For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క నెలలో శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచే హెల్తీ ఫుడ్స్ ..!!

|

మీకు ఎప్పుడైనా శరీరంలో తిమ్మెర్లతో బాధపడుతున్న అనుభూతి కలిగిందా... ? తిమ్మెర్లు, సలపడం వంటి లక్షణాలు కనబడితే శరీరంలో రక్తం తగ్గినట్టు గుర్తించాలి. రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన ఎర్రరక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి ఆక్సిజన్ అందదు. రోగి ఎంతో అలసట పొందడం, చివరకు శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు తమలో శక్తి పూర్తిగా నిశించిపోయినట్లు భావిస్తారు. ఎర్ర రక్తకణాల్లో ఉన్న హీమోగ్లోబిన్ కణాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థ పదార్థాన్ని సేకరించి ఊపిరితిత్తులకు అందజేస్తుంది. ఊపిరితిత్తులు ఈ వ్యర్థ పదార్థాన్ని విసర్జిస్తాయి.

శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల బలహీనత, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం, నాలుక కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం, అలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, చేతులు గోళ్ళు వంగి గుంటలు పడటం, పాదాలలో నీరు చేచడం, చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రధ్ద, ఆటల్లో అనాసక్తి నీరసం.

 These Common Foods Can Improve Blood Circulation In A Month!

రక్తహీనతను మెరుగుపరచడంలో ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మానవ శరీంరలో ధమనుల నుండి రక్తం నరాల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు సప్లై చేస్తుంది. అలాగే హార్ట్ నుండి, శరీర బాగాలకు తిరిగి హార్ట్ కు సరఫరా చేస్తుంది,. గుండె నుండి రక్తం శరీరంలో వివిధ బాగాలకు సప్లై చేయడం నార్మంలో అయితే శరీరంలోని ఇతర బాగాలకు రక్తం సరిపగా సప్లై కాకపోతే, వివిద రకాల వ్యాధుల భారిన పడాల్సి వస్తుంది.

రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను మరియు న్యూట్రీషియన్స్ ను సప్లై చేస్తుంది. శరీరంలోని వివిధ భాగాలకు సరిగా ఆక్సిజన్ సప్లై కాకపోతే వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా అవసరం. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగుతుంటే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి కొన్ని కామన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ఆరెంజ్:

ఆరెంజ్:

ఆరెంజ్ లో విటమిన్ సి మరియు బయోఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి రక్తనాళాల యొక్క గోడలను స్ట్రాంగ్ గా ఉంటుంది. దాంతో రక్త ప్రసరణ నేచురల్ గా మెరుగుపడుతుంది.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్తంతో పాటు ఆక్సిజన్ ప్రసరణకు సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది.

అల్లం:

అల్లం:

బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడంలో మరో హెల్తీ ఫుడ్ అల్లం, అల్లం ఆరోగ్యకరమైన రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది. దాంతో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో మరో ఫుడ్ వెల్లుల్లి, మూసుకుపోయిన ధమనులను తెరచుకునేలా చేయడంలో వెల్లుల్లి గొప్పగా సహాయపడుతుంది. ఇది నేచురల్ బ్లడ్ థిన్నర్ గా సహాయపడుతుంది.

 వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ :

ఈ టేస్టీ ఫ్రూట్ ఒక నేచురల్ ఫుడ్ . ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్ ధమనుల్లో ప్లాక్ (పాచి )చేరకుండా నివారిస్తుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

 నట్స్ :

నట్స్ :

బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో మరో గ్రూప్ ఆఫ్ ఫుడ్ నట్స్ . నట్స్ లో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరంగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

These Common Foods Can Improve Blood Circulation In A Month!

Do you often feel extremely tired and also experience a numbness in your extremities? If yes, then you could be suffering from poor blood circulation and there are certain powerful foods that can improve your blood circulation.
Story first published: Monday, December 12, 2016, 13:28 [IST]
Desktop Bottom Promotion