For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పటికిప్పుడు మీకు శక్తిని అందించే పవర్ ఫుల్ హోంమేడ్ డ్రింక్..!

By Swathi
|

మీరు చాలా బిజీబిజీగా గుడుపుతున్నారా ? ఉదయాన్నే లేచి.. అన్ని పనులు పూర్తి చేసుకుని, ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వచ్చే సరికి మీలో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోతోందా ? ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్ పై ఆధారపడుతున్నారా ? ఎనర్జీ పొందడానికి మార్కెట్ లో రకరకాల ప్రొడక్ట్స్ వాడుతున్నారా ?

ఒకవేళ మీరు ఈ కేటగిరీకి చెందిన వాళ్లు అయితే.. మార్కెట్ లో లభించే ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయని, కెఫీన్ ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. వాటిని రెగ్యులర్ గా తీసుకోవడం మీ ఆరోగ్యానికి హాని చేస్తాయని గమనించండి.

Powerful Homemade Drink

అలసట రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఇమ్యునిటీ బలహీనంగా ఉన్నప్పుడు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా, ఎక్కువగా పనిచేయడం వల్ల, ఒత్తిడి వల్ల కూడా.. అలసటకు లోనవుతారు. ప్రతిరోజూ మీ పనులన్నీ పూర్తిచేసేసరిగి మీలో ఉన్న శక్తి నశిస్తుంటే.. ఇతర సమస్యలకు దారితీస్తాయి. ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

కాబట్టి బిజీగా ఉండేవాళ్లు ఇన్ స్టంట్ గా ఎనర్జీ పొందే న్యాచురల్ డ్రింక్ మీ చేతులతోనే తయారు చేసుకోవచ్చు. మీరు న్యాచురల్ గా ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. మరి ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

Powerful Homemade Drink

అరటిపండు 1
ఆరంజ్ సగం పండు
ఫ్లాక్స్ సీడ్స్ 2 టీస్పూన్లు

అరటిపండు, ఆరంజ్, ఫ్లాక్స్ సీడ్స్ కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ న్యాచురల్ ఎనర్జీ డ్రింక్. ఈ పదార్థాలన్నింటిలో ఎక్కువ పోషకాలు, ఎలక్ట్రోసైట్స్ ఉంటాయి. ఇవి శరీరం కోల్పోయిన ఎనర్జీని తక్షణమే పొందేలా చేస్తాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎనర్జీ లెవెల్స్ ని కావాల్సినంత పెంచేస్తుంది.

Powerful Homemade Drink

ఆరంజ్ లో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ ఉంటాయి. ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ పెరగడంలో సహాయపడతాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఎనర్జీ లెవెల్స్ పెంచడంలో.. బాగా సహాయపడతాయి. కాబట్టి.. ఈ ఎనర్జీ డ్రింక్ ని వర్కవుట్ కి ముందు కూడా తీసుకోవచ్చు. మరి ఈ ఎనర్జీ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

ఎనర్జీ డ్రింక్ తయారు చేసే విధానం
తాజాగా కట్ చేసిన అరటిపండు ముక్కలు, ఆరంజ్, 2 టీస్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ ని బ్లెండర్ లో వేయాలి.
అన్నింటినీ జ్యూస్ అయ్యేంతవరకు బ్లెండ్ చేయాలి.
కొన్ని గోరువెచ్చని పాలు కలుపుకుంటే.. జ్యూస్ చిక్కగా మారుతుంది.
ఈ డ్రింక్ ని రోజూ తీసుకోవచ్చు.
ఎప్పుడైతే.. అలసిపోయినట్టు ఫీలవుతారో.. అప్పుడు ఈ డ్రింక్ తాగడం వల్ల తక్షణ శక్తిని పొందుతారు.

English summary

This Powerful Homemade Drink Can Give You An Instant Energy!

This Powerful Homemade Drink Can Give You An Instant Energy! If you want a way to feel instantly energised, naturally, then you can try a potent natural homemade drink that can help you out!
Story first published:Friday, June 24, 2016, 16:38 [IST]
Desktop Bottom Promotion