For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా లేదని తెలిపే ఆశ్చర్యకర సంకేతాలు..!

మనుషుల జీర్ణవ్యవస్థ.. తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు సక్రమంగా జరగడానికి ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం అవసరం.

By Swathi
|

జీర్ణవ్యవస్థ మన ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. కాబట్టి.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా లేదని తెలిపే.. కొన్ని సంకేతాల గురించి ప్రతి ఒక్కరిలోనూ అవగాహన చాలా అవసరం. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

unhealthy digestive system

మనుషుల జీర్ణవ్యవస్థ.. తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని అన్ని అవయవాలు, పనితీరు సక్రమంగా జరగడానికి ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి.. మీ జీర్ణవ్యవస్థ అనారోగ్యానికి గురైతే.. అన్ని అవయవాల పనితీరుకి ఆటంకం ఏర్పడుతుంది.

ఖచ్చితంగా తినాల్సిన పండ్ల తొక్కలు.. వాటి హెల్త్ సీక్రెట్స్..!!ఖచ్చితంగా తినాల్సిన పండ్ల తొక్కలు.. వాటి హెల్త్ సీక్రెట్స్..!!

ఎప్పుడైతే.. మీ జీర్ణవ్యవస్థ గాడీ తప్పుతుందో.. ఆహారం ఎనర్జీగా మారడంలో ఆటంకం ఏర్పడి.. ఎనర్జీని కోల్పోతారు. అంతేకాదు.. ఇతర అవయవాలు కూడా.. తమ పనితీరుని సక్రమంగా నిర్వర్తించలేకపోతాయి. కాబట్టి.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం.

మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం డైట్, లైఫ్ స్లైట్, హెల్తీ బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటుంది. హెల్తీ గట్ బ్యాక్టీరియా పేగులలో తగ్గిపోయిందంటే.. అనేక జీర్ణసమస్యలకు కారణమవుతుంది. మరి.. మీ జీర్ణవ్యవస్థ అన్ హెల్తీగా ఉందని తెలిపే సంకేతాలేంటో చూద్దాం..

పొట్టలో అసౌకర్యం

పొట్టలో అసౌకర్యం

ఒకవేళ మీరు చాలా తరచుగా.. పొట్టలో అసౌకర్యంగా ఉండటం, చిన్న నొప్పి, పొట్టలో మంట వంటి సమస్యలు.. అన్ హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ కి సంకేతం.

ఆహారం

ఆహారం

అనారోగ్యకరమైన పేగులు ఉన్నాయంటే.. రోజంతా కొన్ని రకాల ఆహారాలు తింటూ ఉంటారు. ముఖ్యంగా స్వీట్స్ వంటివి ఎక్కువగా తినాలని ఆసక్తి చూపుతారు.

బరువు

బరువు

ఎలాంటి కారణం లేకుండా.. హఠాత్తుగా బరువు పెరగడం వంటి సంకేతాలు.. జీర్ణక్రియలో సమస్యను సూచిస్తాయి.

డిప్రెషన్

డిప్రెషన్

డిప్రెషన్ సమస్య.. అనేక డైజెస్టివ్ డిజార్డర్స్ ని సూచిస్తుంది. ఒకవేళ మీరు డిప్రెషన్ తో బాధపడుతుంటే.. అది.. అనారోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సంకేతం కావచ్చు.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

అన్ హెల్తీ పేగులు ఉన్నాయంటే.. చర్మంలో ఆ సంకేతాలు కనిపిస్తాయి. స్కిన్ ఎలర్జీలు, ర్యాషెస్ వంటి సమస్యలు వస్తాయి. ఒక వేళ గట్ బ్యాక్టీరియా హెల్తీగా లేకపోతే.. ఇలా చర్మ సమస్యలు కనిపిస్తాయి.

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్

అనారోగ్యకరమైన జీర్ణవ్యవస్థ.. ఆర్థరైటిస్ కి సంకేతం. ఒకవేళ మీరు ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారంటే.. మీరు మీ జీర్ణవ్యవస్థను రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం చాలా అవసరం.

ఐబీఎస్

ఐబీఎస్

ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లేదా ఐబీఎస్ కూడా.. అనారోగ్యకరమైన పేగులకు సంకేతం. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు విరేచనాలు, చాలా తరచుగా. .బ్లోటింగ్ సమస్యను ఫేస్ చేస్తారు.

English summary

Surprising Signs Of An Unhealthy Digestive System

Surprising Signs Of An Unhealthy Digestive System. It is in fact true when people say that the health of our digestive system plays a key role when it comes to overall health.
Story first published: Thursday, October 13, 2016, 15:57 [IST]
Desktop Bottom Promotion