For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ స్టోన్స్ ను శాస్వతంగా నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Staff
|

కిడ్నీ స్టోన్స్..! ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగామారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కనిపించే సాధారణ లక్షణాలు.

కిడ్నీ స్టోన్స్ వల్ల శరీరం సూచించే హెచ్చరికలను కొంత మంది పెడచెవి పెట్టి తమ ఆరోగ్యాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా.

తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్‌ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్‌ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్‌ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు.

Top 10 Effective Home Remedies To Flush Out Kidney Stones

అయితే స్ర్తీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావ డానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్‌ ఏర్పడినప్పు డు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది.

కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడిన తర్వాత వాటిని శాస్వతంగా నివారించుకవోడానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈక్రింది విధంగా ఉన్నాయి..

యాపిల్స్:

యాపిల్స్:

యాపిల్స్ కిడ్నీస్టోన్స్ ను నివారిస్తాయి. రోజూ ఒక ఫ్రెష్ యాపిల్స్ తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వారు ఖచ్చితంగా రోజుకు ఒక ఆపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది.

MOST READ:శరీరంలో అధనపు కొవ్వును కరిగించి.. వేగంగా బరువు తగ్గించే నేచురల్ జ్యూసులుMOST READ:శరీరంలో అధనపు కొవ్వును కరిగించి.. వేగంగా బరువు తగ్గించే నేచురల్ జ్యూసులు

తులసి:

తులసి:

తులసిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ మూలిక కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి నేచురల్ టానిక్ లా పనిచేస్తుంది. ఫ్రెష్ గా ఉండే తులసి ఆకులను రసం చేసి, తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఆరు నెలల పాటు తీసుకుంటే ఖచ్చితంగా మార్పుఉంటుంది.

 ద్రాక్ష:

ద్రాక్ష:

కిడ్నీ స్టోన్స్ నివారించడంలో ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ద్రాక్షలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇంకా పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీస్టోన్స్ కరిగిపోతాయి. ఈ పండ్లలో సోడియం క్లోరైడ్, అల్బునియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.

 వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ :

పుచ్చకాలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పుచ్చకాయను రెగ్యులర్ గా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. ఎలాంటి నొప్పి లేకుండా కిడ్నీ స్టోన్స్ ను బయటకు నెట్టివేస్తాయి.

కిడ్నీ బీన్స్

కిడ్నీ బీన్స్

కిడ్నీ బీన్స్ ఎక్సలెంట్ హోం రెమెడీ. ఇది కిడ్నీ స్టోన్స్ ను బయటకు నెట్టివేయడంలో గొప్పగా సహాయపడుతుంది. కిడ్నీ బీన్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రాళ్ళు బటకు వచ్చేస్తాయి. ఎప్పుడూ ఫ్రెష్ గా నానబెట్టి, ఉడికించిన కిడ్నీ బీన్స్ ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

MOST READ:ముల్తాని మట్టి ఫుల్లర్స్ ఎర్త్ లోని అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్MOST READ:ముల్తాని మట్టి ఫుల్లర్స్ ఎర్త్ లోని అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

ఆస్పరాగస్ ను రోజూ తినడం వల్ల ఇందులో ఉండే ఆస్పరాజిన్ కిడ్నీలో స్టోన్స్ ను బ్రేక్ చేస్తుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ ను చిన్నగా విచ్చిన్నం చేసి, యూరిన్ ద్వారా బయటకు నెట్టేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

మరో సింపుల్ రెమెడీ. శరీరంలో కిడ్నీ స్టోన్స్ నివారించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. భోజనానికి ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీలో రాళ్లను మెత్తగా మార్చి, స్టోన్స్ ను కరిగించేస్తుంది.

లిన్ సీడ్ టీ

లిన్ సీడ్ టీ

కిడ్నీ స్టోన్స్ కరిగించుకోవడానికి లిన్ సీడ్ టీ తాగాలిజ లిన్ సీడ్స్ ను ఒక గ్లాసు నీటిలో వేసి 15 నిముషాలు ఉడికించాలిజ తరవ్ాత అందులో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి వేడి వేడిగా తాగాలి. ఒక రోజులో5 సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి.

వాటర్ థెరఫీ

వాటర్ థెరఫీ

ఎక్కువ నీళ్ళు తాగాలి. ఒక రోజుకు మూడు లీటర్ల నీళ్ళు తాగడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. కిడ్నీలోని స్టోన్స్ మూత్రం ద్వారా బయటకు రావలంటే రోజూ సరిపడా నీళ్ళు తాగాలి.

విటమిన్ బి6

విటమిన్ బి6

కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి విటమిన్ బి6 సప్లిమెంట్ తీసుకోవాలి. 100 నుండి 150యంజిల సప్లిమెంట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ బయటకు నెట్టేస్తాయి.

English summary

Top 10 Effective Home Remedies To Flush Out Kidney Stones

Stones in kidney have become quite common these days. This is seen in human body because of genetic or environmental factors. Kidney stones can appear in both men and women, but it is mostly prevalent in men. You must consult a doctor immediately if you believe that you are suffering from kidney stones
Desktop Bottom Promotion