For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరివేపాకు పొడి, తేనె మిశ్రమంతో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!

By Swathi
|

కరివేపాకును పోపులో వేయగానే.. అద్భుతమైన సువాసన వెదజల్లుతుంది. ఇండియాకు ప్రత్యేకమైన.. ఈ కరివేపాకు.. అద్భుతమైన ఫ్లేవర్, స్మెల్ మాత్రమే కాదు.. వంటకాలకు అద్భుతమైన టేస్ట్ ని అందిస్తుంది. అలాగే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండే.. కరివేపాకు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఇంకా కొన్ని ఇళ్లలో గార్డెన్ లో ఈ మొక్కను పెంచుకుంటారు. ఇందులో ఉండే పోషకాలు అమోఘమైనవి కాబట్టి.. అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం కరివేపాకు.

కరివేపాకును ఎలా తీసుకుంటే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు, ఎలాంటి వ్యాధులను నయం చేసుకోవచ్చో.. కొన్ని అధ్యయనాలు వివరిస్తున్నాయి. అలాగే వంటకాల్లో వేసిన కరివేపాకును ఎట్టిపరిస్థితుల్లో పక్కనపడేయకుండా... తినాలనిపించే అమేజింగ్ బెన్ఫిట్స్ ఇందులో దాగున్నాయి.

గుండె వ్యాధులకు

గుండె వ్యాధులకు

గుండె వ్యాధులు నిరోధించడంలో కరివేపాకు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. తాజా కరివేపాకు ఆకులను.. ఉదయాన్ని పరగడుపున ప్రతిరోజూ తినాలి.

అనీమియా

అనీమియా

కర్జూరాలతో కలిపి.. కొన్ని కరివేపాకు ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. అనీమియాను న్యాచురల్ గా నివారించవచ్చు.

కాలేయం

కాలేయం

ఒక టీస్పూ నెయ్యి, ఒక టీ స్పూన్ నల్లమిరియాల పొడిని ఒక కప్పు కరివేపాకు జ్యూస్ లో కలిపి రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే.. కాలేయం డ్యామేజ్ అవకుండా.. అరికట్టవచ్చు.

బ్లడ్ షుగర్ లెవెల్స్

బ్లడ్ షుగర్ లెవెల్స్

అన్ని వంటకాల్లో కరివేపాకును వాడాలి. వాటిని పక్కనపెట్టకుండా.. తీసుకుంటూ ఉంటే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

జీర్ణక్రియకు

జీర్ణక్రియకు

కొన్ని కరివేపాకులు, జీలకర్రను నెయ్యిలో ఫ్రై చేసి.. రోజుకి ఒకసారి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

డయేరియా

డయేరియా

ఒక గ్లాసు మజ్జిగలో కరివేపాకు పొడిని కలిపి.. రోజుకి రెండుసార్లు తీసుకుంటే.. డయేరియా నివారించడం తేలికవుతుంది.

జుట్టు పెరుగుదలకు

జుట్టు పెరుగుదలకు

కరివేపాకు రసాన్ని కొబ్బరినూనెలో మిక్స్ చేసి రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే.. జుట్టు మీరు ఊహించని విధంగా పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గించడమే కాకుండా.. నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది.

దగ్గు, జలుబు

దగ్గు, జలుబు

కరివేపాకు పొడిని, తేనెతో కలిపి.. రోజుకి రెండుసార్లు తీసుకుంటే.. దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

English summary

This Plant Is a Great Cure for a Heart Patient !

This Plant Is a Great Cure for a Heart Patient ! Slightly bitter in taste and available easily in almost all households, curry leaves are packed with oodles of nutrients that are actually good for you.
Story first published: Monday, September 26, 2016, 15:39 [IST]
Desktop Bottom Promotion