For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుక పగలడంతో ఏమీ తినలేకపోతున్నారా ? ఇవిగో హోంరెమిడీస్..

By Swathi
|

బర్నింగ్ టంగ్ సిండ్రోమ్ అంటే.. కాలుక కాలినట్టు అనిపించడం. అంటే నోట్లో కానీ, నాలుక కానీ.. ఇలా అనిపిస్తుంది. ఏది తిన్నా, తాగినా.. ఇలాంటి ఫీలింగ్ ఉందంటే.. కాస్త అలర్ట్ అవ్వాలి. ఇలాంటప్పుడు చాలా నొప్పిగా, బాధగా ఉంటుంది. దీన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.

నోరు, నాలుక, పెదాలు మంట అవుతున్న ఫీలింగ్ తోపాటు, ఎక్కువగా దప్పిక అవడం, నోరు తడి ఆరిపోవడం వంటి లక్షణాలన్నీ.. బర్నింగ్ టంగ్ సిండ్రోమ్ ని సూచిస్తాయి. ఇలా అనిపించినప్పుడు ట్రీట్ చేయకపోతే.. ఈ ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. పంటి సమస్యలు, బ్యాడ్ బ్రీత్ కి కూడా కారణమవుతాయి.

సమస్య చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా.. వెంటనే సరైన చికిత్స అందివ్వాలి. ఒకవేళ మరీ ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటే డాక్టర్ ని సంప్రదించండి. మొదట్లోనే గుర్తించినట్లైతే.. హోం రెమిడీస్ తో చికిత్స అందివ్వవచ్చు. కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కెమికల్స్ లేకుండా ఉంటాయి. మరి నాలుక, నోరు పగిలినప్పుడు ఫాలో అవ్వాల్సిన హోం రెమిడీస్..

Suffering From Burning Tongue Syndrome

ఐస్ క్యూబ్స్
నోట్లో మంటగా, ఏది తినలేక, తాగలేక ఇబ్బందిపడుతున్నప్పుడు ఐస్ క్యూబ్ ని పెట్టడం వల్ల వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది. కాలినట్టు ఉండే ఆ అసౌకర్యం నుంచి తేలికగా బయటపడవచ్చు. లేదా చల్లటి నీటిని తాగినా.. మంచి ఉపశమనం కలుగుతుంది. రోజంతా ఇలా చేస్తూ ఉంటే.. ఈ సమస్య నుంచి బయటపడతారు.

Suffering From Burning Tongue Syndrome

తేనె
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఇన్ల్ఫమేషన్ ని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కాలినట్టు, పగిలినట్టు ఉండే బాధ కూడా తగ్గుతుంది. అలాగే నోట్లో ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

Suffering From Burning Tongue Syndrome

లావెండర్ ఆయిల్
లావెండర్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తుంది. నాలుకపై వచ్చే బర్నింగ్ సెన్సేషన్ నుంచి ఇది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ ని రాత్రి పడుకోవడానికి ముందు నాలుకపై వేసుకుంటే చాలు.. ఉదయం నోటిని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. ఆ బాధ తగ్గుతుంది. రాత్రంతా అలానే ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. వాపు తగ్గుతుంది.

Suffering From Burning Tongue Syndrome
Suffering From Burning Tongue Syndrome

అలోవెరా
అలోవెరా నుంచి జెల్ తీసి.. నాలుకపై రాసుకుంటే.. చల్లటి అనుభూతి కలిగి.. ఆ బాధ తగ్గిస్తుంది. నాలుకపై అలోవెరా జెల్ రాసి.. 25 నిమిషాలు అలానే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా.. రోజంతా చేస్తూ ఉంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Suffering From Burning Tongue Syndrome? Then, Try These Remedies!

Suffering From Burning Tongue Syndrome? Then, Try These Remedies! The burning tongue syndrome is a feeling of burning sensation in your mouth or tongue, every time you drink or eat something.
Story first published:Saturday, June 25, 2016, 12:41 [IST]
Desktop Bottom Promotion