For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడని విటమిన్ లోపం లక్షణాలు

By Swathi
|

మనం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలుసు కదా. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్స్ పొందుతాము. ఇవి సరైన క్రమంలో అందినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ.. శరీరంలో విటమిన్ లోపిస్తే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.

సంపూర్ణ ఆరోగ్యానికి కేరాఫ్ 'విటమిన్ ఇ'ఆహారాలు..!సంపూర్ణ ఆరోగ్యానికి కేరాఫ్ 'విటమిన్ ఇ'ఆహారాలు..!

మనం రోజంతా ఎలా ఉన్నామనే ఫీలింగ్ ని విటమిన్సే డిసైడ్ చేస్తాయి. కాబట్టే.. మన డైట్ లో ప్రాసెస్డ్ ఫుడ్ కంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ చేర్చుకోవడం చాలా అవసరం. ఎక్కువ పండ్లు, కూరగాయలు డైట్ లో చేర్చుకోవడం వల్ల.. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శరీరంలో విటమిన్స్ తగ్గిపోవడాన్నే విటమిన్ లోపం ( విటమిన్ డెఫిసియెన్సీ )గా పిలుస్తారు.

ఎముకలను బలానికి టాప్10 విటమిన్ డి ఆహారాలుఎముకలను బలానికి టాప్10 విటమిన్ డి ఆహారాలు

శరీరానికి కావాల్సిన పోషకాలు అందనప్పుడు కనిపించే లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మార్కెట్ లో అనేక రకాల విటమిన్ సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాకూడా ఆహారం ద్వారా పొందితేనే మంచిది. అయితే విటమిన్ లోపం సూచించే ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదో చూద్దాం..

నోటి చుట్టూ పగుళ్లు

నోటి చుట్టూ పగుళ్లు

విటమిన్ బి, జింక్ ఐరన్ లోపం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సంకేతం మీలో ఉంటే.. కోడిగుడ్లు, ఫిష్, వేరుశనగలు, గింజలు, క్యాబేజ్, బ్రొకోలి, క్యాప్సికమ్, టమోటాలు తీసుకోవాలి.

హెయిర్ లాస్

హెయిర్ లాస్

జుట్టు విపరీతంగా రాలిపోవడం, రాషెష్ రావడం వంటి లక్షణాలు విటమిన్ కె, ఈ, డి, బి7, విటమిన్ ఏ లోపం వల్ల కనిపిస్తాయి. అలాగే జింక్ లోపం వల్ల కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి అవకాడో, డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లు, మష్రూమ్స్, గుమ్మడి విత్తనాలు, వోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి.

శరీరమంతా యాక్నె

శరీరమంతా యాక్నె

విటమిన్ డి, విటమిన్ ఏ లోపం కారణంగా ముఖంపై మాత్రమే కాదు.. శరీరమంతా మొటిమలు వస్తాయి. కాబట్టి శ్యాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం తగ్గించాలి. ఫ్లాక్స్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్, క్యాప్సికమ్, చిలకడదుంప, క్యారెట్స్, వాల్ నట్స్, బాదాం తీసుకోవాలి.

దురద

దురద

శరీరంపై దురద ఎక్కువగా ఉందంటే.. విటమిన్ బి, బి 12, బి9, బి6 లోపంగా గుర్తించాలి. ఇలాంటప్పుడు సీ ఫుడ్, ఎగ్స్, లీఫీ గ్రీన్స్ తీసుకోవాలి.

క్రాంప్స్

క్రాంప్స్

విటమిన్ బి, మినలర్స్ అయిన మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం లోపం వల్ల క్రాంప్స్ వస్తాయి. అలాంటప్పుడు బాదాం, అరటిపండ్లు, స్పినాచ్, క్యాబేజ్, యాపిల్స్, చెర్రీస్ తీసుకోవాలి.

విటమిన్ బి

విటమిన్ బి

విటమిన్ బి లోపించినప్పుడు అలసట, నిద్రలేమి, డిప్రెషన్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, వెయిట్ లాస్ సమస్యలు ఎదురవుతాయి.

విటమిన్ సి

విటమిన్ సి

విటమిన్ సి శరీరంలో లోపించినప్పుడు చిగుళ్లలో రక్తస్రావం, జీర్ణం కాకపోవడం, ముక్కులో నుంచి రక్తం రావడం, జాయింట్ పెయిన్స్ వేధిస్తాయి. ఇలాంటి సమస్య ఎదుర్కొనే వాళ్లు రోజూ నిమ్మరసం తీసుకోవాలి.

English summary

Signs Of Vitamin Deficiency you Should not Ignore

Signs Of Vitamin Deficiency you Should not Ignore. Do you know that vitamins play an important role in your well-being? Yes, they also decide how you feel during the day.
Story first published: Saturday, February 20, 2016, 10:37 [IST]
Desktop Bottom Promotion