For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెఫీన్ ఎక్కువైతే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు

By Swathi
|

ఉదయం నిద్రలేవగానే.. కప్పు కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కాఫీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు కూడా. అయితే కాఫీ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. అయితే కాఫీలో పాజిటివ్ విషయాలు, అలాగే నెగటివ్ విషయాలు కూడా ఉన్నాయి.

 గరం గరం చాయ్ తో గమ్మత్తైన ఆరోగ్య ప్రయోజనాలు గరం గరం చాయ్ తో గమ్మత్తైన ఆరోగ్య ప్రయోజనాలు

కొంతమంది కెఫీన్ ని ఇష్టపడితే.. మరికొంతమంది బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. అయితే ప్రపంచంలోనే కాఫీ తాగేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువట. అయితే కెఫీన్ ను కేవలం కాఫీ నుంచి మాత్రమే కాదు.. ఎనర్జీ డ్రింక్స్, ఐస్ క్రీంలు, ఇతర ఫుడ్స్ నుంచి కూడా పొందుతాము.

READ MORE: కాఫీ అప్పుడప్పుడూ తాగితే లాభం..అదే పనిగా త్రాగితే రోగం...!READ MORE: కాఫీ అప్పుడప్పుడూ తాగితే లాభం..అదే పనిగా త్రాగితే రోగం...!

కెఫీన్ మనల్ని ఉత్తేజపరిచినా.. మోతాదుకి మించితే.. ఇందులో నెగటివ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా కెఫీన్ ను తీసుకోవడం వల్ల.. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మంది కాఫీతో రోజుని ప్రారంభిస్తారు. కానీ.. ఇది మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ కెఫీన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

నరాలకు

నరాలకు

కెఫీన్ నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనికి అడిక్ట్ అవడం వల్ల.. నరాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

హానికరం

హానికరం

చాలా ఎక్కువ మోతాదులో కెఫీన్ తీసుకోవడం వల్ల.. మనిషి ప్రాణాలకే ముప్పు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి అనేదానిపై సరైన రిపోర్ట్స్ లేవు. కానీ.. రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

నొప్పి నివారణకు

నొప్పి నివారణకు

కెఫీన్ లో నొప్పి నివారించే గుణాలు దాగున్నాయి. అందుకే కొన్ని పెయిన్ కిల్లర్స్ లో ఈ కెఫీన్ ని ఉపయోగిస్తారు. మైగ్రేన్ ట్యాబ్లెట్స్ లో కూడా కెఫీన్ ఉంటుంది.

శరీరంపై

శరీరంపై

శరీరంలో కెఫీన్ పని చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ.. ఇది శరీరంలో క్షీణించడానికి మాత్రం.. కొన్ని గంటల సమయం పడుతుంది.

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ కంటెంట్.. చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. శరీరంపై దుష్ర్పభావం చూపుతాయి.

 ఎనర్జీ

ఎనర్జీ

వర్కవుట్ కి ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల పర్ఫామెన్స్ చాలా బావుంటుందని.. చాలామంది స్పోర్ట్స్ పీపుల్, జిమ్ అలవాటు ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.

అంగస్తంభన నివారణకు

అంగస్తంభన నివారణకు

మగవాళ్లలో కనిపించే అంగస్తంభన సమస్య నివారించడానికి కెపీన్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుందని వివరిస్తున్నాయి.

మూడ్

మూడ్

కెఫీన్ మీకు మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. మూడ్ బాగోలేదని ఫీలవుతున్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల చాలా రిలాక్సింగ్ గా ఉంటుందట.

మలబద్దకం

మలబద్దకం

కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఎదురవుతుంది. కెఫీన్ శరీరానికి ఎక్కువగా అందితే.. కొలాన్ యాక్టివిటీపై ప్రభావం చూపుతుంది.

English summary

Unknown Facts About Caffeine

Unknown Facts About Caffeine. Though we all drink a cup of coffee soon after waking up, we seem to know very less about it. Yes, caffeine has both some positive and some negative effects to it.
Story first published: Tuesday, February 16, 2016, 9:55 [IST]
Desktop Bottom Promotion