For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంజరస్ లంగ్ క్యాన్సర్ ను నివారించే సులభ మార్గాలు..!!

|

లంగ్ క్యాన్సర్ (ఊపిరితిత్తుల క్యాన్సర్ ). ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూన్ అన్నారు. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు క్యూర్ చేసుకోవడం కంటే, రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని, నివారించుకోవడం ఉత్తమం. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రాణాంతక విషయాల్లో వర్తిస్తుంది!. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్లు అతి తక్కువ సమయంలో ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతాయి. అటువంటి క్యాన్సర్స్ లో లంగ్ క్యాన్సర్ ఒకటి. అయితే లంగ్ క్యాన్సర్ గుర్తించిన వెంటనే సరైన చికిత్సను, డైట్ ను , వ్యాయామాలను ఫాలో అయితే తప్పనిసరిగా కోలుకుంటారు.

కొన్ని రకాలు క్యాన్సర్లు ప్రాణాపాయ స్థితిని ఏర్పరుస్తాయి కాబట్టి, వీటిని గురించి కనీస అవగాహన, జాగ్రత్తలు కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో ఇటువంటి ప్రాణాంతక డిజార్డర్స్ బారిన పడకుండా ఉండొచ్చు . క్యాన్సర్స్ వ్యాధులు ఒకసారి శరీరాన్ని అటాక్ చేసిన తర్వాత ఈ వ్యాధుల నుండి పూర్తిగా కోలుకుంటారన్న గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే క్యాన్సర్ సోకిన వ్యక్తిలో క్యాన్సర్ కణాలు చాల వేగంగా శరీరంలో విస్తరిస్తాయి. శరీరంలో కణాలు, అవయవాలకు విస్తరించి, ప్రాణాపాయ స్థితికి చేర్చుతాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు

ప్రస్తుతానికి మంచి ట్రీట్మెంట్ తో వ్యాధి నివారించుకున్నా, శరీరం దాగున్న బ్యాక్టీరియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, క్యాన్సర్ రాకుండా నివారించుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

ఊపిరితిత్తుల ప్రక్షాళన కోసం 14 అత్యుత్తమ ఆహారాలు

వివిధ రకాల క్యాన్సర్స్ లో లంగ్ క్యాన్సర్ ఒకటి. లంగ్ క్యాన్సర్ స్మోక్ చేసే వారిలో మాత్రమే కాదు, స్మోక్ చెయ్యని వారిలో కూడా అటాక్ అయ్యే అవకాశాలున్నాయి. కొంత మందిలో టాక్సిన్ వల్ల, హెరిడిటి వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిన వ్యక్తిలో దగ్గినప్పుడు రక్తం పడటం, చెస్ట్ పెయిన్, శ్వాసలో ఇబ్బందులు, శ్వాసనాళ సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వంటి లక్షణాలు కనబడుతాయి . లంగ్ క్యాన్సర్ (ఊపిరితిత్తుల క్యాన్సర్ తగ్గించుకోవడానికి కొన్ని సులభ మార్గాలు ఈక్రింది విధంగా ఉన్నాయి...

స్మోకింగ్ మానేయాలి:

స్మోకింగ్ మానేయాలి:

లంగ్ క్యాన్సర్ నివారించడానికి స్మోక్ చేసే వారు, వెంటనే స్మోకింగ్ నిలిపివేయాలి. లైఫ్ లో తిరిగి స్మోకింగ్ అలవాటు చేసుకోకూడదు. సిగరెట్ స్మోక్ చేసే వారిలో 90% లంగ్ క్యాన్సర్ కు సంబంధించిన మరణాలు సంభవిస్తున్నట్లు రీసెంట్ స్టడీస్ లో వెల్లడించారు.

సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ను నివారించాలి:

సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ను నివారించాలి:

స్మోక్ చేసే వారు మన చుట్టూ ఉన్నా కూడా కొన్ని సందర్భాలో ఏం పట్టించుకోకుండా ఉండిపోతాము. అయితే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేసే వారితో ఉన్నప్పుడు, వారు వదిలే పొగ కారణంగా పీల్చిన వారిలో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, స్మోక్ చేసే వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

కెమికల్స్ చెక్ చేయాలి:

కెమికల్స్ చెక్ చేయాలి:

లంగ్ క్యాన్సర్ నివారించాలంటే, రాడాన్ వంటి టాక్సిన్స్ కు దూరంగా ఉండాలి. ఇవి పాత పైపులు, గ్యాస్ లైన్స్, మొదలగువాటిలో ఉండి లంగ్ క్యాన్సర్ కు కారణమవుతాయి.

పనిచేసే ప్రదేశాల్లో సేఫ్ గా ఉండాలి:

పనిచేసే ప్రదేశాల్లో సేఫ్ గా ఉండాలి:

పనిచేసే ప్రదేశాల్లో సిగరెట్స్ తాగేవారికి దూరంగా ఉండటం, కెమికల్స్ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వారు కార్సినోజెన్స్ కు లేదా న్యూక్లియర్ ప్లాంట్స్ దూరంగా ఉండటం మంచిది. ఇటువంటి ప్రదేశాల్లో పనిచేసే వారు సేఫ్టీ పద్దతులను అనుసరించడం మంచిది.

విటమిన్ ఇ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి:

విటమిన్ ఇ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి:

విటమిన్ ఇ అధికంగా ఉండే కోకనట్, ఫిష్, అవొకాడో, నట్స్ వంటి ఆహారాలు రెగ్యులర్ గా తినడం వల్ల లంగ్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

 గ్రీన్ టీ తాగాలి:

గ్రీన్ టీ తాగాలి:

గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ లంగ్ సెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చి, క్యాన్సర్ ను నివారిస్తాయి.

ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి:

ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి:

లంగ్ క్యాన్సర్ కు మరో కారణం, స్మోకింగ్ తో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా త్వరగా లంగ్ క్యాన్సర్ బారీన పడే అవకాశాలున్నట్లు రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేశారు.

English summary

Simple Ways To Avoid Getting Lung Cancer

Simple Ways To Avoid Getting Lung Cancer,The popular saying, "prevention is better than cure" can be extremely true when it comes to deadly diseases like cancer! If you know about lung cancer, then you must also be wondering if lung cancer can be prevented, right?
Story first published: Tuesday, October 4, 2016, 17:10 [IST]
Desktop Bottom Promotion