For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యక్తిగత భాగాలలోని దురదను నివారించేందుకు 11 అద్భుతమైన హోమ్ రెమెడీస్

జననేంద్రియ మొటిమలు, మెనోపాస్, ఇన్ఫెక్షన్, కెమికల్స్ తో పాటు కొన్ని చర్మ సంబంధిత సమస్యల వలన దురద కలుగుతుంది. వీటితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం కూడా వ్యక్తిగత భాగాలలో దురద కలగటానికి ప్రధాన కారణంగ

|

వ్యక్తిగత భాగాలలో దురద కలగడం కొంచెం ఇబ్బందికరమైన సందర్భం. ప్రత్యేకంగా, బహిరంగ స్థలాలలో ఈ సమస్య కలిగితే మరింత ఇబ్బందికి దారి తీస్తుంది. ఇది సహజమే అయినా దీనిని నివారించేందుకు ప్రయత్నించవచ్చు. పనిమీద బయటికి వెళ్ళినప్పుడు వ్యక్తిగత భాగాలలో దురద కలగడం చేత దురదను నియంత్రించలేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.

అసలు, ఈ దురదకి కారణాలేంటో తెలుసుకుందాం. జననేంద్రియ మొటిమలు, మెనోపాస్, ఇన్ఫెక్షన్, కెమికల్స్ తో పాటు కొన్ని చర్మ సంబంధిత సమస్యల వలన దురద కలుగుతుంది. వీటితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం కూడా వ్యక్తిగత భాగాలలో దురద కలగటానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. సంభోగం తరువాత పాటించవలసిన కనీస పరిశుభ్రతా చర్యలు లేకపోవటం కూడా వ్యక్తిగత భాగాలలో దురదకు దారితీస్తుంది.

11 Home Remedies For Itching In Private Parts

ఈ సమస్య ఇలాగే కొనసాగితే సమస్య మరింత జఠిలంగా మారుతుంది. వ్యక్తిగత భాగాలలో విపరీతమైన దురదతో మీరు ఇబ్బందిపడుతూ ఉంటే ఈ సమస్యకి సరైన పరిష్కారం కోసం మీరు తప్పక ప్రయత్నించాలి. ఈ పాటికే మీరు మీ ప్రయత్నాలు ప్రారంభించి ఉండవచ్చు.

అయితే, ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా మీ కోసమే. ఇందులో, వ్యక్తిగత భాగాలలో కలిగే దురదని నివారించడం కోసం అద్భుతమైన 11 హోమ్ రెమెడీస్ ని పొందుపరచాము.

1. రోజ్ మేరీ లీవ్స్:

1. రోజ్ మేరీ లీవ్స్:

రోజ్ మేరీ అనే హెర్బ్ లో అనేక ఔషధ విలువలు కలవు. కొన్ని రోజ్ మేరీ ఆకులను తీసుకుని వాటిని నీళ్ళల్లో 20 నిమిషాల పాటు ఉడికించండి. చల్లార్చి, వడగట్టిన ఆ నీటితో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరచండి. ఈ రెమెడీ మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

2. ఆపిల్ సిడర్ వెనిగర్:

2. ఆపిల్ సిడర్ వెనిగర్:

ఆపిల్ సిడర్ వెనిగర్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలవు.

రెండు టీస్పూన్ల ఆపిల్ సిడర్ వెనిగర్ ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో కలపండి. ఈ నీటిని ప్రతిరోజూ త్రాగండి.

లేదా ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ ని ఒక కప్పుడు వెచ్చటి అలాగే చల్లటి నీటిలో కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరచండి.

3. తులసి ఆకులు:

3. తులసి ఆకులు:

యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలిగి ఉండటం చేత వ్యక్తిగత భాగాలలోని దురదను తరిమికొట్టే శక్తి తులసి ఆకులకు కలదు.

కొన్ని తులసి ఆకులను కొంత నీటిలో 20 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ తరువాత చల్లార్చి, వడగట్టిన ఆ నీటిని సేవించండి.

4. బోరిక్ యాసిడ్:

4. బోరిక్ యాసిడ్:

యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు బోరిక్ ఆసిడ్ లో సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్రాపర్టీస్ వలన వ్యక్తిగత భాగాలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

పావు టీస్పూన్ బోరిక్ యాసిడ్ ని ఒక కప్పుడు నీటిలో కలపండి. ఈ సొల్యూషన్ తో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరుచుకోండి.

5. టీ ట్రీ ఆయిల్:

5. టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు అధికంగా కలవు. అందువలన, వ్యక్తిగత భాగాలలో కలిగే దురద నుంచి తక్షణ ఉపశమనమివ్వడానికి టీ ట్రీ ఆయిల్ లోని ఈ ప్రాపర్టీలు ఉపయోగపడతాయి.

నాలుగు నుంచి ఆరు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను మీ స్నానపు నీటిలో కలపండి. ఆ నీటిలో కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రభావిత ప్రాంతం మునిగేలా చూడండి.

లేదా డైల్యూట్ చేయబడిన టీ ట్రీ ఆయిల్ ను నాలుగు నుంచి ఆరు చుక్కల వరకు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అలో వెరా జెల్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ వ్యక్తిగత భాగాలపై అప్లై చేయండి. కాసేపటి తరువాత స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకోండి.

6. చమోమైల్ టీ:

6. చమోమైల్ టీ:

దురదల నుంచి, బర్నింగ్ సెన్సేషన్ నుంచి అలాగే వ్యక్తిగత భాగాలలో వాపుల నుంచి తక్షణ ఉపశమనమివ్వడానికి చమోమైల్ హెర్బ్ ఉపయోగపడుతుంది.

ఒక టీస్పూన్ చమోమైల్ హెర్బ్ ని 2 కప్పుల నీటిలో కలుపుకుని అయిదు నిమిషాల వరకు మరగనివ్వండి.

ఈ సొల్యూషన్ ను వడగట్టి అందులో నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను కలపండి.

ప్రతి రోజూ కనీసం రెండు సార్లు ఈ సొల్యూషన్ తో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరుచుకోండి.

7. కొబ్బరి నూనె:

7. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో నున్న హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన చర్మానికి ఉపశమనం కలుగుతుంది. ప్రభావిత ప్రాంతంపై కొబ్బరినూనెను అప్లై చేయడం వలన దురద తగ్గుతుంది. వ్యక్తిగత భాగాలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే గుణం కొబ్బరి నూనెలో కలదు.

ప్రతి రోజూ ప్రభావిత ప్రాంతంపై కొబ్బరి నూనెను అప్లై చేయాలి.

ఆరు కప్పుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రపరచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

8. సముద్రపు ఉప్పు:

8. సముద్రపు ఉప్పు:

వ్యక్తిగత భాగాలలో ఇన్ఫెక్షన్స్ ను నశింపచేసే అద్భుతమైన గుణం సముద్రపు ఉప్పులో కలదు. హానికర బాక్టీరియా మరియు ఫంగై యొక్క పెరుగుదలను అడ్డుకుని వ్యక్తిగత భాగాల వద్ద దురదను నివారిస్తుంది.

2 కప్పుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కలిపి ఈ మిశ్రమంతో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ ఈ రెమెడీని పాటిస్తే దురద సమస్య తగ్గుముఖం పడుతుంది.

9. వేపాకులు:

9. వేపాకులు:

వేప ఒక ఔషధ మొక్క. శతాబ్దాలుగా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకు వేప నుంచి అద్భుతమైన పరిష్కారాలు లభిస్తున్నాయి. వేపలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలతో పాటు యాంటీ ఫంగల్ ప్రాపెర్టీలు కలవు.

గుప్పెడు వేపాకులను స్నానపు నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి.

4 కప్పుల నీటిలో కొన్ని వేపాకులను కలిపి పదినిమిషాల పాటు మరిగించాలి. చల్లార్చి, వడగట్టిన ఆ నీటితో మీ వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోవాలి.

10. పెరుగు:

10. పెరుగు:

పెరుగులో మంచి బాక్టీరియా ఉంటుంది. అందుకే, వ్యక్తిగత భాగాలలో దురదను నివారించేందుకు సమర్థవంతమైన సహజసిద్ధ రెమెడీగా పెరుగును పేర్కొంటారు.

తీపిలేని పెరుగుని ప్రతి రోజూ తీసుకున్నట్లైతే శరీరంలోని మంచి బాక్టీరియా స్థాయిలను పెంపొందిస్తుంది.

11. వెల్లుల్లి:

11. వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ బయాటిక్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. ఇవి, వ్యక్తిగత భాగాలలో విపరీతమైన దురదని నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

కొన్ని చుక్కల వెల్లుల్లి నూనెను తీసుకుని అందులో విటమిన్ ఈ నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావితమైన వ్యక్తిగత భాగాలపై అప్లై చేసి కాసేపటి తరువాత స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచండి.

English summary

11 Home Remedies For Itching In Private Parts

There can be persistent irritation and itchiness in your private parts due to many reasons. Therefore, it is very essential to keep your private part clean, in order to not face this kind of a worst problem in the future.
Story first published:Saturday, December 16, 2017, 15:22 [IST]
Desktop Bottom Promotion