For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గరం గరం చాయ్ తో గమ్మత్తైన ఆరోగ్య ప్రయోజనాలు

By Swathi
|

గరం గరం చాయ్ తాగడానికి ఇష్టపడుతున్నారా ? ఏమాత్రం తీరిక దొరికినా, అలసటగా అనిపించినా.. వెంటనే టీ తాగేస్తున్నారా ? అయితే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. కానీ టీ కంటే కాఫీనే ఎక్కువ ఇష్టపడితే మాత్రం అనర్థమే. కాబట్టి.. టీ తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇండియాలో 10 మందిలో ఎనిమిది మంది కాఫీ కంటే టీ తాగడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. వేడి వేడి టీ తాగడానికి ఎందుకు ఇష్టపడతారంటే.. కాఫీ కంటే చాలా రుచికరంగా ఉండటమే కారణం.

అయితే రోజూ టీ తాగే అలవాటు.. చాలా ఆరోగ్యకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకి ఒక కప్పు టీ మీ జీవితంలో చాలా వండర్స్ తీసుకొస్తుందట. తాజా అధ్యయనాల ప్రకారం రోజుకి రెండుసార్లు ఒక కప్పుు టీ తాగడం వల్ల క్యావిటీన్ అరికట్టవచ్చట. పాలతో లేదా న్యాచురల్ గా బ్లాక్ టీ తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

పాలతో చేసి టీ కంటే.. బ్లాక్ టీలో ఎక్కువ ఉపయోగకరమైన ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే టీ చేసేటప్పుడు కంపల్సరీ పంచదార తక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి. లేదా పంచదారకు బదులు బెల్లంను ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఒకవేళ మీరు చాయ్ ప్రేమికులైతే.. టీ ద్వారా పొందే అద్భుతమైన, అమోఘమైన ప్రయోజనాలేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఒకవేళ టీ కంటే కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే.. ఇకపై మీరు టీ తాగడానికి ఈ ప్రయోజనాలు ప్రోత్సహిస్తాయి. కాబట్టి.. ఒక్కసారి చాయ్ లో దాగున్న హెల్త్ సీక్రెట్స్ తెలుసుకోండి.

ఆందోళన

ఆందోళన

ఒకవేళ మీరు ఒత్తిడిగా, ఆందోళనగా ఫీలవుతుంటే.. ఒక హాట్ కప్ టీ.. అది కూడా చమోమిలే టీ తీసుకుంటే.. చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఈ హెర్బల్ టీలో మనసుకి ప్రశాంతత కల్పించే కామింగ్ ఎమినో యాసిడ్ ఉంటుంది.

PMS

PMS

ప్రీమెనుస్ట్రియల్ సిండ్రోమ్ అనే సమస్య ప్రతి మహిళను ప్రతి నెలా వేధించే సమస్య. చిరాకు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎక్కువ తినడం, నిద్ర సమస్య వంటి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఒక కప్పు చమోమిలే టీ చాలు.

యాక్నే

యాక్నే

టీనేజర్స్ ఎక్కువగా ఫేస్ చేసే సమస్య యాక్నే. శరీరంలో ఎక్కడ యాక్నే సమస్య ఉన్నా హెర్బల్ టీ ద్వారా మాయం చేసుకోవచ్చు. అయితే చమోమిలే, సూపర్ మింట్ టీలు అయితే.. యాక్నేకి మంచి పరిష్కారం. ఈ టీలు తాగడం వల్ల యాక్నే పోవడంతో పాటు, వాటి తాలూకు గుంతలు కూడా తగ్గిపోతాయి.

నిద్రలేమి

నిద్రలేమి

నిద్రకు కొన్ని గంటల ముందు హెర్బల్ టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. కళ్లు మూతలు పడటానికి ఒక కప్పు గ్రీన్ టీ తాగినా చాలు.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి వేడి వేడి టీ చక్కటి పరిష్కారం. టీ తాగడం వల్ల కొత్త ఫ్యాట్ సెల్స్ ఏర్పడకుండా అరికడుతుంది. బరువు తగ్గడానికి గ్రీన్ టీ అయితే మంచిది.

పొట్టలో సమస్యలు

పొట్టలో సమస్యలు

అల్లం, పుదినా, చమోమిలే హెర్బల్ టీలు పొట్టలో వచ్చే సమస్యలు తగ్గిస్తాయి. జీర్ణసమస్యలు, పొట్టలో అసౌకర్యంగా ఉండటం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటే.. డైరీ ప్రొడక్ట్ ఉండే ఏ టీ తాగినా.. మంచి ఫలితం ఉంటుంది. అయితే చక్కెరకు బదులు బెల్లం ఉపయోగిస్తే మరీ మంచిది.

తలనొప్పి

తలనొప్పి

అల్లం, గ్రీన్, చమోమిలే వంటి హెర్బల్ టీ తీసుకోవడం వల్ల తలనొప్పి, టెన్షన్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. రోజుకి రెండుసార్లు వీటిలో ఏవైనా తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలర్జీ

అలర్జీ

ఎలాంటి అలర్జీ ఉన్నా.. వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగండి. పుదినా, గ్రీన్ టీ, నెట్టెల్ టీ తీసుకోవడం వల్ల అలర్జీల నుంచి త్వరిత ఉపశమనం ఉంటుంది.

దుర్వాసన

దుర్వాసన

కొంతమందికి దుర్వాసన సమస్య ఉంటుంది. దీనికి కొన్ని రకాల టీలు చక్కటి పరిష్కారం. బ్లాక్ టీలో పోలిఫెనాల్స్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ పళ్లలో ఇరుక్కోకుండా అరికడతాయి. అలాగే గ్రీన్ టీ, పుదినా టీలు కూడా దుర్వాసనను అరికట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి.

English summary

Superb Medical Benefits Of Drinking Hot Chai

Superb Medical Benefits Of Drinking Hot Chai. On an average scale of 1-10, about 8 percent of people in India prefer drinking tea than to coffee.
Story first published: Thursday, February 11, 2016, 11:17 [IST]
Desktop Bottom Promotion