For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానానికి అడ్డుకట్ట ఓవేరియన్ సిస్ట్...వీటిని కరిగించే హోం రెమెడీస్

|

ఓవేరియన్ సిస్ట్ లేదా అండాశయ తిత్తి చిన్న సంచి మాదిరిగా ఉండి, స్త్రీ అండాశయంలో ఉంటుంది. ఇందులో ద్రవపదార్ధం ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం చాలా మంది ఆడవారు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి తిత్తిల వలన సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే, కొన్ని సమయాలలో వీటి వలన రక్తస్రావం, రాపిడి మరియు నొప్పి కలుగటం జరుగుతుంది. ఓవేరియన్ సిస్ట్ చిన్నగా ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో పెద్దగా కూడా ఉంటాయి . ఓవేరియన్ సిస్ట్ సమస్యలు ఏ వయస్సు వారిలో అయినా ఏర్పడుతాయి. ముఖ్యంగా చిన్న ఎగ్ ఆకారంలో ఏర్పడి తర్వాత పెద్దగా మారుతుంటాయి. ఓవేరియన్ సిస్టుల వల్ల సంతానంకు అంతరాయం కలుగుతుంది. ఓవెరిలో సిస్టులున్నప్పుడు, అండాలను విచ్ఛిన్నం చేయడంలో వీటి పాత్ర ఉంటుందంటే అతిశయోక్తి కాదు...

క్యాన్సర్ : సాధారణంగా వచ్చే వివిధ రకాల క్యాన్సర్లు

అలాంటప్పుడు శస్త్ర చికిత్స చేయటం ద్వారా ఇలాంటి ఓవేరియన్ సిస్టులను తొలగించవలసి వస్తుంది. ఇలాంటి వాటిలో కొన్ని ప్రాణాంతకంగా మరియు కేన్సర్ లాంటి వ్యాధికి దారి తీయవచ్చు. ఓవరీస్ లో ఎక్కువ సిస్టులు కనుక ఉన్నట్లైతే ఇవి హార్మోనుల అసమతుల్యత వల్ల ఏర్పడుతాయి. వీటినే మనం పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని పిలుస్తాము. ఇవి ఎలాంటి హాని చేయకపోయినా అవి పెద్దగా అవ్వక ముందే తగిన చికిత్సను తీసుకోవాలి. ఇలాంటి వ్యాధిని నయం చేయటానికి ఆధునిక అల్లోపతి ఔషదాలతో పాటూ, పలు రకాలైన ఆయుర్వేద మందులు అండాశయ తిత్తికి సంబంధించిన వ్యాధులను ఎలాంటి హాని కలగకుండా నయం చేయటానికి అందుబాటలో ఉన్నాయి.

వీటితో పాటు ప్రారంభదశలో గుర్తించినప్పుడు కొన్ని హేర్బల్ రెమెడీస్ కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. మోడ్రన్ మెడిసిన్స్ తో పోల్చితే ఈ హేర్బల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ఓవేరియన్ సిస్టులను చాలా గ్రేట్ గా నయం చేస్తాయి. కాబట్టి హేర్బల్ రెమెడీస్ ను ఉపయోగించడం మంచిది . మరియు సురక్షితమైనవి.

మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ ను ఎదుర్కొనే ఎక్సలెంట్ ఫుడ్స్

ఓవేరియన్ సిస్టులున్నప్పుడు రుతుక్రమంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, రుతుక్రమంలో లోపాలు, బ్రెస్ట్ పెయిన్, పెల్విక్ పెయిన్, బ్రెస్ట్ టెండర్ నెస్, కడుపుబ్బరం, కడుపు ఉదయం వాపు మొదలగు లక్షణాలు కనబడుతాయి. మరి ఈ లక్షణాలన్నింటికి చెక్ పెట్టాలంటేఈ క్రింది తెలిపిన హేర్బల్ రెమెడీస్ ను ఫాలో అవ్వాల్సిందే...

1.లికోరైస్:

1.లికోరైస్:

లికోరైస్ లో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . ఓవేరియన్ సిస్టులను నయం చేయడానికి, అడ్రినల్ గ్లాండ్స్ ను మెరుగుపరచడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ఒక ఫాస్టెస్ట్ హోం రెమెడీ.

2.ఓవేరియన్ సిస్ట్ ను నివారించుకోవడానికి లికోరైస్ ఏవిధంగా ఉపయోగించాలి:

2.ఓవేరియన్ సిస్ట్ ను నివారించుకోవడానికి లికోరైస్ ఏవిధంగా ఉపయోగించాలి:

ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో లికోరైస్ వేసి 10 నిముషాలు బాగా మరిగించాలి . తర్వాత పక్కన దింపుకొని, నీటిని వడగట్టుకోవాలి. ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత రోజూ రెండు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

3.చెస్ట్ బెర్రీ:

3.చెస్ట్ బెర్రీ:

ఇది ఒక పవర్ ఫుల్ మెడిస్. ఇది అన్ని రకాల గైనకాలజికల్ సమస్యలను నివారిస్తుంది . ఓవేరియన్ సిస్ట్ లు ష్రింక్ అవ్వడానికి సహాయపడుతుంది. పెల్విక్ మరియు మెనుష్ట్ర్యువల్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4.ఓవేరియన్ సిస్ట్ నివారినకు చెస్ట్ బెర్రీ ఏవిధంగా ఉపయోగించుకోవాలి:

4.ఓవేరియన్ సిస్ట్ నివారినకు చెస్ట్ బెర్రీ ఏవిధంగా ఉపయోగించుకోవాలి:

ఎండిన బెర్రీస్ ను 3చెంచాలు తీసుకొని నీటిలో వేసి 15నిముషాలు బాగా మరిగించాలి. తర్వాత క్రిందికి దింపుకొని చల్లారిన తర్వాత రెగ్యులర్ గా ప్రతి రోజూ రెండు కప్పులు క్రమం తప్పకుండా తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది.

5.రెడ్ క్లోవర్ :

5.రెడ్ క్లోవర్ :

రెడ్ క్లోవర్ లో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి . రెడ్ క్లోవర్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ను మంచిగా హెల్తీగా ఉంచుతుంది మరియు ఫెర్టిలిటీని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిని ఓబేరియన్ సిస్టులు కరిగించడానికి ఉపయోగించి రెగ్యులర్ పీరియడ్స్ ను పొందవచ్చు.

6.రెడ్ క్లోవర్ ఉపయోగించే విధానం:

6.రెడ్ క్లోవర్ ఉపయోగించే విధానం:

ఎండిన రెడ్ క్లోవర్ మూలికలను రెండు చెంచాలు నీటిలో వేసి 15 నిముషాలు బాగా మరిగించాలి . చల్లారిన తర్వాత వడగట్టి ప్రతి రోజూ 3 నుండి నాలుగు కప్పులు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

7.డ్యాండలైన్:

7.డ్యాండలైన్:

ఇది ఎక్సెస్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది . దాంతో ఓవేరియస్ సిస్టులు ఏర్పడకుండా తోడ్పడుతుంది . సిస్ట్ లను గ్రోత్ ను అడ్డుకొని, ఉన్న వాటిని నాశనం అయ్యేలా చేస్తుంది. డ్యాండలైన్ పెల్విక్ పెయిన్ మరియు ఓవేరియన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

8.బ్లాక్ కోహోష్:

8.బ్లాక్ కోహోష్:

ఇది హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది మరియు బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. దాంతో ఓవరీస్ లోని సిస్టులు ముడుచుకుపోయేలా చేస్తాయి . మెనుష్ట్రువల్ క్రాంప్స్ మరియు పెల్విక్ ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

9.వాల్ నట్ అండ్ బాదం:

9.వాల్ నట్ అండ్ బాదం:

వాల్నాట్, ఎర్రటి బాదం వంటి ఒక తరహా అడవి కాయ, థిసిల్ మొక్క పాలు,చిలకడ దుంప, వోటు బియ్యం లాంటివి కూడా అండాశయ తిత్తిని నయం చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి అన్నిరకాల అండాశయ వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి.

10.ఉల్లిపాయ:

10.ఉల్లిపాయ:

ఉల్లిపాయను కాటన్లో ఉంచి యోని వద్ద ఉంచటం వలన అండాశయంలోని తిత్తిని సమర్థవంతంగా నయం చేయవచ్చు. ఇలా చేయటానికి ముందు ఉల్లిపాయను తేనెలో 12 గంటలపాటు నానబెట్టాలి. రాత్రివేళ ఈ ఉల్లిపాయను కాటన్ సహాయంతో యోనిలో పెట్టుకోవాలి. ఇలా రాత్రంతా ఉండనివ్వాలి. మంచి ఫలితాల కోసం పది రోజుల పాటు ఈ పద్దతిని అనుసరించవలసి ఉంటుంది.

11.ఆముదం:

11.ఆముదం:

ఆముదంతో కాపడం కూడా అండాశయంలో గల తిత్తిని నయం చేయటానికి ఒక మంచి విధానం.

12.గిన్సేంగ్ - జీలకర్ర:

12.గిన్సేంగ్ - జీలకర్ర:

వన మూలికలు గిన్సేంగ్, జీలకర్ర లాంటివి హార్మోన్ల అసమతౌల్యాన్ని నివారించి అండాశయంలో తిత్తి సమస్యలును ఏర్పడకుండా సహాయపడుతాయి.

13.బేరీ పండ్లు, పాల ముల్లంగి:

13.బేరీ పండ్లు, పాల ముల్లంగి:

శుభ్రంగా ఉండే బేరీ పండ్లు, పాల ముల్లంగిల వంటి పువ్వులు గల అడవి మొక్క మరియు నల్లటి కోహోష్ లాంటివి కూడా అండాశయ తిత్తిని నయం చేయటానికి బాగా ఉపయోగపడతాయి. ఈ వనమూలికలు క్రమరహిత ఋతు క్రమాన్ని క్రమబద్ధం చేయటమే కాకుండా, హార్మోన్ల వ్యత్యాసాన్ని సరిచేస్తాయి.

14.ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ :

14.ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ :

మంచి ఆహారం అంటే తాజాగా ఉండే పండ్లు మరియు కూరగాయలు, పుష్ప ధాన్యాలు, వెల్లుల్లి మరియు అన్నిరకాలైన ధాన్యాలు తీసుకోవటం వలన అండాశయంలోని తిత్తి వలన కలిగే నొప్పిని మరియు అసౌకర్యం లాంటి వాటిని నివారించవచ్చు. అంతేకాకుండా, ఆహారం విషయంలో కెఫిన్, ఆల్కహాల్, కోడి గుడ్లు మరియు ఎర్రటి మాంసం, కొవ్వు పదార్థాలు మరియు చక్కెర మరియు నూనెలో వేయించిన పదార్థాలు లేకుండా చూసుకోవటం వలన అండాశయానికి సంబంధించిన వ్యాధులు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.

15.ఫైబర్ ఫుడ్స్:

15.ఫైబర్ ఫుడ్స్:

ఆహారంలో పీచు పదార్థాలు మరియు విటమిన్ 'A', 'C' మరియు ఈ లాంటివి ఉంటే అండాశయం వ్యాధులను నివారించటానికి బాగా వీలవుతుంది. అండాశాయానికి సంబంధించిన వ్యాధులను నివారించటానికి ఆయుర్వేద చికిత్స వలన ఖర్చు తక్కువ అవటం మాత్రమే కాకుండా, ఎలాంటి అనుషంగ ప్రభావాలు ఉండవు. అయినప్పటికీ ఇలాంటి వ్యాధి ఎక్కువ కాలం నయం కాకుండా ఉండినా లేదా తిరిగి పునరావృతం అవుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించటం మంచిది.

English summary

Safe Herbal Remedies For Ovarian Cysts

Ovarian cysts are small, or sometimes big, wall-filled sacs present inside the ovary (or ovaries) of females. It can occur at any age during a woman's reproductive years. These cysts can be formed because of an accumulation of small eggs due to increased hormonal levels.
Desktop Bottom Promotion