For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో త్వరగా ఐరన్ లెవెల్స్ మెరుగుపరిచే ఎఫెక్టివ్ హోం రెమెడీ..!!

ఒకవేళ మీరు ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతుంటే.. బెల్లంను మీ డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలి. సొంఠి లేదా శనగలతో కలిపి తీసుకుంటే.. ఐరన్ డెఫీషియన్సీ నుంచి తేలికగా బయటపడవచ్చు.

By Swathi
|

అలసిపోయినప్పుడు, బలహీనంగా మారినట్టు చాలా తరచుగా ఫీలవుతున్నారా ? అలాగే బద్ధకంతో బాధపడుతున్నారా ? అంతేకాకుండా మైకం వంటి సమస్యలు కనిపిస్తున్నాయా ? అయితే వెంటనే చెక్ చేయించుకోవాలి. ఇది ఐరన్ డెఫిషియన్సీకి కారణం అయి ఉండవచ్చు.

This One Natural Ingredient Does Wonders To Raise Your Iron Level

ఒకవేళ మీరు ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతుంటే.. బెల్లంను మీ డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలి. సొంఠి లేదా శనగలతో కలిపి తీసుకుంటే.. ఐరన్ డెఫీషియన్సీ నుంచి తేలికగా బయటపడవచ్చు. ఇది చాలా త్వరగా శరీరంలో ఐరన్ లెవెల్స్ ని మెరుగుపరుస్తుంది.

శరీరానికి అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఐరన్ ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ ని తయారు చేస్తుంది. అది ఆక్సిజన్ ని వివిధ భాగాలకు పంపుతుంది. అలాగే శరీరంలో ఐరన్ లెవెల్స్ పెంచే ఆహారాల్లో బెల్లం ఒకటి.

ఐరన్ లోపం అనేది ఆడవాళ్లలో చాలా కామన్ గా కనిపించే సమస్య. ముఖ్యంగా వాళ్ల రుతుక్రమ సమయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఐరన్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. శరీరంలో ఐరన్ లోపిస్తే.. వీక్ నెస్, మైకం వంటి రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపం తగ్గించాలంటే.. బెల్లంను రెండు రకాలుగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టిప్ 1

టిప్ 1

బెల్లం, శనగలు ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువ మోతాదులో ఐరన్ పొందవచ్చు. ఇప్పటికే ఐరన్ లోపంతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం.

ఎలా తీసుకోవాలి

ఎలా తీసుకోవాలి

రాత్రంతా గుప్పెడు శనగలను నీటిలో నానబెట్టాలి. ఉదయం అందులోకి రెండు టీస్పూన్ల బెల్లం మిక్స్ చేయాలి.

పరకడుపున

పరకడుపున

ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని ఏమీ తినక ముందు అంటే ఖాళీ కడుపుతో తీసుకుంటే.. శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది.

టిప్ 2

టిప్ 2

బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానిలో సొంఠి కలిపి తీసుకుంటే.. ఐరన్ గ్రహించే శక్తి పొందవచ్చు.

ఎలా తీసుకోవాలి

ఎలా తీసుకోవాలి

2 టీస్పూన్ల బెల్లం తీసుకోవాలి. టీ స్పూన్ సొంఠి పొడి తీసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి తీసుకోవాలి. అన్నింటినీ మిక్స్ చేయాలి.

మూడుసార్లు

మూడుసార్లు

ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ చొప్పుడు ప్రతి సారి భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. ఇలా రోజుకి మూడుసార్లు తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

This One Natural Ingredient Does Wonders To Raise Your Iron Level

This One Natural Ingredient Does Wonders To Raise Your Iron Level. Jaggery is one of the best ingredients that helps in treating iron deficiency. This article explains about how to use it.
Story first published: Saturday, December 10, 2016, 15:38 [IST]
Desktop Bottom Promotion