For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ పైనాపిల్ వాటర్ తాగడం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!

పైనాపిల్ లో విటమిన్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రొమెలైన్ అనే ఎంజైమ్స్ , విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

By Swathi
|

పండ్లు తినడం వల్ల పొందే అనేక ప్రయోజనాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, అరటిపండు వీటిపై చాలా అవగాహన ఉంటుంది. కానీ.. పైనాపిల్ ప్రయోజనాలు చాలామందికి తెలియదు. ఈ పైనాపిల్ ఎన్నో హెల్త్ సీక్రెట్స్ కలిగి ఉంటుంది.

pineapple water

పైనాపిల్ లో విటమిన్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రొమెలైన్ అనే ఎంజైమ్స్ , విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే.. పైనాపిల్ ని పండుగా తీసుకుంటే పొందే ప్రయోజనాలు చూశాం. కానీ.. పైనాపిల్ వాటర్ తో కూడా.. అద్భుత ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి.

పైనాపిల్ వాటర్ ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలికే. ముందుగా పైనాపిల్ తొక్క తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గ్లాసు చల్లటినీటిలో కలపాలి. అంతే. ఈ పైనాపిల్ వాటర్ హెల్తీనే కాదు.. టేస్టీగా కూడా ఉంటాయి. కానీ.. ఈ పైనాపిల్ వాటర్ ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల.. మరింత ఎక్కువ పోషకాలు పొందవచ్చు.

ఇన్ల్ఫమేషన్

ఇన్ల్ఫమేషన్

పైనాపిల్ వాటర్ లో స్ట్రాంగ్ యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఇవి శరీరంలో ఇన్ల్ఫమేషన్ కి కారణమయ్యే మలినాలను బయటకు పంపుతుంది. రెగ్యులర్ గా ఈ వాటర్ తీసుకోవడం వల్ల.. ఆర్థరైటిస్ తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వెయిట్ లాస్

వెయిట్ లాస్

పైనాపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఫుల్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి పైనాపిల్ వాటర్ తాగడం వల్ల.. షుగర్, ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోకుండా అడ్డుకుంటుంది. అలాగే.. కార్బోహైడ్రేట్స్ ని ఎనర్జీగా మార్చి, మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.

పారాసైట్స్

పారాసైట్స్

పైనాపిల్ వాటర్ లో ఉండే యాంటీ పారాసిటిక్ గుణాలు.. కాలేయం, పేగులలో పేరుకున్న నులిపురుగులను.. బయటకు పంపుతాయని.. అధ్యయనాలు చెబుతున్నాయి. అది కూడా.. చాలా వేగంగా.. ఈ నులిపురుగులను చంపేస్తాయట.

ధైరాయిడ్ ఫంక్షన్

ధైరాయిడ్ ఫంక్షన్

పైనాపిల్ లో ఐయోడిన్, బ్రోమెలైన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ని ట్రీట్ చేస్తాయి. థైరాయిడ్ కి సంబంధించిన లక్షణాలు, వ్యాధులను దూరంగా ఉంచుతాయి.

ఎలక్ట్రోసైట్స్

ఎలక్ట్రోసైట్స్

పైనాపిల్స్ లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. శరీరం స్ట్రాంగ్ గా మారుతుంది. ఎలక్ట్రోసైట్ ని బ్యాలెన్స్ చేస్తాయి. క్రాంప్స్, ఇంజ్యూరిస్ ని నివారిస్తాయి.

టాక్సిన్స్

టాక్సిన్స్

పైనాపిల్ వాటర్ లో ఫైబర్, ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. శరీరాన్ని శుభ్రం చేస్తాయి. శరీరంలో పేరుకున్న హానికారక మలినాలను బయటకుపంపుతుంది.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

పైనాపిల్ వాటర్ లో ఉండే బ్రొమెలైన్ .. జీర్ణక్రియను చాలా ఎఫెక్టివ్ గా మెరుగుపరుస్తుంది. కాబట్టి.. ఉదయాన్నే పరగడుపున ఈ వాటర్ తాగాలి.

పంటి ఆరోగ్యానికి

పంటి ఆరోగ్యానికి

పైనాపిల్ లో ఉండే బ్రొమెలైన్ అనేది.. న్యాచురల్ స్టెయిన్ రిమూవర్ గా పనిచేస్తుంది. ఇది.. పంటిపై పేరుకున్న పాచిని ఎఫెక్టివ్ గా తొలగించి.. పళ్లు తెల్లగా ఉండటానికి సహాయపడుతుంది.

కంటిచూపు

కంటిచూపు

బీటా కెరోటిన్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలామంచిది. ప్రతిరోజూ పైనాపిల్ వాటర్ తాగడం వల్ల.. వయసురీత్యా వచ్చే.. కంటిచూపు సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

క్యాన్సర్

క్యాన్సర్

పైనాపిల్ లో ఉండే బ్రొమెలైన్ అనేది కీమో డ్రగ్. ఇది క్యాన్సర్ ని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ పైనాపిల్ వాటర్ తీసుకుంటూ ఉండే.. క్యాన్సర్ ని అరికట్టవచ్చు.

English summary

What Happen To Your Body When You Drink Pineapple Water

What Happen To Your Body When You Drink Pineapple Water. How To Make Pineapple Water And What Are The Benefits Of Drinking It On Empty Stomach?
Story first published: Monday, October 17, 2016, 13:09 [IST]
Desktop Bottom Promotion