For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్న్ సిల్క్ టీ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ...

|

లేత మొక్కజొన్న కండెలు నిప్పుల మీద కాల్చుకుని తింటే రుచిగా ఉండడమేకాక, ఆరోగ్యానికి ఎంతో మంచిది. మొక్కజొన్నలో పోషక విలువలు ఎన్నో ఉన్నాయి. మొక్కజొన్న గింజల్లో ఐరన్‌, ఫాస్పరస్‌ ఎక్కువగానే ఉంటాయి. మొక్కజొన్నను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తినడమే కాకుండా దాని నుంచి తయారు చేసే నూనెలో 'ప్యూఫా' శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో 'విటమిన్‌ ఇ' కూడా అధికం.

అంతేకాదు, మొక్కజొన్న కండెలో తెల్లగా, మెత్తగా పట్టులాగా ఉండే పోగులు ఉంటాయి. దీన్ని 'కార్న్‌ సిల్క్‌' అంటారు. ఈ కార్న్‌సిల్క్‌తో టీ తయారుచేసుకోవచ్చు. ఇది యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌కు మంచి ఔషధం. అలాగే బీపీనీ తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కార్న్ సిల్క్ లో స్టిగ్ మాస్టరోల్, మరియు సిటోస్టిరోల్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది హార్ట్ డిసీజ్ లను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ప్లాంట్ యాసిడ్స్ ఉండటు వల్ల ఇది ఓరల్ మరియు స్కిన్ కండీషన్స్ ను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. మరి, కార్న్‌ సిల్క్‌ టీ ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

పొడిగా ఉన్న కార్న్‌సిల్స్‌ని టీ కి ఉపయోగించాలి. రెండు కప్పుల నీటిని 10 నిమిషాలు వేడిచేయాలి. ఈ వేడినీటిలో కార్న్‌సిల్క్‌ని వేసి పావుగంట మీడియం మంట మీద ఉంచాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేసి తాగాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కార్న్ లో కంటే కార్న్ సిల్క్ టీలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందాం:

1. విటమిన్ సి అంధిస్తుంది:

1. విటమిన్ సి అంధిస్తుంది:

కార్న్ సిల్క్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ ,. ఇది శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారిస్తుంది దాంతో కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను తగ్గించుకోవచ్చు . ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో శరీరంలోని అన్ని బాగాలకు రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది

2. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

2. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి కార్న్ సిల్క్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను పెంచుతుంది . హార్ట్ ఫెయిల్యూర్ వారికి, హైకొలెస్ట్రాల్ తో బాధపడే వారికి, డయాబెటిస్ వారికి కార్న్ సిల్క్ టీ ఒక నేచురల్ ట్రీట్మెంట్ ..

3. గౌట్ తగ్గిస్తుంది :

3. గౌట్ తగ్గిస్తుంది :

కార్న్ సిల్క్ టీలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి . గౌట్, ఆర్థరైటిస్ కు సంబంధించిన నొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కార్న్ సిల్క్ టీని రోజూ మూడు కప్పులు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . గౌట్ పెయిన్ క్రమంగా తగ్గడం ప్రారంభమైనప్పుడు, రోజుకు ఒక కప్పు టీ తాగితే చాలు.

4. బెడ్ బెట్టింగ్ నివారిస్తుంది:

4. బెడ్ బెట్టింగ్ నివారిస్తుంది:

బెడ్ వెట్టింగ్ పిల్లల్లో ఇది ఒక సాధారణ సమస్య. కార్న్ సిల్క్ టీ ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఈ సమస్యను నివారించుకోవడానికి , ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు 1 కప్పు కార్న్ సిల్క్ టీ తాగడం వల్ల సమస్య తగ్గుతుంది

5. కిడ్నీ సమస్యలను నివారిస్తుంది :

5. కిడ్నీ సమస్యలను నివారిస్తుంది :

కిడ్నీ సమస్యలను నివారించడంలో కార్న్ సిల్క్ టీ గ్రేట్ హోం రెమెడీ. కిడ్నీల పనితీరును , మూత్రంలో మంట, నొప్పి, ఇన్ఫెక్షన్స్, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, కిడ్నీ స్టోన్స్ వంటి ఎన్నో సమస్యలకు ఒక మంచి ఔషధం కార్న్ సిల్క్ టీ .

6. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

6. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

కార్న్ సిల్క్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణసమస్యలను నివారిస్తుంది. కార్న్ సిల్క్ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయంలో జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . ఈ జీర్ణరసాలు గాల్ బ్లాడర్ లో నిల్వచేసి, తిన్న ఆహారం సరిగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది

7. బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది :

7. బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది :

కార్న్ సిల్క్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పాటు మన శరీరానికి అవసరమయ్యే విటమన్స్ లో విటమిన్ కెను అందిస్తుంది. విటమిన్ కె బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంది . ముఖ్యంగా ప్రసవించిన తల్లిలో బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుంది.

8. యూరిన్ పెంచుతుంది :

8. యూరిన్ పెంచుతుంది :

8. యూరిన్ పెంచుతుంది :

9. న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది:

9. న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది:

కార్న్ సిల్క్ టీ లో బీటాకెరోటిన్ , రెబోఫ్లెవిన్, మెంతోల్, థైమల్, సెలీనియం, నియాసిన్ మరియు లెమనిన్ తో పాటు ఇతర న్యూట్రీషియన్స్ కూడ పుష్కలంగా ఉన్నాయి . ఇవి అన్ని రకాల ప్లాంట్ ఫుడ్స్ లోను దొరకవు, .ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

10. రాషెస్ మరియు స్కిన్ అలర్జీలను నివారిస్తుంది :

10. రాషెస్ మరియు స్కిన్ అలర్జీలను నివారిస్తుంది :

కార్న్ సిల్క్ టీని వివిధ రకాల స్కిన్ సమస్యల నివారణకు ఉపయోగిస్తుంటారు. స్కిన్ రాషెస్, బాయిల్స్ మరియు చర్మంలో దురద, నొప్పి, కీటకాలు కుట్టిన లక్షనాలను, స్క్రాప్స్, మరియు మైనర్ కట్స్ ను నివారిస్తుంది . ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . దాంతో ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

10 Amazing Health Benefits Of Corn Silk Tea

Corn silk contains stigmasterol and sitosterol, which are highly effective in preventing heart disease and high cholesterol. It also has plant acids that help in improving oral and skin conditions as well as regulating glucose levels in your body. The most common way to make use of corn silk is in the form of tea. You should definitely make corn silk tea a staple in your home.
Story first published:Monday, June 6, 2016, 16:13 [IST]
Desktop Bottom Promotion