For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ సమస్యలను నివారించే టాప్ 10 హోం రెమెడీస్

|

థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? థైరాయిడ్ సమస్యను నేచురల్ గా తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్ కోసం చూస్తున్నారా? రెమెడీస్ గురించి తెలుసుకోవడానికి ముందు థైరాయిడ్ అంటే ఏమిటి, థైరాయిడ్ సమస్యకు కారణాలు ఏంటి మరియు మీకున్న థైరాయిడ్ రకం ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. థైరాయిడ్ గ్రంథులు మన శరీరంలోని మెటబాలిజం రేటును కంట్రోల్ చేస్తుంది.

థైరాయిడ్ పిలవడానికి ఒక సింగిల్ పేరులా అనిపించొచ్చు, కానీ థైరాయిడ్ రెండు రకాలు . అందులో మొదటిది ''హైపో థైరాయిడిజం'' మరియు రెండవది ''హైపర్ థైరాయిడిజం''. హైపోథైరాయిడిజం అంటే? థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనపుడు ఏర్పడే పరిస్థితిని హైపోథైరాయిడిజం అంటారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో హార్మోనులు ఉత్పత్తి కావల్సిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి అవ్వడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు

హైపో లేదా హైపర్ థైరాయిడిజంకు ముఖ్య కారణం శరీరంలో ఐరన్ లోపించడం వల్ల ఇర్రెగ్యులర్ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడమే. థైరాయిడ్ సమస్యల వల్ల కొన్ని ప్రాణాంత వ్యాధుల బారిన పడాల్సివస్తుంది. సరైన సమయంలో గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోకపోతే గాయిటర్, థ్రోట్ క్యాన్సర్ లేదా థ్రోట్ లో సిస్టులు వంటి లక్షణాలన్నీ కూడా థైరాయిడ్ వ్యాధులకు సూచన.

థైరాయిడ్ వ్యాధులను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ మరియు థెరఫీలు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని నేచురల్ అమేజింగ్ హోం రెమెడీస్ ను ఉపయోగించి థైరాయిడ్ సమస్యను నివారించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు వీటిని ఉపయోగించడం సురక్షితమైనవి.
కొన్ని ప్రత్యేకమైన హోం రెమెడీస్ రెండు రకాల థైరాయిడ్ వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

థైరాయిడ్ డిసీజ్ ను తగ్గించే టాప్ 10 హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి . ఈ హోం రెమెడీస్ ను రెగ్యులర్ గా ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యను కంట్రోల్ లేదా పూర్తిగా నివారించుకోవచ్చు . ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం...

ఆకు కూరలు:

ఆకు కూరలు:

థైరాయిడ్ వ్యాధులను నివారించడంలో ఆకుకూరలు గ్రేట్ గా సహాయపడుతాయి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్స్, ప్రోటీనులు, మినిరల్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీర జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. ఆకుకూరల్లో విటమిన్ ఎ థైరాయిడ్ ఎండోక్రైన్ గ్రంథులు థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది . . థైరాయిడ్ సమస్య వ్యాధులను నివారించుకోవడానికి ఆకుకూరలు బెస్ట్ హోం రెమెడీ.

కెల్ప్:

కెల్ప్:

కెల్ఫ్ సీఫుడ్. ఇందులో ఐయోడిన్ పుష్కలంగా ఉంది. థైరాయిడ్ ను కంట్రోల్ చేయడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. అందువల్ల, రెగ్యులర్ డైట్ లో కెల్ఫ్ ను చేర్చుకోవడం మంచిది. సలాడ్స్ మరియు సూప్స్ రూపంలో దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కవుగా ఉన్నప్పుడు, ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథులు పనిచేయకుండా బ్లాక్ అవ్వడానికి కారణమవుతాయి. కొబ్బరి నూనె ఈస్ట్రోజన్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు శరీరంలో మెటబాలిక్ రేటును పెంచుతుంది. ఫలితంగా ఫ్యాట్ కరిగి ఎనర్జీగా మార్పు చెతుంది . పాలతో పాటు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల థైరాయిడ్ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

పసుపు:

పసుపు:

ఇండియన్ వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. పసుపులో ‘‘కుర్కుమిన్' అనే కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. థైరాయిడ్ వ్యాధులను కంట్రోల్ చేయడానికి మరియు నివారించడానికి పసుపు ఎఫెక్టివ్ హోం రెమెడీ.

టేబలు్ సాల్ట్:

టేబలు్ సాల్ట్:

టేబుల్ సాల్ట్ లో ఐయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ అండర్ కంట్రోల్లో ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది కామన్ కిచెన్ స్పైస్. దీన్ని అన్ని రకాల వంటల్లో వినియోగిస్తుంటారు. థైరాయిడ్ వ్యాధులను నివారించడంలో దీన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీగా ఉపయోగిస్తుంటారు .

అల్లం :

అల్లం :

అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న ఔషధ హెర్బ్ . అల్లంలో ఉండే ‘‘జింజరోల్స్''థైరాయిడ్ ఇన్ఫ్లమేసన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. థైరాయిడ్ ట్రీట్మెంట్ లో ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ అల్లం.

గుడ్డులోని పచ్చసొన:

గుడ్డులోని పచ్చసొన:

థైరాయిడ్ గ్రంథులు స్మూత్ గా పనిచేయడానికి అవసరమ్యే కాపర్ ను అందివ్వడంలో థైరాయిడ్ గ్రంథులు హార్మోన్స్ ను సరిగా ఉత్పత్తి చేయడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో అప్పుడప్పుడు గుడ్డులోని పచ్చసొనను చేర్చుకోవాలి.

యోగ:

యోగ:

థైరాయిడ్ వ్యాథులను నివారించడంలో యోగా కూడా సహాయపడుతుంది. యోగ నిపుణులు సహాయంతో వారి సమక్షంలో కొన్ని యోగాసానాలు చేయడం వల్ల థైరాయిడ్ వ్యాధులను నేచురల్ గా దూరం చేసుకోవచ్చు.

వాల్ నట్స్ :

వాల్ నట్స్ :

డ్రై ఫ్రూట్ లో ఒకటి వాల్ నట్. వాల్ నట్ లో మెగ్నీషియం మరియు ఐయోడిన్ పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడంలో ఇందులో మెగ్నీషియం గ్రేట్ గా సహాయపడుతుంది . థైరాయిడ్ ట్రీట్మెంట్ లో వాల్ నట్స్ గ్రేట్ హోం రెమెడీ.

వ్యాయామం:

వ్యాయామం:

థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు రెగ్యురల్ వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాయామాలతో శరీరంలో మెటబాలిజం రేటు క్రమబద్దంగా ఉంటుంది. వ్యాయామాలు కూడా నిపుణుల సమక్షంలో చేయడం మంచిది . లేదంటో మరింత ప్రమాధంజరిగే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఇది కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ గా మారింది. చాలా మందికి ఆ లక్షణాలు బయటపడే వరకూ వారి థైరాయిడ్ ఉందని కనుక్కోలేరు. ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం, నిరాశ, ఆకలి లేకపోవడం, మలబద్ధకం, అలసట, బరువులో హెచ్చుతగ్గుల తేడాలు లేదా తక్కువ శరీర శక్తి వంటి రుగ్మతల యొక్క తీవ్రమైన లక్షణాలు ఎదురైతే తప్ప థైరాయిడ్ ను గుర్తించలేరు.

English summary

Top Ten Home Remedies For Thyroid Disease

Are you suffering from thyroid disease? Are you looking for some effective home remedies? Well, let us first acquaint you with the definition, cause and types of thyroid disease. Thyroid is a gland in your body that controls your metabolism.
Story first published:Tuesday, July 26, 2016, 15:20 [IST]
Desktop Bottom Promotion