For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరగడుపున ఉగాది పచ్చడి తింటే పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

పరగడుపున ఉగాది పచ్చడి తింటే పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

కొత్తదనాలకు స్వాగతం చెబుతూ ఆరోగ్య పరిరక్షణకు శ్రీకారం చుడుతూ జరుపుకొనే పండుగ ఉగాది. యుగాది అనే సంస్కృత పదమే ఉగాది అయిందంటారు. చైత్ర శుక్లపాడ్యమినాడు ఈ పండుగను జరుపుకోవటం ఏనాటి నుంచో ఆచారంగా వస్తోంది.'ఉగాది పచ్చడి' ఉగాది పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం.. ప్రసాదం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని షడ్రుచులున్న ఉగాది పచ్చడి ఇస్తుంది.

ఉగాది పచ్చడిని శాస్త్రాలలో 'నింబ కుసుమ భక్షణం', 'అశోకకళికా ప్రాశనం' అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ తెల్లవారుతో ఖాలీ కడుపుతో సేవించవలెను. ఉగాదినాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రభోదాత్మకం కూడా..'తీపి వెనుక చేదు, పులుపు, వగరు ఇలా పలురుచులకు జీవితాన్ని కష్టలు, తదితర అనుభూతులు, ప్రతీకలే. అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలకు సమభావంతో స్వీకరించు' అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుంది ఈ ఉగాది పచ్చడి. మరి ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలేంటి, ఈ పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయన్న విషయం తెలుసుకుందాం...

వేప

వేప

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వేపపువ్వు బుధుడుకు సంబంధించనది. ఇందులో వ్యాధినిరోధక లక్షనాలున్నాయి. బుతుమార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ(తట్టు) అమ్మవారు, స్పోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధిస్తుంది. ఒక రంగా ఇది మన శరీరానికి యాంటీ వైరస్ పొటక్టర్ గా పనిచేస్తుంది. గుమ్మానికి వేపాకలు కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్చమైన గాలిని పీల్చవచ్చు. వేపపువ్వును పచ్చడిలో వేయడం వల్ల రక్తాన్ని శుద్ది చేసి వాతపిత్తకఫాన్ని నిర్మూలించే సమవూపక్రుతి ఏర్పడుతుంది. ఈ శక్తినిచ్చే వాడు బుదుదడు అంటారు.

 బెల్లం:

బెల్లం:

ఇది గురుగ్రహం'కు చెందిన వస్తువు. దీనిలోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడుతారు. ‘గురుడు' పూర్తిగా శుభక్షిగ్రహం కావడం వల్ల కలిసిమెలిసి ఉండే గుణాల్ని మన మనసులో పెంపొందిస్తాడు.

మామిడి ముక్కలు:

మామిడి ముక్కలు:

మామిడిముక్కల్లో తీపి, పులుపుతో పాటు వగరు గుణముంటుంది. ఈ గుణం ‘శుక్షికుని'కి ప్రతీక. శుక్రుడు సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యవంతంగా ముడుతలు పడకుండా నునుపుగా ఉండటానికి మామిడిలోని లక్షణాలు ఉపకరిస్తాయి. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగులటం వంటి లక్షణాలను మామిడిలోని వగరు నివారిస్తుంది. మామిడి ముక్కల్లో విటమిన్ ‘సి' పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కలిగే వ్యాధినిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

చింతపండు:

చింతపండు:

పులుపు ‘శుక్షికుని' సంకేతం కనుకు మామిడి ముక్కలతో కలిపి చింతపులుపు మరింత ఆలోచనా శక్తిని పెంచి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఫలితంగా టెన్షన్, హడావుడి లేని జీవితాన్ని గడుపగలం. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకో విశేషం చింతలో ఉన్న సుగుణం ఏమిటంటే చింతను దూరం చేయడమే . మానసిక అనారోగ్యమున్న వారికి చింతలు పెరగకుండా , మానసిక చాంచల్యాన్ని కలుగకుండా ఉండేందుకు కూడా ప్రతి రోజూ కొద్ది ప్రమాణంలో చింతపండు వాడాలని పెద్దలు సూచిస్తున్నారు.

మిరియాలు:

మిరియాలు:

ఇవి కారపు గుణం కలిగినవి. ఇవి హయక్షిగ్రీవునికి ప్రీతికరమైనవి. ఆలోచనా శక్తిని పెంచుతాయి.

నెయ్యి:

నెయ్యి:

నెయ్యికి అధిపతి చుంద్రుడని అంటారు. ఇది మనస్సును ఉత్తేజపరుస్తుంది, జ్ఝాపకశక్తినీ పెంచుతుంది.

అరటి:

అరటి:

కొన్ని ప్రాంతాల్లో అరటిపండు ముక్కలు కూడా ఉగాది పచ్చిడిలో కలుపుతారు. అరటిపండు చంద్రప్రధానమైన గుణం కలది. అంతే కాక, ఇది శరీరానికి అవసరమైన సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తుంది.

 చెరకు:

చెరకు:

ఉగాది పచ్చిడిలో వేసుకునే చెరకు ముక్కలు కుజునికి సంబంధించినవిగా చెబుతారు. రక్తశుద్దికి ఉత్తేజానికి చెరకులోని పీచుపదార్థం ఉపకరిస్తుంది.

 ఉప్పు, కొబ్బరి ముక్కలు:

ఉప్పు, కొబ్బరి ముక్కలు:

ఇవి రెండూ రవి, చంద్రుల లక్షణాలను కలిగి ఉంటాయి. రవి ఆరోగ్యానికి , చంద్రుడు మన:శ్వాంతికి కారణం కావడం వల్ల మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి, శారీరక రుగ్మతలను తొలగించడానికి ఇవి రెండూ ఎంతగానో సహాకరిస్తాయి.

ఉగాది పచ్చడిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు...

ఉగాది పచ్చడిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు...

ఇలా ఉగాది పచ్చడనే కాదు, మన సంప్రదాయంలోని పండుగలు పర్వదినాల్లో చేసుకునే వంటలన్నీ గ్రహగమనాలపై ఆధారపడి రూపొందించినవే మన పెద్దలు.

English summary

Unknown Health Secrets of Ugadi Pachadi

Unknown Health Secrets of Ugadi Pachadi
Desktop Bottom Promotion