For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: మీరు సరిగా నీళ్లు తాగడం లేదని తెలిపే డేంజరస్ సంకేతాలు..!

By Swathi
|

రోజూ నీళ్లు తాగుతున్నారా ? అంటే బాగా తాగుతున్నాను అన్న సమాధానమే చాలా మంది చెబుతారు. కానీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక బాటిల్ లేదా ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఒకరు, ఇద్దరి సమస్య కాదు. చాలా మంది నీళ్లు తాగాలంటే చాలా బద్దకంగా ఫీలవుతారు. అలాగే నీళ్లు తాగడం అంటే.. ఏదో మెడిసిన్ తాగినట్టు ఫీలవుతుంటారు.

enough water

కానీ.. నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని ప్రతి భాగం, ప్రతి చిన్న అవయవం, టిష్యూ, కణం అన్నీ కూడా నీటిపై ఆధారపడి ఉంటాయి.

అందుకే రోజుకి సరిపడా నీళ్లు తాగాలి. నీళ్లు శరీరానికి చాలా కీలకమైనవి, హెల్తీ కూడా. మీకు తెలుసా.. డీహైడ్రేషన్ ని సూచించే.. కొన్ని లక్షణాలు ? శరీరం డీహైడ్రేట్ అయితే.. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరి మీరు నీళ్లు సరిగా తాగడం లేదని తెలిపే సంకేతాలంటే.. తెలుసుకుందాం..

దుర్వాసన

దుర్వాసన

నోటి దుర్వాసన మీ నోటి శుభ్రతపై ఆధారపడి ఉండదు. ఇది.. డీహైడ్రేషన్ కి సంకేతం. తక్కువ నీళ్లు తాగడం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది.

డ్రైస్కిన్

డ్రైస్కిన్

డీహైడ్రేషన్ కి మరో సంకేతం.. చర్మం పొడిబారడం. స్కిన్ టిష్యూలో ఏర్పడే సమస్య ఇది. అయితే.. మీ శరీరం సరైనమోతాదులో నీళ్లు పొందలేకపోతే.. మీ చర్మం డ్రైగా మారుతుంది.

కండరాల నొప్పులు

కండరాల నొప్పులు

శరీరం సరైన మోతాదులో నీళ్లు పొందలేకపోతే.. కండరాలు, టిష్యూలు డీహైడ్రేట్ అవుతాయి. దీనివల్ల.. కండరాలు పట్టేస్తుంటాయి.

జ్వరం

జ్వరం

డీహైడ్రేషన్ వల్ల జ్వరం కూడా వస్తుందనేది ఆశ్చర్యంగానే ఉన్నా.. వాస్తవమే. ఇమ్యునిటీ, కణాలు బలహీనం అవుతాయి. శరీరం సరైన మోతాదులో నీళ్లు పొందలేకపోతే.. వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది.

ఎక్కువగా తినడం

ఎక్కువగా తినడం

ఆహారం ఎక్కువగా తింటున్నారు అంటే.. పదే పదే తినాలి అనిపించడం, ముఖ్యంగా ఎక్కువగా స్వీట్స్ తింటున్నారు అంటే.. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇది.. డీహైడ్రేషన్ కి సంకేతం.

తలనొప్పి

తలనొప్పి

సరైన మోతాదులో నీళ్లు తాగలేకపోతే.. గుండెకు సరిగా రక్తం అందక మెదడు వ్యాధులు వస్తాయి. తలనొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తుంది.

ఏకాగ్రత కోల్పోవడం

ఏకాగ్రత కోల్పోవడం

మీరు తరచుగా ఏకాగ్రత కోల్పోతున్నారు అంటే.. మీ బ్రెయిన్ సరిగా ఆక్సిజన్ పొందలేకపోతోందని సంకేతం. అంటే.. ఈ సమస్య డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. కాబట్టి.. రోజంతా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి.

నోరు ఆరిపోవడం

నోరు ఆరిపోవడం

శరీరానికి సరైన మోతాదులో నీళ్లు అందకపోతే.. లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది. అలాగే నోరు ఎక్కువగా తడారిపోతూ ఉంటుంది. గొంతులో కూడా పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్ నివారించడానికి తగిన స్థాయిలో నీళ్లు తాగాలని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. జీర్ణవ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా అందడం వల్ల ఈ సమస్య కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

యూరిన్ కలర్

యూరిన్ కలర్

మీ శరీరం డీహైడ్రేట్ అయిందని తెలిపే ముఖ్య లక్షణం మీ యూరిన్ కలర్. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా.. మీరు సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని గుర్తించాలి. రోజుకి 4 నుంచి 7 సార్లు యూరిన్ కివెళ్లాలి. అలాగే మీ యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో ఉంది అంటే కూడా మీరు నీళ్లు తాగడం లేదని గుర్తించాలి.

English summary

Unusual Signs That Say You Are Not Drinking Enough Water

Unusual Signs That Say You Are Not Drinking Enough Water. తDid you know about certain unusual signs of dehydration?
Story first published: Saturday, October 8, 2016, 13:19 [IST]
Desktop Bottom Promotion