For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినీళ్లతో రోజు ప్రారంభిస్తే.. రోజంతా ఉత్సాహమే..

By Swathi
|

చల్ల చల్లని కొబ్బరినీళ్లు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. వీటిని ఉదయాన్నే తాగితే.. మరింత ఆరోగ్యకరం. ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరాన్ని డెటాక్సిఫై చేస్తుంది. దీంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం వల్ల మిమ్మల్ని రిఫ్రెష్ చేసి, ఎనర్జీని అందించి, వ్యాధినిరోధకత పెంచి, మిమ్మల్ని అనేక రకాల వ్యాధుల నుంచి అరికడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

కోకొనట్ వాటర్ తో గర్భిణీలకు ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగినప్పుడు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ని హార్మొనైజ్ చేసి.. అన్ని అవయవాల ప్రక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. మీకొక విషయం తెలుసా ? కొబ్బరినీళ్లలో ఎగ్ వైట్ కలుపుకుని బాగా మిక్స్ చేసి తీసుకుంటే.. పవర్ ఫుల్ ప్రొటీన్స్ అందుతాయట. ఉదయాన్నే కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

థైరాయిడ్

థైరాయిడ్

శరీరంలో థైరాయిడ్ హార్మోన్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి కొబ్బరినీళ్లు సహాయపడతాయి. కాబట్టి ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది.

కిడ్నీలకు

కిడ్నీలకు

కొబ్బరినీళ్లలో కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడే గుణాలున్నాయి. ఇవి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని అరికట్టి.. కిడ్నీ స్టోన్స్ ని నివారిస్తాయి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

కొబ్బరినీళ్లు ఉదయాన్నే తీసుకుంటే వ్యాధినిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఫ్లూ, చిగుళ్ల వ్యాధులను అరికడతాయి.

ఎసిడిటీ

ఎసిడిటీ

ఉదయాన్నే చల్లచల్లని కొబ్బరినీళ్లు తీసుకుంటే.. ఎసిడిటీ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

కొబ్బరినీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే.. పొట్టనిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో తక్కువగా ఆహారం తీసుకుంటారు. ఇలా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

అలసట

అలసట

మీరు ఎక్కువగా నీరసించిపోతున్నారా ? అయితే.. రోజుకి 60 ఎమ్ఎల్ కొబ్బరినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే.. అలసట మీ దరిచేరదు.

చర్మానికి

చర్మానికి

కొబ్బరినీళ్లు తీసుకుంటే.. చర్మ కాంతి పెరుగుతుంది. ఎందుకంటే.. ఇది మిమ్మల్ని హైడ్రెట్ చేసి.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

వ్యాయామం తర్వాత

వ్యాయామం తర్వాత

వ్యాయామం తర్వాత కొబ్బరినీళ్లలో ఎగ్ వైట్ కలుపుకుని తీసుకోవడం వల్ల.. శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందడంతోపాటు, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.

తలనొప్పి

తలనొప్పి

లేట్ నైట్ పార్టీతో ఉదయాన్నే వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. తలనొప్పి నుంచి వెంటనే రిలాక్స్ అవవచ్చు.

English summary

Why Drink Coconut Water In The Morning?

Why Drink Coconut Water In The Morning? Coconut water has detoxifying properties and many medicinal properties. What would be the best time to drink it if not in the morning?
Story first published: Saturday, February 20, 2016, 16:14 [IST]
Desktop Bottom Promotion