For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాకింగ్, జాగింగ్ కంటే తాడాటే ఎక్కువ క్యాలరీలు కరిగిస్తాయి.. !!

By Swathi
|

మనలో చాలామంది స్కూల్లో తాడాట అలవాటు ఉండే ఉంటుంది. కానీ.. పెద్దవాళ్లు అయ్యే కొద్దీ దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే.. క్యాలరీలు కరిగించడంలో.. తాడాటు వ్యాయామం అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి బరువు తగ్గడానికి తాడాటు చక్కటి పరిష్కారం.

కేవలం తాడు ఉపయోగించి చేసే ఈ వ్యాయామం వల్ల ఇతర వ్యాయామాల కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే.. రెగ్యులర్ గా తాడాటు ప్రతిరోజూ చేయడం వల్ల.. పొందే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి.

మోకాళ్లు బలపడటానికి

మోకాళ్లు బలపడటానికి

తాడాటు వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్స్, కదలికలు అవసరం లేదు. తాడాటు వల్ల మోకాళ్లు బలంగా మారుతాయి. కాబట్టి రెగ్యులర్ గా ఈ వ్యాయామం చేయడం మొదలుపెట్టండి.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

తాడాట వ్యాయామం ఏరోబిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే దీన్ని రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీ స్టామినా పెంచుకోవచ్చు.

రకరకాలుగా

రకరకాలుగా

తాడాటను రకరకాల పద్ధతుల్లో చేయవచ్చు. రెండు కాళ్లు ఎత్తి.. లాంగ్ జంప్ ద్వారా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చఅలాగే.. సింపుల్ గా మీ ఓపికకు తగ్గట్టు చేసినా.. ఈ వ్యాయామం ద్వారా కావాల్సిన ఫలితాలు పొందవచ్చు.

ఏకాగ్రత పెరగడానికి

ఏకాగ్రత పెరగడానికి

రెగ్యులర్ గా తాడాట వ్యాయామం చేయడం వల్ల కోఆర్డినేషన్ స్కిల్స్ పెరుగుతాయి. శరీరం రిధమిక్ గా జంప్ చేయడం వల్ల.. ఫోకస్, ఏకాగ్రత పెరుగుతుంది.

బ్రెయిన్ పవర్

బ్రెయిన్ పవర్

రోజ్ జంపింగ్ వల్ల.. బ్రెయిన్ పవర్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాలరీలు కరగడానికి

క్యాలరీలు కరగడానికి

తాడాట వ్యాయామం రెగ్యులర్ గా చేయడం వల్ల.. 12 వందల నుంచి 13 వందల క్యాలరీలు గంటలో కరిగిపోతాయి. వాకింగ్, జాగింగ్ కంటే.. తాడాట వ్యాయామం వల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించవచ్చు.

ఊపిరితిత్తులు

ఊపిరితిత్తులు

జంపింగ్ వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బ్రీతింగ్ కెపాసిటీ మెరుగుపడుతుంది. ఇది రోజువారీ యాక్టివిటీస్ ని హ్యాపీగా హ్యాండిల్ చేయడానికి సహాయపడుతుంది.

ఎముకల బలానికి

ఎముకల బలానికి

చాలా అధ్యయనాలు.. జంపింగ్ వల్ల ఎముకల బలాన్ని పెంచుతాయని సూచిస్తున్నాయి. తాడాట వల్ల జంపింగ్ ఉంటుంది. ఇది.. ఎముకల బలానికి సహాపడుతుంది. కాబట్టి.. రెగ్యులర్ గా తాడాట ఆడటం వల్ల ఎముకలు బలంగా మారతాయి.

English summary

Why Jumping Rope Is A Good Workout

Why Jumping Rope Is A Good Workout. Most of us have tried jumping the rope in school but we have ignored it since then.
Story first published:Tuesday, August 30, 2016, 14:40 [IST]
Desktop Bottom Promotion