For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేదతీరడానికి...ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి టండా..టండా..కోకనట్ వాటర్

కోకనట్ వాటర్ లో అనేక న్యూట్రీషియన్స్ ఉన్నాయి. మరియు అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి వాటిని కోకనట్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయి.

|

వేసవికాలంలో ఎండలు మండుతుంటాయి, శరీరంలో నీరు అంత చెమట రూపంలో మాయం అవుతుంటుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురి అవ్వడం, శరీరం పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . కొబ్బరి నీరును వేసవికాలంలో తీసుకోవడానికి గల కారణం వీటిలో ఎక్కువ ప్రయోజనాలున్నాయి . కోకనట్ వాటర్ త్రాగినప్పుడు మీరు వెంటనే రిఫ్రెష్ గా పీలవుతారు.

కోకనట్ వాటర్ లో అనేక న్యూట్రీషియన్స్ ఉన్నాయి. మరియు అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి వాటిని కోకనట్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయి.

సమ్మర్లో దాహర్థిని తీర్చడం మాత్రమే కాదు, ఇది శరీరానికి అవసరం అయ్యే తేమను కూడా అందిస్తుంది. క్యాలరీలు తగ్గించుకోవాలని కోరుకొనే వారు కూడా కోకనట్ వాటర్ ను హ్యాపీగా తీసుకోవచ్చు.

కొబ్బరినీళ్ళు వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు కొన్నిహానికరమైన మైక్రో ఆర్గాన్స్ ను శరీరం నుండి తొలగిస్తుందని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. కాబట్టి, కోకనట్ వాటర్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా ప్రయోజనాలను అందిస్తున్నందు వల్ల వేసవికాలంలో సాద్యమైనంత మేర కోకనట్ వాటర్ ను తీసుకోవాలి. కోకనట్ వాటర్ లోని మరిన్ని లాభాలేంటో తెలుసుకుందాం..

డీహైడ్రేషన్:

డీహైడ్రేషన్:

శరీరంలో ద్రవాలు కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే సరిపడా కోకనట్ వాటర్ ను త్రాగాలి.

కిడ్నీఆరోగ్యం మెరుగుపడుతుండి.:

కిడ్నీఆరోగ్యం మెరుగుపడుతుండి.:

కోకనట్ వాటర్ యూరినరీ ట్రాక్ సిస్టమ్ ను చాలా మేలు చేస్తుంది . కోకనట్ వాటర్ లో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు కిడ్నీ స్టోన్స్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. . కోకనట్ వాటర్ త్రాగడం వల్ల పొందే ప్రయోజనాల్లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ .

హెల్త్ బెనిఫిట్స్ :

హెల్త్ బెనిఫిట్స్ :

కోకనట్ వాటర్ లో కొలెస్ట్రాల్ లెవల్స్ మరియు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అందుకే హాట్ సమ్మర్ లో కోకనట్ వాటర్ త్రాగడం చాలా మంచిది.

నేచురల్ డ్రింక్:

నేచురల్ డ్రింక్:

ఈ వేసవిలో, మీకు ఎక్కువ దాహంగా ఉన్నప్పుడు కెఫిన్ ఉన్న డ్రింక్స్ త్రాగడం ఆరోగ్యానికి మంచిది కాదు . కాబట్టి మీరు హెల్తీ మరియు నేచురల్ ప్రత్యామ్నాయాలను చూసినప్పుడు , కోకనట్ వాటర్ మొదట లిస్ట్ లో ఉంటుంది. ఇది మీ దాహాన్ని తీర్చడం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా.

ఇన్ఫెక్షన్:

ఇన్ఫెక్షన్:

వేసవిలో సూక్ష్మ క్రిములు చాలా తర్వాత వ్వాప్తి చెందుతాయి. అంతే కాదు అంతే త్వరగా శరీరాన్ని ఇన్ఫెక్షన్ కు గురి చేస్తాయి . కాబట్టి, కోకనట్ వాటర్ శరీరం మరియు ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పించడానికి కోకనట్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

మీరు కనుక స్పోర్ట్స్ లో ఉన్నట్లైతే తప్పనిసరిగా ఎనర్జి డ్రింక్స్ అవసరం అవుతాయి. హాట్ సమ్మర్ లో, ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

హ్యాంగోవర్స్ :

హ్యాంగోవర్స్ :

సమ్మర్ పార్టీ ఎంజాయ్ చేసిన తర్వాత మీరు కనుక హ్యాంగోవర్ తో నిద్రలేచినట్లైతే, వెంటనే కోకనట్ వాటర్ త్రాగండి . ఇది ఒక ఉత్తమ ప్రయోజనం

ఎసిడిటి:

ఎసిడిటి:

కోకనట్ వాటర్ శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది . కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల అజీర్తిని మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది .

English summary

8 Reasons Why You Need Coconut Water In Summer

There are so many benefits of coconut water in summer. You will feel refreshed when you just sip some coconut water on a hot sweaty summer noon.
Desktop Bottom Promotion