For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ ఫీవర్ తగ్గించే పవర్ ఫుల్ ఆయుర్వేదిక్ రెమిడీస్..

By Swathi
|

వర్షాకాలం వచ్చిందంటే.. దాంతో పాటు వైరస్, బ్యాక్టీరియా వంటివి కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ శరీరంలో రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్ ల కారణంగా మనుషులకు రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉంటేనే.. హెల్తీగా ఉండటానికి సాధ్యమవుతుంది.

వైరల్ ఇన్ఫెక్షన్స్, సాధారణ జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, ర్యాషెస్, అలసట వంటి లక్షణాలు వైరల్ ఫీవర్ కి సంకేతం. వైరల్ ఫీవర్ ఎటాక్ అయినప్పుడు దాన్ని డీల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. మామూలు జ్వరానికి, వైరల్ ఫీవర్ ని గుర్తించడానికి ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.

శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం వల్ల.. మొత్తం ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంది. సాధారణంగా వైరల్ ఫీవర్ ఎటాక్ అయినప్పుడు యాంటీ బయోటిక్స్ ఉపయోగిస్తాం. కానీ.. ఎక్కువగా వాటిపై ఆధారపడటం వల్ల.. ఇమ్యునిటీ సిస్టమ్ తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడలేకపోతుంది.

కాబట్టి వైరల్ ఫీవర్ తో పోరాడే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమిడీస్.. మీకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ హోం రెమిడీస్ ఉపయోగించడం వల్ల.. వైరల్ ఫీవర్ తో పాటు, ఇన్ఫెక్షన్ లక్షణాల నుంచి కూడా బయటపడవచ్చు. కాబట్టి ట్యాబ్లెట్స్ తీసుకోవడం కంటే.. ఈ సింపుల్ హోం రెమిడీస్ ద్వారా గ్రేట్ రిలీఫ్ పొందండి.

These Remedies Actually Cure Viral Fever

కొత్తమీర టీ
కొత్తిమీర ఆకులలో ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్ కె ఉండటం వల్ల.. ఎలాంటి అనారోగ్య సమస్యనైనా నివారిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కొత్తిమీరలో ఉండటం వల్ల.. ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. వైరల్ ఫీవర్ కి కారణమయ్యే ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ కాకుండా అరికడుతుంది.

These Remedies Actually Cure Viral Fever

కొత్తిమీర టీ తయారు చేసే విధానం
ఒక కప్పు మరుగుతున్న నీటిలో 4 నుంచి 5 కొత్తిమీర రెబ్బలు వేయాలి. 15 నుంచి 20 నిమిషాలు అవి నీటిలోనే ఉంచాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి.. ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తీసుకోవాలి. ఈ టీని రోజంతా తాగుతూ ఉంటే.. త్వరిత ఉపశమనం కలుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరం నివారించవచ్చు.

These Remedies Actually Cure Viral Fever

తులసి ఆకులు
తులసి ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల.. వైరల్ ఫీవర్ ని న్యాచురల్ గా, ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇవి ఇమ్యునిటీ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. రోగాలకు కారణమయ్యే పాథగెన్స్ తో పోరాడటానికి ఇవి నిరూపితమైన పరిష్కారం. కొన్ని తులసి ఆకులను నీటిలో ఉడికించి తాగాలి. ఈ టీని కొంత విరామం తీసుకుంటూ.. తాగుతూ ఉండటం వల్ల.. మార్పులు గమనించవచ్చు.

తేనె, వెల్లుల్లి
వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఏళ్లుగా ఈ రెండు పదార్థాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వెల్లుల్లి, తేనెలో మెడిసినల్ గుణాలు ఉండటం వల్ల దీన్ని ఉపయోగిస్తారు. న్యాచురల్ యాంటీ బయోటిక్స్ లా పనిచేస్తాయి. ఈ రెండు పదార్థాలు ఇమ్యునిటీని కూడా పెంచుతాయి.

These Remedies Actually Cure Viral Fever

తయారు చేసే విధానం
వెల్లుల్లి రెబ్బ తీసుకుని తేనెకు కలిపి క్రష్ చేయాలి. రోజుకి కనీసం 2 నుంచి 3 మూడు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్, జ్వరం నివారించవచ్చు.

గమనిక
ఒకవేళ ఈ రెమిడీస్ చెప్పినట్టు ఫాలో అయినా.. జ్వరం తగ్గడం లేదంటే.. ఒకసారి డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే ఒకవేళ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. డాక్టర్ ని సంప్రదించి.. ఈ చిట్కాలు ఫాలో అవడం మంచిది.

English summary

Wow!! These Remedies Actually Cure Viral Fever!

Wow!! These Remedies Actually Cure Viral Fever! Arrival of monsoon is often accompanied by infection-causing bacteria and viruses that can wreak havoc in your day-to-day life.
Story first published:Monday, June 20, 2016, 15:07 [IST]
Desktop Bottom Promotion