For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబ్లడ్ ప్రెజర్ కు ముఖ్య కారణాలు ఏంటి..?

|

హైబిపి లేదా హైపర్ టెన్షన్ అనేవి చాలా సీరియస్ డిజార్డర్ . ఈ సమస్య ఉన్నవారి రెగ్యులర్ గా మెడికల్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బ్లడ్ ప్రెజర్ అంటే ఏంటి? శరీరంలో ఇక ఇంజన్ లో మన శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసే యంత్రం మన హార్ట్. గుండె పంపింగ్ సిస్టమ్ లా పనిచేస్తుంది. ఇలా పంప్ చేస్తున్నప్పుడు మన శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సరఫరా అవుతుంది . మన ప్రాణంతో ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ప్రతి ఒక్క బాగానికి రక్త సరఫరా చాలా అవసరం అవుతుంది.

బ్లడ్ ను హార్ట్ ఎప్పుడైతే పంప్ చేస్తుందో అప్పుడు రక్తనాళాల మీద పడే ప్రెజర్ ను బ్లడ్ ప్రెజర్ ని అంటారు. ఈ బ్లడ్ ప్రెజర్ సాధారణంగా 120/80 ఉన్నట్లైతే నార్మల్ కండీషన్ అని సూచిస్తారు . దీన్ని బట్టే శరీరంలో ఆరోగ్య సమస్యలను అంచానా వేస్తుంటారు.

పెద్దవారిలో మరియు ఫిజికల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండే వారిలో బ్లడ్ ప్రెజర్ నెంబర్స్ లో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది . కానీ మీ డాక్టర్ మీకు హైబ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు చెబితే కనుక మీరు కొన్ని రకాల టెస్ట్ లను చేయించుకొని, నార్మల్ స్థితికి తీసుకురావడం చాలా అవసరం.

హైబ్లడ్ ప్రెజర్ ఉన్నవారు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మరియు హైబ్లడ్ ప్రెజర్ కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా , మంచి ఆహారపు అలవాట్ల ద్వారా మరియు మంచి విశ్రాంతి, నిద్ర ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు . మరి బ్లడ్ ప్రెజర్ మరికొన్ని కారణాలను తెలుసుకుందాం...

 టుబాకో ప్రొడక్ట్స్:

టుబాకో ప్రొడక్ట్స్:

టుబాకాతో తయారుచేసిన అన్ని రకాల ప్రొడక్ట్స్ హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ కు దారితీస్తుంది. కాబట్టి, టుబాకో ప్రొడక్ట్స్ కు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండటం మంచిది.

కాఫీ :

కాఫీ :

ఆల్కహాల్ టుబాకో మరియు కాఫీకి అడిక్ట్ అవ్వడం కూడా ప్రమాధకరమే. ఇవి ఒత్తిడికి కారణం అవుతాయి . మరియు మెటబాలిజంకు అంతరాయం కలిగిస్తాయి . కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ కు దారితీస్తుంది.

. స్ట్రెస్:

. స్ట్రెస్:

ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ బ్లడ్ ప్రెజర్ తో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది . ఒత్తిడి అత్యంత ప్రమాధకరమైనది . ఇది హైబ్లడ్ ప్రెజర్ కు దారితీస్తుంది.

సాల్ట్:

సాల్ట్:

చాలా వరకూ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ మరియు ఇతర ఆహారాల్లో సాల్ట్ కలిగి ఉంటాయి . ఉప్పు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి వస్తుంది. కాబట్టి, ఉప్పును తగ్గించడం ఉత్తమం.

 ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి మంచి మరియు చెడు రెండు ఉన్నాయి. అతి తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల రెండు నుండి నాలుగుmm Hgద్వారా రక్త పోటును తగ్గింస్తుంది. ఆల్కహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే హనీ ఎక్కువ కలుగ జేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండటమే మంచిది.

ఇన్ యాక్టివిటి:

ఇన్ యాక్టివిటి:

మనిషిలో చురుకుదనం లేదా కదలికలు లేకపోవడం వల్ల ఇది రక్తనాళాల మీద ప్రభావం చూపుతుంది మరియు ఎలాసిటిని కోల్పోవడం జరుగుతుంది బ్లడ్ ప్రెజ్ కూడా పెరుగుతుంది అందువల్ల రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మంచిది. రెగ్యులర్ వ్యాయామాల వల్ల బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఆహారం:

ఆహారం:

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం: ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మరియు సంతృప్త కొవ్వు వంటివి తీసుకోవడం వల్ల 14యంయం హెజిని తగ్గిస్తుంది. డైయట్ ప్లాన్ మార్చడం అంత సులభం కాదు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల హెల్తీ డైయట్ ను పాటించవచ్చు.

Story first published: Monday, April 18, 2016, 18:21 [IST]
Desktop Bottom Promotion