For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో బాడీ హీట్..పొట్టనొప్పిని తగ్గించే సింపుల్ టిప్స్ ..!

|

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సరైన శుభ్రత పాటించకపోవడం, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, చెడిన ఆహారాలు తినడం వల్ల పొట్ట సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా కడుపు నొప్పి ప్రారంభమవుతుంది. మన శరీరంలో పొట్ట ఒక ముఖ్యమైన భాగం. మనం తినే ఆహారంను జీర్ణింప చేయడంలో ఇది గొప్పగా సహాయపడుతుంది. జీర్ణశక్తికి ఏదైనా అంతరాయం కలిగితే పొట్ట నొప్పి , దినచర్యను మరింత కష్టంగా మార్చుతుంది.

16 Home Remedies to Treat Stomach Pain

పొట్టనొప్పితో బాదపడే వారిలో నొప్పితో పాటు ఇన్ఫ్లమేసన్, అజీర్తి, మలబద్దకం, పొట్ట భాగంలో తిమ్మెర్లు వంటి లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలతో తరచూ పొట్ట నొప్పి వస్తుంటే , అది ఆరోగ్యానికి ఒక ప్రమాదకరమైన సంకేతంగా గుర్గించాలి. అందువల్ల పొట్టనొప్పితో పాటు , పైన సూచించిన లక్షణాలు కూడా ఉన్నట్లైతే ఫుడ్ పాయిజ్ కు కూడా సంకేతమే. అంతే కాదు వేసవి కాలంలో డీహైడ్రేషన్, బాడీ హీట్ వల్ల కూడా పొట్ట నొప్పి వస్తుంటుంది. కాబట్టి, పొట్టినొప్పి లక్షణాలను లేదా సంకేతాలను సీరియస్ గా తీసుకుని, ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఉపయోగించి సమస్యను వెంటనే నయం చేసుకోవాలి. మరి ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం..

అల్లం :

అల్లం :

అల్లం పొట్టనొప్పిని తగ్గించడం మాత్రమే కాదు, పొట్టను విశ్రాంతి కలిగిస్తుంది. రెగ్యులర్ డైట్ టో అల్లం చేర్చుకోవడం, అలాగే జింజర్ టీ, లేదా అల్లం చిన్న ముక్క రోజూ నమలడం అలవాటు చేసుకుంటే పొట్ట నొప్పి నుండి ఉపశమనం కలగవచ్చు.

చమోమెలీ టీ :

చమోమెలీ టీ :

చమోమెలీ టీలో ఉండే ఔషధ గుణాలు పొట్టనొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పితో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. అందువల్ల రెగ్యులర్ డైట్ లో 2-3 కప్పుల చమోమెలీ టీ తాగడం వల్ల వల్ల నొప్పిని తగ్గించుకోవచ్చు.

సెలరీ :

సెలరీ :

కొత్తిమీర లేదా ధనియాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్టనొప్పి తగ్గించుకోవచ్చు. ధనియాలతో తయారుచేసిన కషాయం తాగడం వల్ల కూడా పొట్టనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. గోరువెచ్చగా తాగితే మరిత ఎఫెక్టివ్ గా రిలీఫ్ పొందుతారు.

 పుదీనా:

పుదీనా:

గుప్పెడు పుదీనా ఆకులను లెమన్ వాటర్ తో మిక్స్ చేసి తాగితే కూడా స్టొమక్ పెయిన్ నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

సాల్ట్ వాటర్ :

సాల్ట్ వాటర్ :

స్టొమక్ పెయిన్ కు ఇన్ స్టాంట్ రెమెడీ సాల్ట్ వాటర్ . గోరువెచ్చని నీటిలో సాల్ట్ వాటర్ మిక్స్ చేసి, తాగడం వల్ల సమస్యను వెంటనే తగ్గించుకోవచ్చు. రోజూ తాగినా కూడా పొట్ట సమస్యలను నివారించుకోవచ్చు.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

పొట్ట సమస్యలను నివారించడంలో బేకింగ్ సోడా గ్రేట్ రెమెడీ.ఎలాంటి నొప్పైనా బేకింగ్ సోడా, వాటర్ మిక్స్ డ్రింక్ వల్ల నివారించుకోవచ్చు. అయితే వేడినీళ్లు మరింత బెటర్ రిజల్ట్ అందిస్తుంది.

సోంపు:

సోంపు:

పొట్ట సమస్యలను నివారించడంలో సోంపు గ్రేట్ రెమెడీ. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందువల్ల సోంపును ప్రతి మీల్స్ లో జోడిస్తే మంచిది. భోజనం చేసిన ప్రతి సారి కొన్ని సోంపు గింజలు నమలడం వల్ల అమేజింగ్ బెనిఫిట్స్ పొందుతారు.

తేనె :

తేనె :

తేనెలో జీర్ణశక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పొట్టనొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్ గా తేనె తీసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశనమం కలుగుతుంది.

ఇంగువ:

ఇంగువ:

ఇంగువను వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వంటలకు మంచి ఫ్లేవర్ ను ఇస్తుంది, ఫేవర్ మాత్రమే కాదు, ఇంగువలో ఉండే ఔషధ గుణాలు పొట్టనొప్పిని తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది పొట్టలో గ్యాస్, కడుపుబ్బరంను నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

ధనియాలు:

ధనియాలు:

వేడినీళ్ళలో ధనియాలు వేసి ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల కూడా పొట్టనొప్పి, జీర్ణ సమస్యలు, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. స్టొమక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

 ఆమ్లా:

ఆమ్లా:

పొట్ట నొప్పి తగ్గించడంలో ఉసిరికాయ గ్రేట్ గా పనిచేస్తుంది. ఇండియన్ గూస్బెర్రీని తీసుకోవడం వల్ల వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్టనొప్పి, జీర్ణసమస్యలు, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

 మింట్ టీ:

మింట్ టీ:

పుదీనా ఆకులను నీళ్ళలో వేసి ఉడికించి, రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ పొట్టనొప్పిని తగ్గిస్తుంది. ఫ్రెష్ కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల బాడీ హీట్ తగ్గడంతో పాటు పొట్టనొప్పి తగ్గి, జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది.

పెరుగు:

పెరుగు:

రోజూ రెగ్యులర్ మీల్స్ లో ఒక కప్పు పెరుగు తీసుకోవడం చాలా అవసరం. పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రెగ్యులర్ గా పెరుగు తింటుంటే, స్టొమక్ పెయిన్ తగ్గుతుంది.

యాపిల్స్ :

యాపిల్స్ :

యాపిల్స్ ను డైలీ తినడం వల్ల , ఆపిల్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ స్టొమక్ పెయిన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పొట్ట నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

హెవీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం నివారించాలి.

హెవీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం నివారించాలి.

పొట్ట నొప్పితో బాధపడే వారు హెవీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం నివారించాలి. అలాగే భోజనం తర్వాత రోజులో మద్యమద్యలో నీళ్లు తాగడం వల్ల పొట్ట నొప్పి తగ్గించుకోవచ్చు.

English summary

16 Home Remedies to Treat Stomach Pain

16 Home Remedies to Treat Stomach Pain ,Unhealthy eating habits, improper hygiene, consumption of contaminated food and etx expose us to the problem of stomah pain. For Stomach pain use these following home remedies to cure the problem completely..
Desktop Bottom Promotion