For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా.. అడ్డుకునే అద్భుత ఆహారాలు..!!

By Swathi
|

క్యాన్సర్ అంటే ఇప్పుడు అత్యంత భయంకరమైన వ్యాధిగా మారింది. సరైన పద్దతి, మందులు, కీమోతెరపీ ద్వారా క్యాన్సర్ ని నివారించవచ్చు. మొదట్లోనే రొమ్ము క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితే.. నివారించడానికి చాలా పద్ధతులున్నాయి.

breast cancer

క్యాన్సర్ నివారించడానికి కొన్ని ఆహారపు అలవాట్లు సహాయపడతాయి. అయితే హెల్తీ డైట్ ఫాలో అవడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువ కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకుంటూ, రోజుకి 30 నిమిషాలు వ్యాయామం చేసే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు.. ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే రిస్క్ ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది.

సీ ఫుడ్, ఒమేగా త్రీఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు బ్రెస్ట్ క్యాన్సర్ ని నిరోధిస్తాయి. ఇవే కాదు మరికొన్ని ఆహారాలు డైట్ చేర్చుకోవడం తప్పనిసరి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్ ని.. గింజల రూపంలో లేదా ఆయిల్ రూపంలో తీసుకోవచ్చు. వీటిల్లో ఒమేగా త్రీ, లిగ్నన్స్, ఫైబర్ ఉండటం వల్ల.. క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సలాడ్స్, బ్రేకింగ్ ఫుడ్స్ లో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో క్యాన్సర్ తో పోరాడే.. అల్లియమ్ ఉంటుంది. ఇది.. ట్యూమర్ గ్రోత్ ని అరికట్టి.,. బ్రెస్ట్ క్యార్సర్ రిస్క్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

దానిమ్మ

దానిమ్మ

బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధించడంలో.. దానిమ్మ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో పాలిపెనాల్, ఎలాజిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల.. క్యాన్సర్ గ్రోత్ ని అడ్డుకుంటుంది.

గ్రీన్ వెజ్జీస్

గ్రీన్ వెజ్జీస్

పాలకూర, బ్రొకోలి, క్యాబేజ్, బీన్స్ వంటి ఆకుకూరల్లో, గ్రీన్ వెజిటబుల్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి. ఫైబర్, విటమిన్ బి, ఫైటో కెమికల్స్ ఉంటాయి.

సాల్మన్

సాల్మన్

ఒమేగా త్రీ, విటమిన్ బి12, విటమిన్ డి సాల్మన్ చేపల్లో లభిస్తాయి. బి12 విటమన్.. క్యాన్సర్ ని నివారించడంలో.. ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని.. అధ్యయనాలు నిరూపించాయి.

బ్రొకోలి

బ్రొకోలి

క్యాలిఫ్లవర్, క్యాబేజ్, కేల్ వంటి వాటిల్లో ఎక్కువగా సల్ఫర్ ఉంటుంది. ఇవి.. క్యాన్సర్ కణాల గ్రోత్ ని అడ్డుకుంటాయి. పోరాడతాయి. బ్రెస్ట్, బ్లాడర్ క్యాన్సర్ లను అరికడతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

రెగ్యులర్ గా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గించవచ్చు. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల.. క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చు.

క్యాప్సికం

క్యాప్సికం

ఫైటో కెమికల్స్ లేదా పోషకాలు.. ఎక్కువగా తీసుకుంటే.. క్యాన్సర్ తో పోరాడవచ్చు. క్యాప్సికం, మిరపకాయల్లో క్యాప్ససిన్ ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ ని అడ్డుకుంటాయి.

పసుపు

పసుపు

పసుపులో క్యాన్సర్ తో పోరాడే.. కర్క్యుమిన్ ఉంటుంది. ఇది.. అన్ని రకాల క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. బ్రెస్ట్, పొట్ట, లంగ్, స్కిన్ క్యాన్సర్ లతో పోరాడుతుంది.

వాల్ నట్స్

వాల్ నట్స్

క్యాన్సర్ నిరోధించడానికి ఫాలో అయ్యే డైట్ లో వాల్ నట్స్ ని ఖచ్చితంగా చేర్చుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ కి కారణమయ్యే ట్యూమర్స్ ని అరికట్టడానికి వాల్ నట్స్ బాగా సహాయపడతాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వాల్ నట్స్ చేర్చుకోవడం చాలా అవసరం.

English summary

Top 10 foods that prevent breast cancer

Top 10 foods that prevent breast cancer. One in every eight women would run the risk of developing the disease in her lifetime.
Story first published: Monday, October 10, 2016, 11:18 [IST]
Desktop Bottom Promotion