For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు+ మిరియాలు కలిపి తీసుకుంటే వీటిలోని ఔషధగుణాలు రెట్టింపు

పసుపుకు, మిరియాలు కలిపి తీసుకుంటే వాటిలో శక్తియే వేరు..

By Staff
|

జీవితం సాఫీ సాగాలంటే ఒక మంచి పార్ట్నర్ ఉండాలి. అలాగే ఒక ఆటలో సక్సెస్ సాధించాలంటే అందులో కూడా గట్టి పోటీనిచ్చే ఆటగాడు ఉండాలి. ఇది కేవలం జీవితం, కెరీర్ కు సంబంధించినదే కాదు. మనం రోజూ తీసుకునే ఆహారాల్లో కూడా కొన్ని జంటగా తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో సాధించవచ్చు అంటున్నారు నిపునులు. అలాంటి వాటిలో పసుపు, బ్లాక్ పెప్పర్ బెస్ట్ పార్ట్నర్స్ అని చెప్పవచ్చు. పసుపు, నల్ల మిరియాలు విడివిడిగా తీసుకుంటేనే ఎన్నో ఉపయోగాలున్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఆ ఉపయోగాలను రెట్టింపు చేయాలంటే ఈ రెండు కలిపి తీసుకోవాలి.

రోజూ మనం వంటల్లో వాడే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్లాక్ పెప్పర్ లో కూడా అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడుతాయి. బరువును ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. గ్యాస్ , పొట్ట సమస్యలను, చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి !

పసుపును, బ్లాక్ పెప్పర్ తో చేర్చి తీసుకోవడం వల్ల , పసుపులో ఉండే కుర్కుమిన్ కంటెంట్ ఎలాంటి సమస్య అయినా త్వరగా నయం అవుతుంది. అలాగే బ్లాక్ పెప్పర్ లో ఉండే పెప్పరైన్ అనే కంటెంట్ అద్భుతమైన , ఘాటైన రుచి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కుర్కుమిన్ లో ఔషధ గుణాలు ఉన్నాయి. కుర్కుమిన్, పెప్పరైన్ రెండు కలవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.ముఖంగా శరీరంలో బయోఅవాలబులిటీ పెరుగుతుంది.

black pepper

బయోఅవాలబులిటీ అంటే ఏమి?

మనం రోజూ తీసుకునే ఆహారాల ద్వారా పోషకాలు శరీరానికి సరిపడా అందజేసి, శరీరానికి చేర్చి జీవక్రియలకు సహాయపడే వాటినే బయోఅవాలబులిటీ అంటారు. అయితే ఈ పోషకాలనేటివి అన్ని రకాల ఆహారాల్లో ఉండవు. అదే విధంగా పసుపులో కూడా, పసుపులో చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఎక్కువ ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే అంశం శరీంరలోకి త్వరగా షోషింపబడుతుంది, త్వరగా బటకు పంపేస్తుంది. అందువల్ల పసుపును రోజువారి ఆహారాల్లో తీసుకుని పూర్తి ప్రయోజనాలను పొందరు.

బ్లాక్ పెప్పర్ లోని పెప్పరిన్ అనే కంటెంట్ శరీరంలోకి చేరి, పసుపు శరీరం నుండి బయటకు నెట్టివేయకుండా ఆపు చేసి, పూర్తి ప్రయోజనాలు అందేలా చేస్తుంది. కాలేయం నుండి కుర్కుమిన్ శరీరం గ్రహించేలా జీవక్రియను ప్రోత్సహిస్తుంది. దాంతో శరీరం పసుపును నిదానంగా గ్రహించి ఉయోగించుకుంటుంది. పసుపులోని కుర్కుమిన్ వల్ల జీవక్రియల పనిచేయడం ఆలస్యం అవుతుంది. దాంతో పొట్టలో పసుపు నిల్వ ఉండటం వల్ల శరీరానికి అవసరమయ్యే ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేసి, శరీరానికి పూర్తిగా అందిస్తుంది.

black pepper

నరాలలో టాక్సిన్ చేరకుండా పెప్పర్, టర్మరిక్ సహాయపడుతాయి

పసుపులో ఉండే ఫాలీఫినాల్ కుర్కుమిన్ నరాలకు రక్షణ కల్పిస్తుంది. నరాలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. పసుపు, బ్లాక్ పెప్పర్ రెండు కలిపి తీసుకోవడం వల్ల నరాల డ్యామేజ్ తగ్గినట్లు ఎలుకల మీద ప్రయోగం చేసి కనుగొన్నట్లు కొంత మంది పరిశోధకులు నిర్ధారించారు.

black pepper

గాల్ బ్లాడర్ లో గాల్ స్టోన్స్ ఏర్పడకుండా బ్లాక్ పెప్పర్, పసుపుకు సహాయపడుతుంది

హైఫ్యాట్ డైట్ వల్ల గాల్ స్టోన్స్ ఏర్పడకుండా పసుపు సహాయపడుతుంది. దీని శక్తిని పెంచడానికి బ్లాక్ పెప్పర్ ను పసుపుతో కలిపి ఇవ్వడం వల్ల గాల్ స్టోన్స్ తొలగిపోయినట్లు గుర్తించారు.

బ్లాక్ పెప్పర్ పసుపుతో కలిపి తీసుకున్నప్పుడు ఎముక విచ్ఛిన్నం కాకుండా కణాలను కాపాడుతుంది

అనవసరమైన ఎముక కణాలు ఎముకలోని కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది రక్తంలోనికి మినిరల్స్, క్యాల్షియంను విడుదల చేస్తుంది. దాంతో కీళ్ళనొప్పులు, కీళ్ళవాపులకు దారితీస్తుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి బ్లాక్ పెప్పర్, పసుపు కాంబినేషన్ గ్రేట్ గా సహాయపడుతుందని నిపుణుల సూచిస్తున్నారు.. దాంతో ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంటున్నారు.

English summary

3 reasons why you should always have turmeric with black pepper

Turmeric and black pepper are two accomplished giants that are great on their own. Turmeric has numerous antimicrobial and anti-inflammatory properties.
Desktop Bottom Promotion