For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీలో మిరియాల పొడి మిక్స్ చేసి తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...

టీలో మిరియాల పొడి మిక్స్ చేసి తాగితే అద్భుత ప్రయోజనాలు..

|

మన ఇండియన్ కుషన్స్ లో మసాలాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ఇండియన్ కుషన్స్ కు మంచి ఫ్లేవర్ ను టేస్ట్ ను అందివ్వడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఇన్ డైరెక్ట్ గా సహాయపడుతాయి. అటువంటి మసాలా దినుసుల్లో ఒకటి బ్లాక్ పెప్పర్ (మిరియాలు). ఇది ప్రతి ఒక్క ఇల్లాలికి సుపరిచితమైన మసాలా దినుసు. సహజంగా దీన్ని స్పైసీ గా ఉపయోగిస్తారు కానీ దీన్ని టీలో చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

బ్లాక్ పెప్పర్ ను మనం రెగ్యులర్ గా తాగే టీలో చేర్చుకోవడం వల్ల బాడీలో ఏం జరుగుతుంది? బ్లాక్ పెప్పర్ అందరికి తెలిసిన మసాలా దినుసు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసిన టీని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

అందుకే దీన్ని పురాతన కాలం నుండి అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవడానికి రెగ్యులర్ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. అంతే కాదు, వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే విపరీతమైన జలుబు, దగ్గు ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నల్ల మిరియాల్లో ఉండే పెప్పరైన్ అనే కంటెంట్లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి నొప్పులను మరియు ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

బెస్ట్ రిజల్ట్ కోసం బ్లాక్ పెప్పర్ ను బ్లాక్ టీలో మిక్స్ చేసి వేడి వేడిగా తాగడం వల్ల త్వరిత ఉపశమనం ఉంటుంది. బ్లాక్ పెప్పర్ పౌడర్ ను బ్లాక్ టీలో మిక్స్ చేసి తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

 దగ్గు మరియు జలుబును తగ్గిస్తుంది:

దగ్గు మరియు జలుబును తగ్గిస్తుంది:

బ్లాక్ పెప్పర్ పౌడర్ లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వల్ల ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ. ఇది జలుబు దగ్గును నివారిస్తుంది. బ్లాక్ టీలో బ్లాక్ పెప్పర్ జోడించడం వల్ల గొంతుకు వేడిగా, స్పైసీగా అనిపిస్తుంది. దాంతో కఫంను వదులు చేస్తుంది, ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది. కఫం గొంతు మరియు చెస్ట్ ప్రదేశంలో చేరడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి , కఫం వదిలించుకోవడానికి దగ్గు జలుబు నివారించుకోవడానికి బ్లాక్ పెప్పర్ పౌడర్ ను బ్లాక్ టీలో కలిపి తీసుకోవడం మంచిది.

గొంతు నొప్పి:

గొంతు నొప్పి:

గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ ను టీలో మిక్స్ చేసి వేడి వేడిగా తాగాలి. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది, . ఈ టీని రోజుకు రెండు మూడు సార్లు తాగితే గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. జలుబు, గొంతు నొప్పి తగ్గించుకోవడంలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నా ఒక బెస్ట్ హోం రెమెడీ

 సైనస్ ప్రెజర్ తగ్గిస్తుంది:

సైనస్ ప్రెజర్ తగ్గిస్తుంది:

సైనస్ సమస్య ఉన్నారు, ముక్కులు మూసుకుపోయి, శ్వాసలో ఇబ్బందులు ఎదుర్కుంటుంటే, ఒక వేడి వేడి బ్లాక్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి బ్లాక్ టీని తాగాలి. ఇది ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. సైనస్ నివారించబడుతుంది. స్టఫీ నోస్ ను క్లియర్ చేస్తుంది.

యాంటీ డిప్రజెంట్ :

యాంటీ డిప్రజెంట్ :

బ్లాక్ పెప్పర్ లో ఉండే పెప్పరైన్ బ్రెయిన్ కు సంబంధించిన జ్ఝాపశక్తిని పెంచడానికి, మతిమరుపు నివారించడానికి, విషయాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఇది ఆశ్చర్యకరం అనిపించినా ఈ మసాల దినుసులు అంతటి సామర్థ్యం ఉన్నది. బ్లాక్ టీలో బ్లాక్ పెప్పర్ పౌడర్ ను మిక్స్ చేసి వేడి వేడిగా తాగడం వల్ల బెస్ట్ యాంటీ డిప్రెజెంట్ గా పనిచేస్తుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

బ్లాక్ పెప్పర్ మీద జరిపిన వివిధ రకాల పరిశోధనల్లో బ్లాక్ పెప్పర్ కు క్యాన్సర్ నివారించే శక్తిసామర్థ్యాలున్నట్లు నిపుణులు గుర్తించారు. బ్లాక్ పెప్పర్ లో ఉండే పెప్పరైన్ శరీరంలో క్యాన్సర్ కు కారణమయ్యే హానికరమైన రాడికల్స్ ను క్రమబద్దం చేసిన క్యాన్సర్ కు కారణమయ్యే కొన్ని ఎలిమెంట్స్ ను నివారిస్తుంది.

English summary

What Happens When You Add Black Pepper Powder In Your Tea?

The moment you hear of pepper the first thing that comes to your mind is that it is a spice that adds flavour to your cuisines. It isn't just this, black pepper is one of the best known kitchen ingredients, which acts as a spice but when added to tea, it also has innumerable health benefits too.
Desktop Bottom Promotion