For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబిస్కస్ టీ లో మనకు తెలియని ఔషధ గుణాలు...

By Super
|

హైబిస్కస్ (మందార) టీ ప్రస్తుతం లభ్యమవుతున్న హెర్బల్ పానీయాల్లో శ్రేష్ఠమైనది.. మందారపూల రెక్కలనుండి ఈ టీ ని తయారు చేస్తారు.విటమిన్ సీ, మినరల్స్ మరియూ అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు కలిగినిన ఈ టీ ని చల్లగా లేదా వేడి పానీయం గా సేవించవచ్చు.మందార పువ్వు ముదురు ఎరుపు రంగులో ఉండి పుల్లని రుచి కలిగి ఉంటుంది.అందుకే దీనిని పుల్లని టీ అని కూడా అంటారు. మందార పూలతో చేసిన టీ లో కెఫీన్ అస్సలు ఉండదు పైగా క్యాలరీలూ తక్కువే.

హైబిస్కస్ టీ లో మనకి తెలీని ఎన్నో ఔషధ గుణాలున్నాయి.పూర్వ కాలం లో దీనిని అనేక రోగాల నివారణకి వాడేవారు. మాలిక్,టార్టారిక్, సిట్రిక్ యాసిడ్ లాంటి ఆర్గానిక్ యాసిడ్లు ఈ టీలో ఉంటాయి.సాధారణం గా ఈ యాసిడ్లు వైను మరియూ ద్రాక్ష పండ్లలో ఉంటాయి.

మందారం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం...

ఈ ఆర్గానిక్ యాసిడ్లు రోగ నిరోధక శక్తిని పెంచి, చర్మ తత్వాన్ని మెరుగుపరుస్తాయి.ఇంకా రక్తపోటు,కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచి జీర్ణ సంబంధిత సమస్యలని దూరం చేస్తుంది.మందారలోని డై యూరేటిక్(మూత్రాన్ని అధికం గా విసర్జింపచేసే గుణం) వల్ల రక్తం యొక్క గాఢత ని అదుపులో ఉంచి రక్తం పలుచబడేటట్లు చేయడం ద్వారా రక్త పోటు ని తగ్గిస్తుంది.

మందార ఆకులతో పొందే వైద్య ప్రయోజనాలు

ఈరోజు ఆర్టికిల్లో హైబిస్కస్ టీ ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలని వివరించాము. అవేమిటో చదవండి.

కొలెస్ట్రాల్ ని తగ్గించడం:

కొలెస్ట్రాల్ ని తగ్గించడం:

హైబిస్కస్ టీ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణం శరీరం లో నుండి చెడు కొలెస్ట్రాల్ ని బయటకి పంపడంలో సహాయపడుతుంది.ఇంకా గుండె ని గుండె జబ్బుల నుండి కాపాడి రక్త నాళాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది.హైబిస్కస్ టీ ని రోజులో ఎక్కువ సార్లు సేవించడం వల్ల రక్తం లో చక్కెర స్థాయిలని సమాన స్థాయిలో ఉంటాయని ఇటీవల జరిగిన అధ్యనం లో కనుగొన్నారు.

కాలేయ రక్షణ:

కాలేయ రక్షణ:

హైబిస్కస్ టీ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణం కాలేయాన్ని కాపాడుతుందని పరిశోధన ద్వారా నిరూపించబడింది.యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని స్థిరపరచి శరీరం లోని వివిధ అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

క్యాన్సర్ నిరోధకం:

క్యాన్సర్ నిరోధకం:

తరచూ హైబిస్కస్ టీ ని సేవించడం వల్ల క్యాన్సర్ కణాల విభజన నెమ్మదిస్తుందని ఒక అధ్యయనం ద్వారా నిరూపించబడింది.

రక్తపోటు అదుపులో ఉంచడం:

రక్తపోటు అదుపులో ఉంచడం:

హైబిస్కస్ లో గల యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణం రకపోటు ని తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నవారికి ఈ టీ చాల మంచిది.

యాంటీ డిప్రెసెంట్:

యాంటీ డిప్రెసెంట్:

హైబిస్కస్ టీ లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ డిప్రెషన్ ని తగ్గిస్తాయి.హైబిస్కస్ టీ ని సేవించడం వల్ల నాడీ వ్యవస్థ ఉపశమనం పొందుతుంది.డిప్రెషన్ వల్ల కలిగే ఆందోళన ని కూడా హైబిస్కస్ టీ తగ్గిస్తుంది.

బహిష్టు నెప్పులు:

బహిష్టు నెప్పులు:

మందార ఆకుల వల్ల కూడా స్త్రీలకి బహిష్టు సమయం లో కలిగే నెప్పులు,తిమ్మిరుల వంటి సమస్యలనుండి ఉపశమనం లబిస్తుందిహైబిస్కస్ టీ హార్మోన్ల సమతుల్యతని ని స్థిరపరుస్తుంది. చిరాకుగా ఉండటం,డిప్రెషన్, అతిగా తినడం లాంటి సమస్యల నుండి హైబిస్కస్ టీ ఉపశమనం కలుగచేస్తుంది.

జీర్ణ క్రియ:

జీర్ణ క్రియ:

హైబిస్కస్ టీ జీర్ణ క్రియ లో తోడ్పడుతుంది.దీనిలోని డై యూరేటిక్ గుణం మలబద్ధక నివారణ లో సహాయపడటమే కాదు, కొలోన్(పెద్ద ప్రేగు) క్యాన్సర్ ముప్పు ని తగ్గించి జీర్ణాశయాంతర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

English summary

Unknown Health Benefits Of Hibiscus Tea

Unknown Health Benefits Of Hibiscus Tea , Hibiscus tea is one of the best healthy herbal beverages available today. It is prepared from the petals of a hibiscus flower. It can be consumed either hot or cold. It is a rich source of vitamin C, minerals and various antioxidants. Hibiscus flower is ruby red in co
Story first published: Thursday, January 14, 2016, 14:07 [IST]
Desktop Bottom Promotion