For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ల నొప్పులని దూరం చేసే తోలాసనం లేదా స్కేల్ పోజ్

By Super
|

మోకాళ్ల నొప్పుల బాధ వర్ణనాతీతం. ఒక్క మోకాళ్ల నొప్పులే కాదు ఏ నొప్పులైనా బాధే. చెప్పులు వేసుకున్నవాడికే చెప్పు కరిచిన నొప్పి తెలుస్తుంది అన్నట్లు ఈ నొప్పులని అనుభవించినవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది.

పంటి నొప్పి లేదా ప్రసవ వేదన గురించి అందరూ చెప్తారు కానీ ఇవి జీవిత కాలం ఉండవు. కొన్నొ నొప్పులు రాక ముందే జాగ్రత్త పడాలి. వాటిలో కీళ్ళనొప్పులొకటీ. నొప్పులు మరీ ఎక్కువైపోతే యోగా కూడా చేయలేము. అలాంటి పరిస్థితిలో డాక్టర్ల చుట్టూ తిరిగి జేబులు ఖాళీ చేసుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అందువల్ల యోగాని మీ జీవితంలో భాగం చేసుకుని క్రమం తప్పకుండా పాటిస్తే మంచిది.

తులాసనం అన్న పేరు సంస్కృతంలో "తుల" అన్న పదం నుంచి వచ్చింది దాని అర్ధం సమతుల్యత లేదా బ్యాలెన్సింగ్. ఈ భంగిమని మొదలుపెట్టేటప్పుడు మీ తొడలు, పిరుదుల భాగాన్ని వదులుగా ఉంచాలి.పైగా మీరు కూర్చుని ఉండే మీ బరువుని మీరు మోయగలిగేంత మాత్రమే ఉండేటట్లు చూసుకుని అధికంగా ఉన్న బరువుని తగ్గించుకోవాలి.

Tolasana

మెల్లిగా మీరు ఈ ఆసనంలో పట్టు సాధిస్తారు. తొందరపడిపోయి ప్రకృతికి విరుద్ధంగా వెళ్లకండి. యోగాలో ఇది ముఖ్య సూత్రం. మీ శరీరం సహకరించినంత మేర మాత్రమే చెయ్యండి. ముఖ్యంగా ఈ ఆసనంలోని కిటుకుని గ్రహించి మెల్లిగా మీరు సాధన చేయాలి. తొందరపడిపోతూ గబగబా అన్ని ఆసనాలూ వేసేసేకంటే మెల్లిగా ఒక ఆసనం వేసినా దానిలో పట్టు సాధించాలి.

ఈ ఆసనాన్ని వేసే కొత్తలో మీ చేతులపక్కన చిన్న దిమ్మెల లాంటివి పెట్టుకుని చేతులు వాటి మీద పెట్టి మెల్లిగా మీ శరీరాన్ని పైకి లేపండి. ఎక్కువసేపు ఇలా లేపవద్దు.మీరు మెల్లిగా చేస్తూ ఈ ఆసనాన్ని ఆస్వాదించండి. త్వరలోనే మీరు దీనిని సులభంగా వెయ్యగలిగే స్థాయిని చేరుకుంటారు.

ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలి:
1. యోగా మ్యాట్ మీద మామూలుగా కూర్చోండి.
2.కాళ్లు ఒకదానిమీద ఇంకొకటి వేసి పద్మాసనంలో కూర్చోండి.
3.మీ పిరుదులపక్కన ఉండేటట్లు మ్యాట్ మీద మీ చేతులు కింద ఉంచండి.మీ మణికట్టు ముందుకి ఉంచి చేతి వేళ్లని విస్తరించండి.

Tolasana

4. మీరు ఊపిరి వదిలేటప్పుడు మీ భుజాలు విశాలపరచి ఒకదానికొకటి దూరంగా పెట్టి ఊపిరి వదలండి.
5.ఇప్పుడూ మెల్లిగా మీ శరీరాన్ని పైకి లేపండి. మణికట్టు ని స్థిరంగా కింద ఉంచి మణికట్టు మీద శరీరాన్ని బ్యాలెన్స్ చెయ్యాలి. మణికట్టు మీద బ్యాలెన్స్ చేసేటప్పుడూ జారిపోకుండా ఉండాలంటే మణికట్టు ఉంచిన స్థలం కాస్త రఫ్ గా ఉండేటట్లు చూసుకోండి.

Tolasana

6.ఇలా పైకి లేచిన భంగిమలో ఒక 3-5 ఊపిరిలవరకూ ఉంచి మళ్లీ ఒక 5-7 సార్లు ఈ ఆసనాన్ని వెయ్యండి.
7.మొదటిసారే ఈ ఆసనం మీకు చిక్కదు. యోగా మొదలెట్టినప్పుడు ముందు మీ శరీరం సాగేటట్లు చూసుకోండి. ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు. మెల్లిగా ఆస్వాదిస్తూ రోజూ యోగా చెయ్యండి. అనవసరంగా కంగారు పడి మీ చేతులు లేదా పిరుదుల భాగంతో ఆటలాడి గాయాల పాలు కాకండి.

ఈ ఆసనం వల్ల ఉపయోగాలు:
1.మోచేతులు, మణీకట్టు, పిరుదులు బలపడతాయి.
2.శరీరం యొక్క బ్లాలెన్సింగ్ పెరుగుతుంది.
3.మీ కండరాలలోని ఒత్తిడిని దూరం చేసి మెదడుకి విశ్రాంతినిస్తుంది.
4.పొత్తికడుపు కండరాలని గట్టిపరచడంవల్ల మీ పొట్ట భాగం చదునుగా తయారవుతుంది.

ఈ ఆసనం వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
భుజాలు లేదా మణికట్టు గాయలున్నప్పుడు ఈ ఆసనం వెయ్యకూడదు
మోకాళ్లు లేదా చీలమండ గాయాలున్నప్పుడు కూడా ఈ ఆసనం వేయరాదు.
మీ పిరుదులు లేదా తొడలు గట్టిగా ఉండీ నెప్పులుగా ఉన్నప్పుడు కూడా వెయ్యకూడదు.

English summary

Tolasana Or Scale Pose To Treat Knee Pain Completely

Tolasana Or Scale Pose To Treat Knee Pain Completely. Knee pain is actually unbearable. It isn’t about knee pain, but about all the other pains.
Desktop Bottom Promotion