన కుటుంబంతో పాటు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది.

English summary

Ganesh Chaturthi: Reasons You Should Get Home Eco-friendly Ganesha Idols

Ganesh Chaturthi: Reasons You Should Get Home Eco-friendly Ganesha Idols. Just a few days are left for the year's biggest puja - Ganesh Chaturthi which falls on September 5 this year.
Desktop Bottom Promotion