For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చూపుడువేలుని 60సెకన్లు మసాజ్ చేస్తే.. శరీరంలో జరిగే అద్భత మార్పులు..!!

వేలుని రుద్దితే.. ఆరోగ్య ప్రయోజనాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే.. వేళ్లలో శరీరంలోని అనేక అవయవాలు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి.. వేళ్లను రుద్దడం వల్ల.. శరీరంలో విభిన్న మార్పులు, ప్రయోజనాలు పొందుతారు

By Swathi
|

ఆక్యుప్రెజర్ పాయింట్స్ గురించి సాధారణంగా వింటూ ఉంటాం. అయితే.. చేతివేళ్లను కాసేపు రుద్దడం లేదా మసాజ్ చేయడం వల్ల.. అద్భుత ఫలితాలు పొందవచ్చని అధ్యయనాలు నిరూపించాయి. అది కూడా కొన్ని సెకన్లపాటు.. వేలుని రుద్దితే చాలు.

finger massage

వేలుని రుద్దితే.. ఆరోగ్య ప్రయోజనాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే.. వేళ్లలో శరీరంలోని అనేక అవయవాలు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి.. వేళ్లను రుద్దడం వల్ల.. శరీరంలో విభిన్న మార్పులు, ప్రయోజనాలు పొందుతారు.

వేళ్ల మసాజ్

వేళ్ల మసాజ్

ఒక్కోవేలుని రుద్దడం వల్ల ఒక్కో ప్రయోజనం పొందవచ్చు. మరి మీ చూపుడు వేలుని లేదా ఉంగరపు వేలుని.. 60 సెకన్లపాటు రుద్దడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు, వేళ్లను రుద్దడం వల్ల హెల్త్ బెన్ఫిట్స్ పొందే టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం.

బొటనవేలు

బొటనవేలు

బొటనవేలు ఊపిరితిత్తులతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి.. గుండెదడ, శ్వాస సరిగా అందడం లేదు అన్న సమస్యలతో బాధపడుతుంటే.. చాలా సింపుల్ టెక్నిక్ తో.. మీ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. బొటనవేలుని కాసేపు రుద్దండి. తర్వాత.. బయటకు లాగినట్టు చేయండి. అంతే.

ఉంగరపు వేలు

ఉంగరపు వేలు

కాన్ట్సిపేషన్, ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతుంటే.. ఉంగరపు వేలుని మసాజ్ చేయండి. ఉంగరపు వేలు నరాలు పొట్టతో అనుసంధానమై ఉండటం వల్ల.. ఇలా మసాజ్ చేస్తే.. తేలికగా.. కాన్ట్సిపేషన్, పొట్టలో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు నయం అవుతాయి.

చూపుడు వేలు

చూపుడు వేలు

చూపుడు వేలు కోలన్, పొట్టతో.. కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి కాన్ట్సిపేషన్, డయేరియా వంటి సమస్యలతో బాధపడేవాళ్లు.. చూపుడు వేలుని 60సెకన్లు రుద్దడం వల్ల.. సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

మధ్యవేలు

మధ్యవేలు

అలసట, నిద్రలేమి, ట్రావెలింగ్ లో సమస్యలు ఫేస్ చేస్తుంటే.. మధ్యవేలు వెనకవైపు భాగాన్ని కొన్ని సెకన్లపాటు రుద్దాలి. ఇలా చేయడం వల్ల.. తేలికగా నిద్రపడుతుంది. అలాగే ట్రావెలింగ్ సమయంలో ఇబ్బందిపడుతున్నప్పుడు కూడా ఇలా మధ్యవేలు వెనకవైపు మసాజ్ చేస్తే.. త్వరగా ఉపశమనం పొందవచ్చు.

చివరి వేలు

చివరి వేలు

మైగ్రేన్, మెడనొప్పి వంటి సమస్యలు.. రక్తప్రసరణ సరిగా అందనప్పుడు వస్తాయి. ఇలా సమస్యల నుంచి బయటపడాలంటే.. చివరి వేలుని 60 సెకన్లపాటు మసాజ్ చేయాలి.

అరచేయి

అరచేయి

అయిచేయి.. శరీరంలోని నరాలతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎంత వీలైతే.. అంత క్లాప్స్ ( చప్పట్లు ) కొట్టాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి.. ఆరోగ్యంగా ఉంటారు.

చేతివెనక భాగం

చేతివెనక భాగం

చేతివెనక భాగం నడుము, పొట్టతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి.. కాస్త నెమ్మదిగా 60 సెకన్ల పాటు చేతి వెనక భాగాన్ని మసాజ్ చేయాలి.

60 సెకన్లు

60 సెకన్లు

పైన వివరించిన ఏ మసాజ్ అయినా.. కేవలం 60 సెకన్లు మాత్రమే చేయాలి. అప్పుడే.. ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే.. ఎలాంటి నొప్పి నుంచి అయినా తేలికగా ఉపశమనం పొందుతారు.

English summary

Rub Index Finger 60 Second And See What Happen To Your Body

Rub Index Finger 60 Second And See What Happen To Your Body. This is amazing! Rub your finger for 60 seconds and you will experience something amazing!
Desktop Bottom Promotion