For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో వాటర్ మెలోన్ మిస్ కాకుండా తినాలి అనడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్

వేసవిలో వాతావరణంలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్ గురి అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల హార్ట్, బ్రెయిన్, మరియు వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది.

|

వేసవి అంటేనే ఫ్రూట్స్ సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో మార్కెట్లో వివిధ రకాల ఫ్రూట్స్ కలర్ ఫుల్ గా నోరూరిస్తుంటాయి. ముఖ్యంగా రెడ్ కలర్లో జ్యూసీగా పిలల్లను, పెద్దలను ఆకర్షించే ఫ్రూట్ వాటర్ మెలోన్. వాటర్ మెలోన్లో అనేక న్యూట్రీషియన్స్ తో పాటు, వాటర్ కంటెంట్ అధికంగా ుంటుంది. వేసవిలో వేడి తాపం నుండి శరీరాన్ని రక్షించుకోవాలంటే, వాటర్ మెలోన్ తప్పనిసరిగా తినాల్సింది.

ఎందుకంటే వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 92శాతం వాటర్ కంటెంట్ ఉంటే, మిగిలిన ఆ ఎనిమిది శాతంలో బీటా కెరోటీన్, విటమిన్ ఎ, బి1, బి6 మరియు సి, పొటాషియం, మెగ్నీషియం, బయోటిన్ మరియు కాపర్లు అధికంగా ఉన్నాయి. ఇందులో 92శాతం వాటర్ కంటెంట్ ఉండటం వల్ల వేసవిలో ఎండ వేడి నుండి శరీరానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండ3ాలంటే, వేసవిలో దొరికే ఇతర ఫ్రూట్స్ ను కూడా ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ మెలోన్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ న్యూట్రీషియన్స్ క్యాలరీలను కరిగిస్తుంది. శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. అందుకే వాటర్ మెలోన్ పర్ఫెక్ట్ స్నాక్ గా తీసుకుంటారు.

8 Reasons Why Watermelon Is A Must Have This Summer

వాటర్ మెలోన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వాటర్ మెలోన్ జ్యూస్, స్నాక్, సలాడ్స్, టాపింగ్స్ ఇలా వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు.

వేసవిలో వాతావరణంలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్ గురి అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల హార్ట్, బ్రెయిన్, మరియు వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. శరీరంలో అవయవాలు చురుకుగా పనిచేయవు .దానికి తోడు డీహైడ్రేషన్, డయోరియా వంటి సమస్యలు ఎదురౌతాయి. కాబట్టి, ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదనుకుంటే ఈ వేసవి సీజన్ లో మిస్ కాకుండా వాటర్ మెలోన్ తినాల్సిందే...

 శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. :

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. :

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా శరీరంలో నీటి శాతం కోల్పోతారు. దాంతో డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. డీహైడ్రేషన్ సమస్యను నివారించుకోవడానికి వాటర్ మెలోన్ గ్రేట్ రెమెడీ.

శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

ఇతర సీజన్స్ లో వలే సమ్మర్ సీజన్ లో కూడా శరీరంను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరం డీహైడ్రేషన్ కు గురి కావడం మరియు శరీరంలో టాక్సిన్ తొలగించుకోకపోవడం వల్ల వేసవిలో వ్యాధులకు గురి కావల్సి వస్తుంది. వ్యాధులకు కారణమయ్యే అటువంటి టాక్సిన్స్ ను శరీరం నుండి తొలిగించుకోవడానికి వాటర్ మెలో గ్రేట్ రెమెడీ. వాటర్ మెలన్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది.

మంచి చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది:

మంచి చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది:

శరీరానికి సరైన విటమిన్స్ అంటే విటమిన్ ఎ మరియు సిలు అందకపోవడం వల్ల చర్మం పాలిపోవడం, డ్రైగా మారడం, అలసిపోవడం వంటి లక్షనాలు కనబడుతాయి. ఈ లక్షణాలను నివారించుకోవాలంటే ఈ బెస్ట్ నేచురల్ రెమెడీని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే . ఇంకా వాటర్ మెలోన్ లో ఉండే బీటా కెరోటిన్, మరియు లైకోపిన్ వంటివి సన్ బర్న్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:

వేసవిలో సీజన్ లో జీర్ణవ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంటుంది. వాటర్ మెలోన్ లో ఉండే వాటర్ కంటెంట్ మరియు ఫైబర్ కంటెంట్ , జీర్ణ వ్యవస్త సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఈ ప్రొసెస్ లోనే వాటర్ మెలోన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది .

బ్యూటి ఫుల్ హెయిర్:

బ్యూటి ఫుల్ హెయిర్:

వాటర్ మెలోన్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఇది వేసవిలో జుట్టు రాలే సమస్యలను నివారిస్తుంది . సమ్మర్ సీజలన్ వాటర్ మెలోన్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంటుంది కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ మెలోన్ లో ఉండే విటమిన్ సి , జుట్టును అందంగా, స్ట్రాంగ్ గా మార్చడానికి అవసరమయ్యే కెరోటిన్ గా మార్చుతుంది.

 బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది:

వాటర్ మెలోన్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ మరియు హైబపర్ టెన్షన్స్ క్రమబద్దం అవుతాయి. వీటితో పాటు, వాటర్ మెలోన్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటేంది. కాబట్టి, వాటర్ మెలోన్ ను సమ్మర్ సీజన్లో మిస్ కాకుండా తినాలి.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

వాటర్ మెలోన్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ వండర్ ఫుల్ ఫ్రూట్ కంటిం చూపును మెరుగుపరుస్తుంది. వాటర్ మెలోన్ లో ఉండే విటమిన్ ఎ కళ్ళ రెటీనాలో పింగ్మెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంచుంది. అలాగే వేసవిలో కంటి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

మూడ్ మెరుగుపరుస్తుంది:

మూడ్ మెరుగుపరుస్తుంది:

ఈ వండర్ ఫుల్ వాటర్ మెలోన్ లో మూడ్ ను మార్చే పవర్ ఫుల్ రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా విటిమన్ బి6 మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేసి గుణాలు అద్భుతంగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దినచర్యను వాటర్ మెలోన్ తో మొదలు పెట్టి, అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందండి..

English summary

8 Reasons Why Watermelon Is A Must Have This Summer

Summer is the time when we should focus more on fruits and veggies that contain water. There are numerous health benefits of watermelons. The nutrient dense, low calorie, super hydrating and yummy watermelons are the perfect snack in summer.
Story first published: Monday, April 3, 2017, 11:24 [IST]
Desktop Bottom Promotion