For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌న‌స విత్త‌నం, తేనె మిశ్ర‌మం తీసుకోవ‌డం వ‌ల్ల‌ పొందే మిరాకిల‌స్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ ని తిని ఎంజాయ్ చేస్తాం.. విత్త‌నాలు ప‌డేస్తాం. కానీ... మామిడిపండ్లు, గ్రేప్స్, యాపిల్స్ వంటి పండ్లు అన్నీ.. విత్త‌నాలు క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌ము. అవి రుచిలేకుండా, చేదుగా ఉంటాయి. అందుకే.. వాటిని ప‌డేస్తుంటాం. అయితే కొన్ని ర‌కాల పండ్ల విత్త‌నాలు, కూర‌గాయ‌ల విత్త‌నాల్లో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా స‌హాయ‌ప‌డ‌తాయి. అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

ప‌న‌స విత్త‌నం తిన‌డం వ‌ల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే.. తేనెతో క‌లిపి తీసుకుంటే.. ఫ‌లితాలు మ‌రింత ఎఫెక్టివ్ గా ఉంటాయ‌ట‌. తేనెతో క‌లిపి.. ప‌న‌స విత్త‌నాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన ప‌దార్థాలు
ఉడికించిన ప‌న‌స విత్త‌నాలు - 4 నుంచి 5
తేనె - ఒక టేబుల్ స్పూన్

త‌యారు చేసుకునే విధానం
అన్నింటినీ.. క‌లిపి బ్లెండ‌ర్‌లో వేసుకోవాలి. అన్నింటినీ.. బాగా మిశ్ర‌మం క‌లుపుకోవాలి.
మీరు ఒకటి లేదా 2 టేబుల్ స్పూన్స్ మిశ్ర‌మాన్ని తీసుకుని వేడినీటిలో క‌లిపి.. ప్ర‌తి రోజూ ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే తీసుకోవాలి.
ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల పొందే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇప్పుడు చూద్దాం..

బ‌రువు త‌గ్గ‌డానికి

బ‌రువు త‌గ్గ‌డానికి

ప‌న‌స విత్త‌నం, తేనెలో ప్రొటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది బాడీ ఫ్యాట్ ని త‌గ్గించ‌డానికి, బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

టెస్టిక‌ల్ ఆరోగ్యానికి

టెస్టిక‌ల్ ఆరోగ్యానికి

మ‌గ‌వాళ్ల పురుషాంగానికి బ్ల‌డ్ స‌ర్క్యులేష‌న్ మెరుగుప‌రుస్తుంది. ఈ న్యాచుర‌ల్ ప‌దార్థం.. మ‌గ‌వాళ్ల‌లో సంతానోత్ప‌త్తిని కూడా పెంచుతుంది.

క్యాన్స‌ర్ నివార‌ణ‌కు

క్యాన్స‌ర్ నివార‌ణ‌కు

ప‌న‌స విత్త‌నం, తేనె మిశ్ర‌మంలో ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి.. క్యాన్స‌ర్ క‌ణాల వృద్ధిని అడ్డుకుని.. క్యాన్స‌ర్ కి దూరంగా ఉండేలా చేస్తుంది.

జీర్ణ‌క్రియ మెరుగ‌వ‌డానికి

జీర్ణ‌క్రియ మెరుగ‌వ‌డానికి

ఈ హోంమేడ్, న్యాచుర‌ల్ ప‌దార్థం.. జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. పొట్ట‌లో యాసిడ్ లెవెల్స్ ని పెంచి.. గ్యాస్ట్రిక్స్, కాన్స్టిపేష‌న్ ని నివారిస్తుంది.

అనీమియా

అనీమియా

ప‌న‌స విత్త‌నం, తేనె మిశ్ర‌మం.. హెల్తీ రెడ్ బ్ల‌డ్ సెల్స్ ఉత్పత్తిని మెరుగుప‌రుస్తుంది. దీనివ‌ల్ల అనీమియాను నివారించ‌డం తేలిక‌వుతుంది.

సెక్స్ లైఫ్ మెరుప‌ర‌చ‌డానికి

సెక్స్ లైఫ్ మెరుప‌ర‌చ‌డానికి

ఈ న్యాచుర‌ల్ ప‌దార్థంలో ఆర్ఫోడిసియాక్ ఉంటుంది. ఇది.. రీప్రొడ‌క్టివ్ ఆర్గాన్స్ కి బ్ల‌డ్ ఫ్లోని పెంచి బ్రెయిన్ ద్వారా సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

కంటిచూపు మెరుగుప‌డ‌టానికి

కంటిచూపు మెరుగుప‌డ‌టానికి

ప‌న‌స విత్త‌నం, తేనె మిశ్ర‌మంలో విటమిన్ ఏ స‌మృద్దిగా ల‌భిస్తుంది. కాబ‌ట్టి.. కంటిలోని న‌రాల‌ను బ‌లంగా మార్చి.. కంటిచూపుని మెరుగుప‌రుస్తుంది.

English summary

What Happens To Your Body When You Eat Jackfruit Seeds With Honey?

What Happens To Your Body When You Eat Jackfruit Seeds With Honey? Normally, most of us, after we enjoy savouring a juicy fruit, we tend to throw away its seeds, right?
Story first published:Tuesday, July 26, 2016, 10:51 [IST]
Desktop Bottom Promotion