For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయాలని తెలిపే ఆశ్చర్యకర లక్షణాలు..!!

By Swathi
|

మీరు జీవితాన్ని చాలా బిజీబిజీగా గడుపుతున్నారా ? దీనివల్ల మీ గురించి మీరు కేర్ తీసుకోలేకపోతున్నారా ? అంటే.. మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం లేదని తెలుపుతుంది. హెల్తీగా ఉండాలంటే.. మనం ఖచ్చితంగా వ్యాయామం చేయాలన్న విషయంపై ప్రతి ఒక్కరికీ తెలిసిన ఫ్యాక్ట్.

ఎక్సర్ సైజ్ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

డిమాండింగ్ జాబ్స్, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్స్ కారణంగా.. మన ఆరోగ్యం, మన ఫిట్ నెస్ గురించి నిర్లక్ష్యం చేస్తుంటాం. సరైన శ్రద్ధ తీసుకోలేకపోతుంటాం. రెగ్యులర్ గా.. యోగా, జిమ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, రన్నింగ్ వంటివి ఏవైనా ఫాలో అవవచ్చు. ఇలాంటి హ్యాబిట్స్ వల్ల మెటబాలిక్ రేట్ హెల్తీగా ఉంటుంది. ఇమ్యునిటీ మెరుగుపడుతుంది.

మనలో చాలామందికి వ్యాయామం వల్ల రకరకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలుసు. బరువు తగ్గడం, శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడం, రకరకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులకు దూరంగా ఉంచడంలో.. వ్యాయామం కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి.. వ్యాయామం చేయకుండా, కొద్దిగా చేయడం మంచిది కాదు.

నో డైట్, నో ఎక్సర్ సైజ్ ! స్లిమ్ అండ్ ట్రిమ్ గా మార్చే సింపుల్ ట్రిక్స్.. !

వ్యాయామం సరైన విధంగా, సరైన సమయం చేయడం వల్ల.. మీ లైఫ్ స్టైల్ మరింత హెల్తీగా మారుతుందంటున్నారు నిపుణులు. అయితే.. మీరు మరింత ఎక్కువ సేపు వ్యాయామం చేయాలని తెలిపే కొన్ని లక్షణాలున్నాయి. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయంటే.. మరింత ఎక్కువ సమయం వ్యాయామానికి కేటాయించండి.

అలసట

అలసట

చాలా సందర్భాల్లో.. అలసటగా ఫీలవుతున్నారు అంటే.. మీరు మరింత ఎక్కువ సమయం వ్యాయామం చేయాలని సూచిస్తుంది. వ్యాయామం నరాల వ్యవస్థను యాక్టివ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

కీళ్లు పట్టేయడం

కీళ్లు పట్టేయడం

కీళ్లు పట్టేసినట్టు, నొప్పితో బాధపడుతున్నారంటే.. సరైన వ్యాయామం నియమాలు పాటించాలి. యాక్టివ్ లేని లైఫ్ స్టైల్ కారణంగా.. నరాల్లో స్టిఫ్ నెస్ కి కారణమవుతుంది. దీనివల్ల బాడీ పెయిన్ కి కారణమవుతుంది. కాబట్టి.. ఇప్పుడే.. మీరు వ్యాయామం చేసే సమయాన్ని మరింత పెంచండి.

ఒత్తిడి

ఒత్తిడి

మీరు వివరించలేని, ఊహించని విధంగా ఒత్తిడికి లోనవుతున్నారంటే.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. దీనివల్ల మెదడులో డొపామైన్ లెవెల్స్ పెరిగి.. ఒత్తిడిని తగ్గిస్తాయి.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

హార్మోన్స్ సమస్యలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి.. సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రధాన కారణం. వ్యాయామం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ని హెల్తీగా మార్చడం సాధ్యమవుతుంది.

అజీర్ణం

అజీర్ణం

తరచుగా.. ఇన్ డైజెషన్ సమస్యలు, పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారంటే.. మీరు చాలా ఇన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారని సూచిస్తుంది. కాబట్టి.. వెంటనే వ్యాయామం చేయడం మొదలుపెట్టండి.

ఏకాగ్రత కోల్పోవడం

ఏకాగ్రత కోల్పోవడం

పనిలోగానీ, చదువుకోవడంలో గానీ.. ఏవిషయంలోనైనా.. ఏకాగ్రతను కోల్పోవడం, ఫోకస్ పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. వ్యాయామం సరిగా చేయడం లేదని సూచిస్తుంది. వ్యాయామం ఏకాగ్రతను చాలా మెరుగుపరుస్తుంది.

ఇమ్యునిటీ తగ్గడం

ఇమ్యునిటీ తగ్గడం

తరచుగా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూతో బాధపడుతున్నారంటే.. మీ ఇమ్యునిటీ తగ్గిందని, వ్యాయామం తక్కువగా చేస్తున్నారని సంకేతం. కాబట్టి.. వెంటనే.. వ్యాయామం చేయడం మొదలుపెట్టండి.

English summary

Shocking Symptoms Which Mean You Need More Exercise!

Shocking Symptoms Which Mean You Need More Exercise! If you are someone with a busy lifestyle, which leaves you with not much time to take care of yourself, then chances are that you may not be following a regular exercise routine.
Story first published:Tuesday, August 2, 2016, 11:12 [IST]
Desktop Bottom Promotion