For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ‌రీరానికి అవ‌స‌ర‌మైన‌ నీళ్లు తాగ‌క‌పోతే.. శ‌రీరంలో జ‌రిగే భ‌యంక‌ర‌ మార్పులు

By Swathi
|

ఒక‌రోజు ఫుడ్ లేక‌పోయినా ఉండ‌గ‌ల‌రు కానీ.. నీళ్లు లేకుండా.. ఒక రోజు గ‌డ‌ప‌డం కూడా చాలా క‌ష్టం. శ‌రీరానికి నీళ్లు చాలా ముఖ్య‌మైన‌వి. 70 శాతం శ‌రీరం నీటిని క‌లిగి ఉంటుంది కాబ‌ట్టి.. శ‌రీరానికి ఎప్ప‌టిక‌ప్పుడు నీటిని అందించాలి.

బ్ల‌డ్ లో, కండ‌రాలు, ఎముక‌ల్లో నీటి శాతం ఉంటుంది. ఇవ‌న్నీ.. మెట‌బాలిజం రేట్ స‌క్ర‌మంగా ఉండే బాధ్య‌త‌ను తీసుకుంటాయి. రోజుకి క‌నీసం 8 గ్లాసుల నీళ్లు తాగ‌డం చాలా ముఖ్యం. ఇవి శ‌రీరానికి కావాల్సిన మోతాదు నీళ్లు. అలాగే స‌మ్మ‌ర్ లో మ‌రింత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. దీనివ‌ల్ల శ‌రీరం కోల్పోయిన నీటిని పొంద‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

శ‌రీరం ప‌నితీరుతో పాటు.. అనేక ర‌కాల వ్యాధుల‌ను నివారించ‌డంలో కూడా.. ఇది స‌హాయ‌ప‌డుతుంది. ఒక‌వేళ మీరు స‌రైన మోతాదులో నీళ్లు తాగ‌క‌పోతే.. అనేక ప్రాణాంత‌క వ్యాధుల‌బారిన పడాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి.. శ‌రీరానికి కావాల్సిన‌న్ని నీళ్లు తాగ‌క‌పోతే.. శ‌రీరంలో జ‌రిగే.. డేజంర్ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..

డీహైడ్రేష‌న్

డీహైడ్రేష‌న్

శ‌రీరానికి స‌రిప‌డా నీళ్లు అంద‌క‌పోతే.. డీహైడ్రేష‌న్ స‌మ‌స్య ప్ర‌ధానంగా క‌నిపించేది. డీహైడ్రేష‌న్ వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

కాన్ట్సిపేష‌న్

కాన్ట్సిపేష‌న్

శ‌రీరంలో నీళ్లు త‌గ్గిన‌ప్పుడు.. స్టూల్ హార్డ్ గా మారుతుంది. దీని వ‌ల్ల కాన్ట్సిపేష‌న్ స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. తేలిక‌గా బోవెల్ మూవ్ మెంట్ జ‌ర‌గాలంటే.. శ‌రీరానికి కావాల్సిన మోతాదులో ఉంటుంది.

బాడీ టెంప‌రేట‌ర్

బాడీ టెంప‌రేట‌ర్

శ‌రీరం కావాల్సిన నీటిని పొంద‌లేన‌ప్పుడు.. శ‌రీరంలో బాడీ టెంప‌రేచ‌ర్ పెరుగుతుంది. స‌రైన మోతాదులో నీళ్లు తాగితే.. శ‌రీరం కూల్ గా ఉంటుంది.

పొట్ట‌లో అల్స‌ర్

పొట్ట‌లో అల్స‌ర్

శ‌రీరం నీటిని కోల్పోయిన‌ప్పుడు.. పొట్ట‌లో మ‌స్క‌స్ త‌గ్గుతుంది. దీనివ‌ల్ల జీర్ణ‌క్రియ‌కు ఆట‌కం ఏర్ప‌డి.. ఎసిడిటీ కి, పొట్ట అల్స‌ర్ కి కార‌ణ‌మ‌వుతుంది.

జాయింట్ పెయిన్

జాయింట్ పెయిన్

కీళ్ల‌లో 80 శాతం నీళ్లు ఉంటాయి. ఎప్పుడైతే.. స‌రైన మోతాదులో నీళ్లు లేక‌పోతే.. ఇన్ల్ఫ‌మేష‌న్, జాయింట్ పెయిన్ కి కార‌ణ‌మ‌వుతుంది.

లో బ్ల‌డ్ ప్రెజ‌ర్

లో బ్ల‌డ్ ప్రెజ‌ర్

ర‌క్తంలో నీటి శాతం ఉంటుంది. ఎప్పుడైతే శ‌రీరం కావాల్సిన మోతాదులో నీటిని గ్ర‌హించ‌దో.. అప్పుడు బ్ల‌డ్ ప్రెజ‌ర్ ప‌డిపోతుంది.

హార్ట్ రేట్

హార్ట్ రేట్

శ‌రీరం కావాల్సినంత నీటిని పొంద‌లేన‌ప్పుడు.. సాల్ట్ త‌గ్గుతుంది. షుగ‌ర్, మిన‌ర‌ల్ లెవెల్స్ త‌గ్గుతాయి. ఇది.. గుండె చ‌ప్పుడులో అస‌మ‌తుల్య‌త ఏర్ప‌డుతుంది.

జీర్ణ‌సంబంధ స‌మ‌స్య‌లు

జీర్ణ‌సంబంధ స‌మ‌స్య‌లు

ఆహారాన్ని పేగుల ద్వారా జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు అందించ‌డంలో.. నీళ్లు కీల‌క పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే శ‌రీరం నీటిని కోల్పోతుందో.. అప్పుడు జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

అల‌స‌ట‌

అల‌స‌ట‌

శ‌రీరం కావాల్సిన మోతాదులో నీటిని పొంద‌లేక‌పోయిన‌ప్పుడు టిష్యూస్, క‌ణాలు నీటిని పొంద‌లేవు. దీనివ‌ల్ల ఎంజైమ్స్ ఎన‌ర్జీని ఉత్ప‌త్తి చేయ‌డంలో ఫెయిల్ అవుతాయి. దీనివ‌ల్ల అల‌స‌ట‌కు గుర‌వుతారు.

English summary

What Happens When Your Body Lacks Enough Water?

What Happens When Your Body Lacks Enough Water? You might be able to survive without food for a day, but surviving without water for a day would be really tough.
Story first published:Wednesday, July 27, 2016, 10:29 [IST]
Desktop Bottom Promotion