For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటకాలకు రుచినీ.. ఆరోగ్యాన్నీ ఇచ్చే ఆయిల్..!!

By Swathi
|

స్వీట్స్ అయినా.. స్నాక్స్ అయినా.. కూరలైనా.. పప్పు అయినా.. చపాయితీ అయినా ఆయిల్ తగలాల్సిందే. నూనె లేకుండా వంట చేయడం కష్టం. వంటకాలకు, రుచి రావాలంటే.. జిడ్డు ఉండాల్సిందే. వంటకాల్లో నూనెకు అంత ప్రాధాన్యత ఉంది.

వంటల్లో నూనె తగ్గించాలని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నూనె ఎక్కువగా వాడటం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని.. ముఖ్యంగా కొలెస్ర్టాల్ కి నూనె కారణమని సూచిస్తున్నారు. కానీ.. నూనె విషయంలో ఏ ఒక్కరూ కేర్ తీసుకోవడం లేదు. కాబట్టి కనీసం మోతాదైనా తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే వంటలకు వాడే నూనె తక్కువగా ఉండాలి.. అది ఆరోగ్యకరమైనదే వాడాలి. అలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందే ఆయిల్స్ ఏంటి ? ఏవి వాడాలో ఇప్పుడు చూద్దాం..

oil

వేరుశనగ నూనె
గతంలో ఎక్కువగా వేరుశనగ నూనె వాడేవాళ్లు. అందుకే పూర్వం చేసే వంటలు రుచికరంగా.. ఘుమఘుమల సువాసన వెదజల్లేవి. అంతేకాదు.. ఈ నూనె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వంద గ్రాముల వేరుశనగ నూనెలో 884 క్యాలరీల శక్తి వస్తుంది. ఇది ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచడమే కాదు.. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది.

sesame oil

నువ్వుల నూనె
వంటల్లో నూనె వాడే విధానంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పాలి. నువ్వుల నూనె కూడా పూర్వం నుంచి వాడుతున్నది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ర్టాల్ ని అరికడతాయి.

oil

సన్ ఫ్లవర్ ఆయిల్
న్యాచురల్ గా పొందే ఏ వస్తువైనా ఆరోగ్యకరంగానే ఉంటుంది. అలాంటిదే సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా. ఇది ఎక్కువగా వాడతారు. ఈ నూనెను వంటకాల్లో వాడటం వల్ల ఆర్థరైటిస్ సమస్య రాకుండా నియంత్రించవచ్చు. అలాగే దీని ద్వారా ఎక్కువ మోతాదులో విటమిన్స్ పొందవచ్చు.

English summary

The Best Cooking Oils for Your Health

I have heard of blended whiskeys. But this was the first time I was hearing of blended oils.The packet claimed that it's an olive oil and then when I looked closely, it read blended oil.
Story first published: Wednesday, January 20, 2016, 18:16 [IST]
Desktop Bottom Promotion