For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీర్ణవ్యవస్థ హెల్తీగా ఉండాలంటే తప్పకుండా పాటించాల్సిన నియమాలు..!

By Swathi
|

జీర్ణవ్యవస్థ పనితీరు చాలా ముఖ్యమైనది. తీసుకున్న ఆహారాన్ని పోషకాలుగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది జీర్ణవ్యవస్థ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు.

శరీరం మొత్తం పనితీరు జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్, బ్రీతింగ్, బ్రెయిన్ ఫంక్షన్ వంటివన్నీ.. సరైన జీర్ణక్రియ వల్ల సాధ్యమవుతుంది. అయితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల పద్ధతులున్నాయి. మరి.. ఈ టిప్స్ ని తప్పకుండా పాటించి.. మీ జీర్ణవ్యవస్థను హెల్తీగా మార్చుకోండి..

ఆహారాన్ని బాగా నమలడం

ఆహారాన్ని బాగా నమలడం

ఆహారాన్ని బాగా నమలడం అనేది.. చాలా బేసిక్ థింగ్. కానీ చాలామంది.. ఆత్రుతగా.. నమలకుండా.. మింగేస్తూ ఉంటారు. జీర్ణవ్యవస్థకు మొదటి భాగం నోరు. పళ్లు, నాలుక. బాగా నమలడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారం పడదు.

రియల్ ఫుడ్

రియల్ ఫుడ్

ప్రాసెస్డ్ ఫుడ్ ని వదిలేసిప.. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి. న్యాచురల్ గా ఉత్పత్తి చేసిన ఆహారాలు శరీరానికి మంచిది. మందుల ద్వారా రూపొందిన ఆహారాలకు కూడా దూరంగా ఉండటం మంచిది.

కాలేయ ఆరోగ్యం

కాలేయ ఆరోగ్యం

కాలేయం కూడా సరిగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. ఫ్యాటీ ఫుడ్, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటారో.. వాళ్లు.. కాలేయంపై ఒత్తిడి పెంచుతారు. దీనివల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బందిగా మారుతుంది.

హైడ్రేటెడ్

హైడ్రేటెడ్

ఎక్కువగా నీళ్లు తాగాలని చాలామంది సూచిస్తూ ఉంటారు. నీళ్లు.. శరీరానికి ఆహారం గ్రహించే శక్తిని ఇస్తుంది. అలాగే.. తేలికగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. అలాగే మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల.. మలినాలను తేలికగా బయటకు పోతాయి.

ఫ్రూట్స్, వెజిటబుల్స్

ఫ్రూట్స్, వెజిటబుల్స్

ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇవి తేలికగా డైజెస్ట్ అవుతాయి.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి శరీరానికి చాలా అనారోగ్యకరం. ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు ఇది మంచిది కాదు. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం, బ్రీతింగ్, మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయడం మంచిది.

ఫైబర్ ఫుడ్

ఫైబర్ ఫుడ్

ఫైబర్ సరిగ్గా జీర్ణమవడానికి సహాయపడుతుంది. అలాగే గ్లుటమిన్ కూడా.. పేగులకు సంబంధించిన సమస్యలను, ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి.. ఈ రెండింటినీ డైట్ లో చేర్చుకోవాలి. లీఫీ వెజిటబుల్స్ లో.. ఫైబర్, గ్లుటమిన్ లభిస్తుంది.

English summary

Top 10 Ways To Keep Your Digestive System Healthy

Top 10 Ways To Keep Your Digestive System Healthy. The process performed by the digestive system is a very vital one. Digestion refers to the process wherein the food that one eats is broken down by the body to simpler particles and is absorbed as either fat or nutrient.
Story first published:Tuesday, July 5, 2016, 17:38 [IST]
Desktop Bottom Promotion