For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తులసి, పాల కాంబినేషన్ లో దాగున్న అమోఘమైన ఔషధ గుణాలు.. !

By Swathi
|

ఏ చిన్న సమస్య వచ్చినా.. మనం హాస్పిటల్స్ కి పరుగులు పెడతాం. జలుబు, దగ్గు నుంచి జ్వరం వరకు ఏ ప్రాబ్లమ్ అయినా.. డాక్టర్ ని సంప్రదిస్తే గానీ.. పూర్తీగా తగ్గదని చాలా మంది భావిస్తారు. కానీ.. హాస్పిటల్ కి వెళ్లే బదులు మన ఇంటి పెరట్లోకో లేదా హెర్బ్స్ ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!! దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!!

వారం రోజుల పాటు మందులు, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వేసుకోవడం కంటే.. సింపుల్ హెర్బల్ రెమిడీస్ ఉపయోగించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది హెర్బల్ కానీ, న్యాచురల్ రెమిడీస్ ఎఫెక్టివ్ గా పనిచేయవని భావిస్తారు. కానీ ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని స్టడీస్ తేల్చాయి.

మీ వయసుని బట్టి మీరు రోజుకి ఎన్ని పాలు తాగాలి ? మీ వయసుని బట్టి మీరు రోజుకి ఎన్ని పాలు తాగాలి ?

రెగ్యులర్ గా వాటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా.. రోగాలు ఆమడ దూరం ఉంటాయి. మీకు తెలుసా ఆధ్మాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. రకరకాల వ్యాధులను నయం చేసే సత్తా ఉంది. ఇక ఇన్ని ఔషధ గుణాలున్న తులసిని పాలతో మిక్స్ చేసి తీసుకుంటే.. చాలా పవర్ ఫుల్ బెన్ఫిట్స్ పొందవచ్చు.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

3 లేదా 4 తులసి ఆకులు తీసుకుని.. శుభ్రం చేయాలి. మరిగిన పాలల్లో కలపాలి. వాటిని ఒక కప్పులో తీసుకుని.. ప్రతి రోజు ఉదయం పరకడుపున తీసుకోవాలి. అంతే.. ఈ సింపుల్ పదార్థంతో.. ప్రయోజనాలు అమోఘం.

ప్లూ

ప్లూ

తులసిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం, పాలల్లో హీలింగ్ ప్రాపర్టీ ఉండటం వల్ల.. ఈ రెండింటిని మిక్స్ చేసి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫ్లూ వంటి లక్షణాల నుంచి వెంటనే బయటపడవచ్చు.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మనుషుల హార్ట్ ని హెల్తీగా, స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతాయి. పాలు గుండెకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. ఈ రెండింటి మిశ్రమం తీసుకోవడం వల్ల.. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఒత్తిడి తగ్గడానికి

ఒత్తిడి తగ్గడానికి

వేడి పాలు, తులసి కలిపి తీసుకోవడం వల్ల నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతుంది.

కిడ్నీ స్టోన్స్

కిడ్నీ స్టోన్స్

తులసి ఆకులు, పాల కాంబినేషన్ కిడ్నీల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించి, డెటాక్సిఫై చేస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో స్టోన్స్ కరిగిపోతాయి.

క్యాన్సర్

క్యాన్సర్

పాలు, తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల.. ఇమ్యున్ సిస్టమ్ బలంగా మారుతుంది. ఎలాంటి క్యాన్సర్ అయినా దరిచేరకుండా నివారించే శక్తి ఉంటుంది.

శ్వాస సంబంధ సమస్యలు

శ్వాస సంబంధ సమస్యలు

వేడి పాలు, తులసి ఆకుల కాంబినేషన్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, వాపు, కామన్ కోల్డ్, పొడి దగ్గు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ డ్రింక్.

తలనొప్పి నివారణకు

తలనొప్పి నివారణకు

చాలా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ తులసి, పాలు కలిపి ఒక గ్లాసు తాగండి. వెంటనే తలనొప్పి తగ్గడాన్ని మీరు గమనిస్తారు. ఎందుకంటే.. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. నొప్పి దూరమవుతుంది.

English summary

What Happens To Your Body When You Drink Tulsi With Milk?

What Happens To Your Body When You Drink Tulsi With Milk? To find out how the mixture of tulsi and milk can improve your health, read on!
Story first published: Thursday, June 9, 2016, 16:15 [IST]
Desktop Bottom Promotion