For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు ఆ విషయంలో వీక్ అవ్వడానికి టెస్టోస్టెరాన్ లోపమట..!

|

టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవారిలో అతిముఖ్యమైన హార్మోన్.అది మగవాళ్ల శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఫేషియల్ హేర్, గంభీర స్వరం మాత్రమే కాదు, సెక్స్ కోరికలు పుట్టడానికి కూడా టెస్టోస్టిరోన్ హార్మోన్ కారణమవుతుంది. ఇది రకరకాల బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

ముఖ్యంగా లైంగిక సామర్థ్యం, రీప్రొడక్షన్, కండరాలు, స్టామినా, లిబిడో వంటి రకరకాల ఫంక్షన్స్ కి టెస్టోస్టెరాన్ హార్మోన్ సహాయపడుతుంది. ఈ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువైతే మాత్రం మగవారి శరీరంలో చాలారకాల మార్పులు వస్తాయి. అలాంటి కొన్ని మార్పుల ద్వారా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గాయని గమనించి చికిత్స మొదలుపెట్టాలి.

మగవాళ్లకు అత్యంత అవసరమైన టెస్టోస్టెరాన్ ని పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్..!మగవాళ్లకు అత్యంత అవసరమైన టెస్టోస్టెరాన్ ని పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్..!

టెస్టోస్టెరాన్ తగ్గితే మగవారిలో కనిపించే లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సైడ్ ఎఫెక్ట్స్

సైడ్ ఎఫెక్ట్స్

ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్డ్ గా, తక్కువగా ఉన్నాయంటే.. ఆరోగ్యంగా దుష్ర్పభావం పడుతుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కండరాలు బలహీనంగా మారడం, సెక్స్ పై ఆసక్తి తగ్గడం, ఎరెక్టల్ డిస్ ఫంక్షన్, అలసట, డిప్రెషన్, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఉదయాన్నే అంగం స్తంభించడం

ఉదయాన్నే అంగం స్తంభించడం

ఉదయాన్నే అంగం స్తంభించడం చాలా నేచురల్ గా జరిగే ప్రక్రియ. ఇది ఆరోగ్యవంతమైన సెక్సువల్ డ్రైవ్ కి సూచిక. ఉదయం పూట అంగస్తంభనలు కాకపోతే అది టెస్టోస్టిరోన్ లెవెల్‌లో తరుగుదలకి సూచిక అని గుర్తించాలి.

డిప్రెషన్

డిప్రెషన్

అదేపనిగా డిప్రెషన్ కి గురైతే కూడా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతున్నట్లే లెక్క. నిజానికి రివర్స్ లో డిప్రేషన్ టెస్టోస్టిరోన్ లో తరుగుదలకి కారణం అవుతుంది.

అకస్మాత్తుగా బరువు పెరగటం

అకస్మాత్తుగా బరువు పెరగటం

అకస్మాత్తుగా బరువు పెరగటం కూడా హార్మోనల్ బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

శృంగారంపై ఆసక్తి తగ్గడం

శృంగారంపై ఆసక్తి తగ్గడం

శృంగారంపై ఆసక్తి తగ్గడం టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గడానికి అతిపెద్ద సూచిక. సెక్స్ డ్రైవ్ ని పూర్తిగా దెబ్బతీస్తుంది లో-టెస్టోస్టీరోన్.

 టెస్టోస్టిరోన్ తగ్గినప్పుడు డయాబెటిస్ ప్రమాదం

టెస్టోస్టిరోన్ తగ్గినప్పుడు డయాబెటిస్ ప్రమాదం

టెస్టోస్టిరోన్ తగ్గినప్పుడు డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది. మెటబాలిజం దెబ్బతిని కొలెస్టెరాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, బీపి కూడా పెరిగిపోతుంది.

బాగా అలసటగా ఉండటం

బాగా అలసటగా ఉండటం

బాగా అలసటగా ఉండటం, అసలు ఏ పనిలో కూడా ఆసక్తిగా అనిపించకోవడం కూడా లో-టెస్టోస్టీరోన్ కి సూచన.

నిద్రకు అంతరాయం:

నిద్రకు అంతరాయం:

లో టెస్టోస్టెరాన్ వల్ల మరో లక్షణం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది తిరిగి ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది . కాబట్టి, టెస్టోస్టెరాన్ లెవల్స్ ను పెంచుకోవడానికి కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించడం ఉత్తమం.

బలాన్ని తగ్గిస్తుంది:

బలాన్ని తగ్గిస్తుంది:

టెస్టోస్టెరాన్ సరైన స్థాయిలో ఉండగలిగినప్పుడే పురుషుల్లో ఎనర్జీ మరియు బలం పుష్కలంగా ఉంటుంది. లేదంటే రెండూ తగ్గుముఖం పడుతాయి. అలాగే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కండరాల మీద కూడా పనిచేస్తుంది. శక్తి తగ్గడం వల్ల సాధరణ పనిమీద కూడా ఒత్తిడి పెరిగి టెస్టోస్టెరాన్ తక్కువ చేస్తుంది.

స్ఖలనం తగ్గిస్తుంది:

స్ఖలనం తగ్గిస్తుంది:

సాధారణ సమయంతో పోల్చితే, టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు పురుషుల్లో స్ఖలనం తగ్గిస్తుంది . అయితే ఈ సమస్యను మందులతో నివారించుకోవచ్చు.

అంగస్తంభనలు తక్కువ చేస్తుంది:

అంగస్తంభనలు తక్కువ చేస్తుంది:

మునపటితో పోల్చితే, టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గినప్పుడు, సెక్స్ స్పందన తక్కువగా ఉంటుంది. కాబట్టి డాక్టర్ ను సంప్రదించి హార్మోన్ లెవల్స్ ను కనుక్కొని సరైన చికిత్స చేయించుకోవాలి.

టెస్టికల్స్ (వృషణాలు) ష్రింక్ అవ్వడం జరుగుతుంది:

టెస్టికల్స్ (వృషణాలు) ష్రింక్ అవ్వడం జరుగుతుంది:

లో లెవల్ టెస్టోస్టెరాన్ టెస్టికల్స్ చిన్నగా మార్చడం లేదా సైజును తగ్గిచడం జరుగుతుంది.

English summary

12 warning signs of low testosterone in men should never ignore in Telugu

Here are a few signs that could indicate low levels of testosterone in Men should never ignore.
Desktop Bottom Promotion