For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్లు, భుజాలను బలంగా మార్చడానికి సహాయపడే వశిష్టాసనం..!

By Swathi
|

కాళ్లు, భూజాలను స్ట్రాంగ్ గా మార్చే ఆలసం అంటే.. కాస్త కొత్తగా అనిపించవచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే.. మన శరీరం మొత్తం ఈ రెండు బాడీ పార్ట్స్ పై ఆధారపడి ఉందని గమనించవచ్చు. ఏ పనిచేయాలన్నా.. ఈ రెండింటి సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి.. ఇవి స్ట్రాంగ్ గా ఉంటేనే.. మనం హెల్తీగా ఉండగలుగుతాం.

హెల్తీగా ఉండాలంటే బలమైన భుజాలు, కాళ్లు ఉండటం చాలా ముఖ్యం. అలాగే ఇది మానసికంగా ప్రభావం చూపుతుంది. ఏమాత్రం చిన్న నొప్పి కలిగినా.. చాలా చిరాగ్గా, అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చూపించబోయే యోగాసనం.. వల్ల మంచి ఫలితం పొందవచ్చు. వశిష్టాసనం లేదా సైడ్ ప్లాంక్ ఫోజు.. ఇది భుజాలు, కాళ్లను బలంగా చేయడంలో సహాయపడుతుంది.

జిమ్ కన్నా యోగ ఉత్తమమైనదని చెప్పటానికి 15 కారణాలు

వశిష్ట అనే సంస్కృత పదం నుంచి వశిష్టాసనం వచ్చింది. వశిష్ట అంటే.. అద్భుతమైన, మంచి, సంపన్నమైన అని అర్థం. ఈ ఆసనం శరీరంలో అత్యంత ముఖ్యమైన రెండు భాగాలను బలంగా మార్చడానికి, శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ వశిష్టాసనం ఎలా వేయాలో.. స్టెప్ బై స్పెప్ తెలుసుకుందాం..

ఈ వశిష్టాసనం వేసే.. పద్ధతి
స్టెప్ 1 - సాధారణంగా పడుకోవాలి. తర్వాత ఎడమవైపు తిరగాలి. అలా తిరుగుతున్న సమయంలో.. కుడి పాదాన్ని.. ఎడమ పాదంపైన పెట్టాలి.

vasisthasana

స్టెప్ 2 - కుడి చేతిని కుడి పిరుదులపై పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ వెయిట్ మొత్తాన్ని ఎడమ పాదం, కుడి చేతిపై మోపుతూ.. శరీరాన్ని పైకి లేపాలి.

స్టెప్ 3 - చేతి పొజిషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది కరెక్ట్ గా భుజాలకు సమానంగా ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా భుజానికి ముందువైపు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు భుజాన్ని టైట్ గా మారుస్తూ.. చేతిని భుజాల కండరాల సహాయంతో ఫ్లోర్ పై ఒత్తిడి చేయాలి.

స్టెప్ - 4 శరీరాన్ని ఎంత వీలైతే.. అంత స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల.. తొడలు బలంగా మారతతాయి. అలాగే హీల్స్ ని ఫ్లోర్ పై ప్రెస్ చేయాలి. శరీరం మొత్తం ఒక లైన్ మాదిరి ఏర్పడేలా వంపాలి. పాదాలు, శరీరం ఎదురెదురుగా ఉండేలా.. శరీరాన్ని బెండ్ చేయాలి.

స్టెప్ 5 - ఇప్పుడు చేతిని పైకి అంటే ఆకాశం వైపు ఎత్తాలి.

vasisthasana

స్టెప్ 6 - ఇదే పొజిషన్ లో మొదట్లో కనీసం 30 సెకన్లు ఉండాలి. తర్వాత తర్వాత పెంచుతూ పోవాలి. సాధారణ స్థితికి రావడానికి పైకి ఎత్తిన చేతిని కిందకు తేవాలి. మెల్లిమెల్లిగా.. సైడ్ ఫోజులోకి రావాలి.

స్టెప్ 7 - ఇలాగే.. రెండో సైడ్ కూడా పైన చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ప్రయత్నించాలి.

మొదట్లో ఈ ఆసనం వేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మొదట.. మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, గోడకు ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. పైన చెప్పిన స్టెప్స్ ని జాగ్రత్తగా పాటించాలి.

యోగ ముద్రలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు

వశిష్టాసనంతో పొందే ప్రయోజనాలు
కాళ్లు, భుజాలు స్ట్రాంగ్ గా మారడానికి సహాయపడుతుంది.
బెల్లీ, మణికట్టు స్ట్రాంగ్ గా మారతాయి.
శరీరం మొత్తాన్ని ఎలా కావాలంటే.. అలా వంపుకోవచ్చు.
అండర్ ఆర్మ్ కూడా.. టైట్ గా మారతాయి.
బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది.

హెచ్చరిక
ఎవరికైనా మణికట్టు, భుజాలకు గాయాలుకానీ, గతంలో దెబ్బలు తగిలిన సందర్భాలు ఉండేవాళ్లు, వెన్నెముక సమస్యలు ఉన్నవాళ్లు కూడా.. ఈ ఆసనం ప్రయత్నించకూడదు. ఏ వ్యాయామం, యోగా చేయాలనుకున్నా.. ముందుగా డాక్టర్ ని లేదా యోగా ఎక్స్ పర్ట్ ని కలిసి.. మీ పొజిషన్ ఎలా ఉంది, ఈ ఆసనాలు చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పిన తర్వాత ప్రయత్నించాలి.

ఆరోగ్యంగా ఉండటానికి యోగా ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఈ ఆసనం చేయడం వల్ల సౌకర్యవంతంగా ఫీలవకపోతే.. చేయకపోవడమే మంచిది. కేవలం ధ్యానం వంటి రిలాక్సేషన్ ప్రక్రియలు చేసినా.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Vasisthasana (Side Plank Pose) To Strengthen Arms & Legs

Vasisthasana (Side Plank Pose) To Strengthen Arms & Legs. Though it sounds quite lethargic to strengthen your arms and legs; however, technically, if you look into it, your entire body depends on these two important body parts.
Story first published:Friday, July 1, 2016, 12:51 [IST]
Desktop Bottom Promotion