For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి భోజనం తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ పనులు చేయకండి..చేస్తే ఇక అంతే..

|

రాత్రి పూట భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రిస్తారు. ఇంకా కొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే రాత్రి పూట భోజనం తరువాత ఈ పనులను అస్సలు చేయకూడదు.

ఇవే కాదు, ఇంకా ఇలాంటివే కొన్ని పనులను రాత్రి పూట డిన్నర్ అవగానే చేయరాదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఎలాంటి అలవాట్లు హానికరంఉదయాన్నే ఎలాంటి అలవాట్లు హానికరం

వాకింగ్ చేయడం...

వాకింగ్ చేయడం...

రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే కొంత సేపు వాకింగ్ చేయాలని చెబుతారు. అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా అంటారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే తిన్న వెంటనే నడవడం వల్ల రక్తం చేతులకు, కాళ్లకు వెళ్తుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కనుక తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. అంతగా చేయాలనిపిస్తే ఒక గంట లేదా గంటన్నర పాటు వేచి ఉన్నాక చేయవచ్చు.

నీరు తాగడం...

నీరు తాగడం...

మన శరీరానికి నీరు అవసరమే. కానీ దాన్ని తగిన సమయంలోనే తాగాలి. ప్రధానంగా రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే నీటిని అస్సలు తాగరాదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉండాలి. లేదంటే జీర్ణవ్యవస్థ పనికి ఆ నీరు అడ్డు పడుతుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది.

పండ్లు తినడం...

పండ్లు తినడం...

రాత్రి పూట భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే రాత్రి పూట డిన్నర్ తరువాత పండ్లను తింటే దాంతో పొట్ట ఉబ్బరంగా తయారవుతుంది. గ్యాస్ సమస్యలు వస్తాయి. దీంతోపాటు తిన్నది కూడా సరిగ్గా జీర్ణమవదు.

పురుషులు.. ఎక్కువగా కోపం తెప్పించే ఆ 10 విషయాలు..!? పురుషులు.. ఎక్కువగా కోపం తెప్పించే ఆ 10 విషయాలు..!?

పళ్లు తోముకోవడం...

పళ్లు తోముకోవడం...

డిన్నర్ చేసిన వెంటనే దంతాలను తోముకోవడం కూడా చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే దంతాల మీద ఉన్న ఎనామిల్ పొర తొలగిపోతుంది. అప్పుడు దంతాలు తమ సహజ కాంతిని కోల్పోతాయి. కాబట్టి డిన్నర్ చేసిన వెంటనే పళ్లు తోముకోరాదు. కనీసం 30 నిమిషాల పాటు అయినా వేచి ఉండాలి. ఆ తరువాతే ఆ పని చేయాలి.

పొగ తాగడం...

పొగ తాగడం...

డిన్నర్ చేసిన వెంటనే కాదు, అసలు ఏ సమయంలోనూ, ఎప్పుడూ కూడా స్మోకింగ్ చేయరాదు. దాంతో క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అయితే ఆ అలవాటును మానలేం అనే వారు, కనీసం డిన్నర్ చేశాకైనా మానేయడం మంచిది. ఎందుకంటే డిన్నర్ చేసిన వెంటనే స్మోకింగ్ చేస్తే సాధారణ సమయంలో చేసిన స్మోకింగ్ కన్నా క్యాన్సర్ వచ్చే రిస్క్‌ను మరింతగా పెంచుతుంది.

టీ, కాఫీ తాగడం...

టీ, కాఫీ తాగడం...

చాలా మంది డిన్నర్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. నైట్ షిఫ్ట్ చేసే వారైతే అలా తాగేవారు ఇంకా ఎక్కువగానే ఉంటారు. నిజానికి అలా డిన్నర్ అయిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగితే జీర్ణ క్రియకు ఆటంకం ఏర్పడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. ప్రధానంగా ఐరన్‌ను శరీరం ఏమాత్రం గ్రహించలేదు. కనుక తిన్న వెంటనే కాఫీ, టీ తాగరాదు.

స్నానం చేయడం...

స్నానం చేయడం...

తిన్న వెంటనే స్నానం చేసినా అప్పుడు కూడా రక్త ప్రసరణ శరీరంలోని ఇతర భాగాలకు జరుగుతుందే తప్ప జీర్ణ వ్యవస్థకు సరిగ్గా జరగదు. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరగదు.

30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని 9 ఖచ్చితమైన పనులు 30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని 9 ఖచ్చితమైన పనులు

నిద్రించడం...

నిద్రించడం...

డిన్నర్ చేసిన వెంటనే నిద్రించరాదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ పెరగడంతోపాటు తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. అప్పుడు అధికంగా బరువు పెరుగుతారు. కాబట్టి నిద్రించడానికి రెండు గంటల ముందే భోజనం చేయాలి.

English summary

8 Things You Should Not Do After Dinner

8 Things You Should Not Do After Dinner,If you’re the type of person that likes to do certain things after eating, then you should take a close look at the following list, to see those things that are unhealthy, and must be avoided by you. Because the truth is not every after-meal habit is good for your healt
Desktop Bottom Promotion