For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ :పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా బ్యాక్ పెయిన్ తగ్గించే 7 టిప్స్..!

బ్యాక్ పెయిన్ నివారించుకోవడం కోసం డాక్టర్ వద్దకు వెలితే ఖచ్చితంగా కొన్ని పెయిన్ కిల్లర్స్ ను సూచిస్తుంటారు, ఇది బాడీ సిస్టమ్ కు హాని కలిగిస్తాయి. దీర్ఘ కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.

|

ప్రస్తుత రోజుల్లో వెన్ను నొప్పి సమస్యలతో బాధ పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. వెన్ను నొప్పి కూడా ఒక సాధారణ సమస్యగా తయారవుతున్నది. అందుకు జీవన శైలే ముఖ్య కారణం .

బాడీ పెయిన్స్ వల్ల శరీరంలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. అంతే కాదు ఒంటి నొప్పుల వల్ల దినచర్య మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

బాడీ పెయిన్ అత్యంత బాధాకరమైన నొప్పిగా బావిస్తారు. మన శరీరంలో వెన్నెముక అత్యంత ముఖ్యమైన అవయవం, వెన్నుముక లేకుంటే శరీరానికి సపోర్ట్ ఉండదు. కాళ్ళు చేతుల్లో కదలికలుండవు. నడవాలన్నా, కూర్చోవాలన్నా వెన్నెముక సపోర్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందే .

వెన్ను నొప్పి క్రమం తప్పకుండా బాధిస్తుంటే, తప్పని సరిగా సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి లేదంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది .

బ్యాక్ పెయిన్ కు అనేక కారణాలుండవచ్చు, గాయాలు, ఆక్సిడెంట్స్ వల్ల ఏర్పడే గాయాలు, అన్ హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాడ్ సిట్టింగ్ పొజీషన్, వీక్ బోన్స్, బోన్ లిగమెంట్స్ లో ఇన్ఫెక్షన్స్ మొదలగు కారణాలు కావచ్చు.

బ్యాక్ పెయిన్ నివారించుకోవడం కోసం డాక్టర్ వద్దకు వెలితే ఖచ్చితంగా కొన్ని పెయిన్ కిల్లర్స్ ను సూచిస్తుంటారు, ఇది బాడీ సిస్టమ్ కు హాని కలిగిస్తాయి. దీర్ఘ కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ బదులుగా కొన్ని నేచురల్ మార్గాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

టిప్ #1

టిప్ #1

నవ్వు. కొన్ని తమాష విషయాల వల్ల సంతోషంగా నవ్వడం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్ అనే హార్మోన్ లెవల్స్ పెరుగుతాయి. ఇది బ్యాక్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

టిప్ #2

టిప్ #2

డి స్ట్రెస్. స్ట్రెస్ వల్ల కూడా బ్యాక్ మజిల్స్ స్టిఫ్ గా మారుతాయి. మజిల్ టైట్ నెస్ వల్ల బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు .

టిప్ #3

టిప్ #3

వారంలో ఒకసారి మంచి ప్రొఫిషినల్స్ తో బ్యాక్ మసాజ్ చేసుకోవడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.

టిప్ #4

టిప్ #4

బ్యాక్ పెయిన్ కొద్దిగా ఉన్నప్పుడే చిన్న చిన్న వ్యాయామాలు మొదలు పెట్టాలి. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల వెన్నుకు రక్తప్రసరణ అందుతుంది. అంతే కాదు, శరీరంలో ఎండోర్ఫిన్ ఉత్పత్తి అవుతుంది, దాంతో బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

టిప్ #5

టిప్ #5

ప్రతి రోజూ ఉదయం బ్యాక్ స్ట్రెచెస్ చేయడం వల్ల , బాడీ ఫుల్ గా స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాక్ మజిల్స్ వదులౌతాయి, నొప్పి తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

టిప్ #6

టిప్ #6

రోలింగ్ మసాజ్ తో బ్యాక్ మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ టెక్నిక్ వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వెన్ను నొప్పి తగ్గిస్తుంది.

టిప్ #7

టిప్ #7

వెన్ను నొప్పి ఉన్నప్పుడు వెన్నుకు ఐస్ ప్యాక్ లేదా హీట్ ప్యాక్ ను ను అప్లై చేయడం వల్ల వెన్ను నొప్పి , ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

English summary

7 Tips To Reduce Back Pain Without Painkillers

If you are experiencing constant back pain, even small tasks can seem strenuous and impair your movements to a considerable extent.There may be a number of reasons for the development of back pain such as injuries, an unhealthy lifestyle, bad posture, weak bones, infection of the bone ligaments, etc.
Story first published: Saturday, April 1, 2017, 14:16 [IST]
Desktop Bottom Promotion