For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వజైనా(యోని) వాపుకు కారణాలు మరియు లక్షణాలు ..!!

వజైన (యోని ) అతి సున్నితమైన ప్రదేశం, కాబట్టి ఎలాంటి అనారోగ్యర లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ను కలవాలి. అక్కడ వాపు, ఇన్ఫెక్షన్స్ అనేవి సీరియస్ గా తీసుకోవల్సిన అంశం. అందుకు మెడికల్ హెల్ప్ తప్పనిసరి

By Lekhaka
|

వజైన (యోని ) అతి సున్నితమైన ప్రదేశం, కాబట్టి ఎలాంటి అనారోగ్యర లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ను కలవాలి. అక్కడ వాపు, ఇన్ఫెక్షన్స్ అనేవి సీరియస్ గా తీసుకోవల్సిన అంశం. అందుకు మెడికల్ హెల్ప్ తప్పనిసరిగా అవసరం అవుతుంది.

యోని వాపు వల్ల చీకాకు, దురద, ఎర్రగా మారడం, నొప్పిగా ఉండటం, సలపడం, మరియు దద్దుర్లు..ఇంకా ద్రవాలు శ్రవించడం వంటి లక్షణాలు కనబడుతాయి. కొందరిలో ద్రవాలు శ్రవించే సమయంలో ఫ్యూయల్ స్మెల్ (నీచు వాసన లేదా చెడు వాసన) ఉంటుంది.మరికొందరిలో యూరిన్ కు వెళ్ళే సమయంలో చాలా నొప్పిగా ఉంటుంది.

ఇలాంటి లక్షణాలున్నప్పుడు, ఆ ప్రదేశంలో సోపులను ఉపయోగించడం మానేయాలి. గోళ్ళతో గోకకుండా ఉండాలి, సౌకర్యవంతమైన దుస్తులు ధరించుకుని డాక్టర్ ను కలవాలి. యోని వాపుకు గల కొన్ని ముఖ్యమైన రీజన్స్ ఈ క్రింది విధంగా ....

పరిశుభ్రత పాటించకపోవడం:

పరిశుభ్రత పాటించకపోవడం:

కొందరు బహుమూలల్లో పరిశుభ్రత పాటించడకపోవడం ప్రైవేట్ పార్ట్స్ లో బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు దురదకు దారితీస్తుంది.

రఫ్ ఇంటర్ కోర్స్:

రఫ్ ఇంటర్ కోర్స్:

చాలా మెరటుగా లేదా దురుసుగా రతిలో పాల్గొన్నా, ఇన్ఫ్లమేషన్, బ్లీడింగ్, మరియు వాపుకు కారణం అవుతుంది. అటువంటి సందర్బాల్లో కొన్ని రోజులో సెక్స్ కు దూరంగా ఉండటం వల్ల త్వరగా నయం అవుతుంది.

ఇన్ఫ్లమేషన్ :

ఇన్ఫ్లమేషన్ :

కొంత మందిలో , ప్రైవేట్ పార్ట్స్ లో వైజినల్ టిష్యులలో ద్రవాలు పెరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. ఇది వజైనా వాపుకు దారితీస్తుంది. ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అవుతుంది.

అలర్జీ:

అలర్జీ:

కొన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ కారణంగా సెన్సిటివ్ స్కిన్ కు దురద, ఇరిటేషన్, వాపుకు దారితీస్తుంది. దురద మరియు ఇతర అలర్జిక్ రియాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి, బ్యూటి ప్రొడక్ట్స్ ను వాడకపోవడమే మంచిది.

ఎస్ టిడి:

ఎస్ టిడి:

కొన్ని రకాల ఎస్ టిడిలు కూడా ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. సూక్ష్మ క్రిముల వల్ల వజైన చుట్టు పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. వాపు వస్తుంది.

హార్మోన్స్ :

హార్మోన్స్ :

కొంతమందిలో , హార్మోనుల్లో మార్పుల వల్ల కూడా ఇటువంటి సమస్య వస్తుంది. హార్మోనుల అసమతుల్యత వల్ల డిశ్చార్జ్ పెరుగుతుంది. దాంతో వాపు వస్తుంది.

సిస్టులు:

సిస్టులు:

సిస్టులకు కారణమయ్యే వుల్వోవజినిటిస్ వైజినల్ వాపుకు గురిచేస్తుంది. ఈ పరిస్థితిలో ప్రైవేట్ పార్ట్స్ లో మంట, నొప్పి, దురద, డిశ్చార్జ్ మరియు వాపు కూడా ఉంటుంది.

ఇన్ఫెక్షన్స్ :

ఇన్ఫెక్షన్స్ :

ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మ క్రిములు కూడా ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ప్రైవేట్ పార్ట్స్ లో ఎప్పుడూ తేమగా ఉన్నట్లైతే, సూక్ష్మ క్రిములు పెరుగి ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.

English summary

Swollen Vagina: Causes & Symptoms

A swollen vagina could be a cause of concern as it could also be a sign of some other serious issue which might need medical help.
Story first published: Friday, December 30, 2016, 8:25 [IST]
Desktop Bottom Promotion